దిండోరీ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో దిండోరీ జిల్లా ఒకటి.దిండోరీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా జబల్‌పూర్ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 6,128 చ.కి.మీ. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర తూర్పు భూభాగంలో చత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఉంది.

దిండోరీ జిల్లా
दिन्डोरी जिला
మధ్య ప్రదేశ్ పటంలో దిండోరీ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో దిండోరీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుjabalpur
ముఖ్య పట్టణంDindori, Madhya Pradesh
Area
 • మొత్తం6,128 km2 (2,366 sq mi)
Population
 (2011)
 • మొత్తం7,04,218
 • Density110/km2 (300/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత65.47%
 • లింగ నిష్పత్తి1004
Websiteఅధికారిక జాలస్థలి
దిండోరిలో నర్మద

సరిహద్దులు మార్చు

జిల్లా తూర్పు సరిహద్దులో మండ్లా జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉమరియా జిల్లా, దక్షిణ సరిహద్దులో చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పూర్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు మార్చు

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి :-దిందోరి, షాపురా, మెహంద్వని, అమర్పుర్, బజగ్, కరంజియ, సమ్నపుర్.

ప్రజలు మార్చు

జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన బైగా ప్రజలు 64% ఉన్నారు. వీరిని ఈ ప్రానానికి చెందిన స్థానికులుగా భావిస్తున్నారు.

ఆర్ధికం మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దిండోరీ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో గోధుమ, వరి, మొక్కజొన్న, కొడొ - కుత్కి, రాంతిల్, ఆవాలు, మసూర్, మాతర్, పప్పుధాన్యాలు, అల్సి, సోయాబీన్ ప్రధానంగా పండించబడుతున్నాయి..

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 704,218, [2]
ఇది దాదాపు. భూటాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 501వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 94 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.26%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1004:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.47%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఖనిజ వనరులు మార్చు

  • బాక్సైట్ : ఈ ఖనిజ కుకురి దాదర్ (బాల్కో) లో అందుబాటులో ఉంది.
  • బొగ్గు : ఈ ఖనిజ దుల్లాపూర్ (షాపురా) లో అందుబాటులో ఉంది.
  • 'ఒక్రాస్' : ఈ ఖనిజ అమ్నిపిపరియ, లొడాఝిర్మల్, అమ్నిపిపరియా ఆర్.వై.టి అందుబాటులో ఉంది.
  • వైట్ యాష్ : ఈ ఖనిజ ముద్కి మాల్ లో అందుబాటులో ఉంది.
  • హై ఐరన్ లాటరైట్ : ఈ ఖనిజ పదరియా మల్, పదరియ, కలామల్, నయాగయోన్ మాల్ లో అందుబాటులో ఉంది.
  • 'సున్నపురాయి ' : ఈ ఖనిజ బాసి కియరి, కంహరి అందుబాటులో ఉంది.
  • 'కాటరైట్ ': ఇది ఖనిజ నివాస్ మాల్ లో అందుబాటులో ఉంది.

భాషలు మార్చు

దిండోరీ జిల్లాలో పలు భాషలు వాడుకలో ఉన్నాయి. చత్తీస్‌గరి, 72.91% హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[5] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది ) [6] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[5]

వృక్షశిలాజాలు మార్చు

దినోదరి జిల్లా " ది ఘుఘుయా ఫాసిల్ నేషనల్ పార్క్ మధ్య ప్రదేశ్ "లో అపురూపమైన వృక్షసంబంధిత అమూల్యమైన శిలాజ సంపద ఉంది. ఈ శిలాజాలు 31 గెనరాకు చెందిన 18 వృక్షకుంటుమాలకు చెందినవని భావిస్తున్నారు . ఈ వృక్షాలు ఈ ప్రాంతంలో జీవ ఆవిర్భావం గురించిన పలు రహస్యాలను వెలువరుస్తున్నాయి. ఈ శిలాజాలు 66 మిలియన్ సంవత్సరాల పూర్వపువని భావిస్తున్నారు. చక్కగా సరంక్షించబడుతున్న ఈ శిలాజాలలో వృక్షాలు, క్లైంబర్స్, పండ్లు, విత్తనాలు కనుగొనబడ్డాయి. వీటిలో పలు ఏకదళబీజ వృక్షాలు ఉన్నాయి. 66 మిలియన్ సంవత్సరాల పూర్వం నాటివని భావిస్తున్న శిలాజాలు " ఘుఘుయా ఫాసిల్ పార్క్‌లో చక్కగా సంరక్షించబడుతున్నాయి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bhutan 708,427
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Alaska 710,231
  5. 5.0 5.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు మార్చు

వెలుపలి లింకులు మార్చు