1969లో మారియో పుజో రచించిన ది గాడ్‌ఫాదర్ అనే నవల ఆధారంగా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దర్శకత్వంలో 1972లో నిర్మింపబడిన ది గాడ్‌ఫాదర్ చలనచిత్రం ప్రపంచ సినీ చరిత్రలో అత్యుత్తమమయిన సినిమాగా పరిగణింపబడుతున్నది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డులు అందుకోవడమే కాక మరెన్నో ప్రశంసలు అందుకొని ఎన్నో జాబితాల్లో అగ్రభాగాన నిలిచింది.

ది గాడ్‌ఫాదర్
theatrical poster
దర్శకత్వంఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా
రచన'
మారియో పుజో నవల
Screenplay:
Mario Puzo
Francis Ford Coppola
Robert Towne
(uncredited)
నిర్మాతAlbert S. Ruddy
తారాగణంమార్లోన్ బ్రాండో
Al Pacino
James Caan
Robert Duvall
Diane Keaton
ఛాయాగ్రహణంGordon Willis
కూర్పుWilliam H. Reynolds
Peter Zinner
Marc Laub[1]
Murray Solomon[1]
సంగీతంNino Rota
Carmine Coppola
పంపిణీదార్లుParamount Pictures
విడుదల తేదీ
15 మార్చి
సినిమా నిడివి
175 నిముషాలు
దేశంఅమెరికా
భాషఆంగ్లం
బడ్జెట్$6,000,000 (అంచనా.)
బాక్సాఫీసు$245,066,411 (worldwide)

కథాంశం

మార్చు

1945లో తన కూతురి వివాహ విందు జరుగుతున్న సమయంలో 'గాడ్‌ఫాదర్‌'గా అందరితో పిలువబడే డాన్ విటో కోర్లియోన్ తన పెంపుడు కొడుకు, సలహాదారు అయిన టాం హేగన్‌తో కలసి తనవద్దకు వచ్చిన వారి అభ్యర్థలను స్వీకరిస్తుంటాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న డాన్ రెండవ కొడుకు మైఖేల్ తన గర్ల్ ఫ్రెండ్ కేతో కలసి విందుకు హాజరయి తన తండ్రి నేర చరిత్ర గురించి చెపుతూ తాను అటువంటి వాడు కాదు అంటాడు.

విందుకు అప్పటి ప్రముఖ గాయకుడయిన జానీ ఫోంటాన హాజరయి తాను ఒక సినిమాలో నటించడానికి ఆ స్టూడియో అభిపతి అంగీకరించడంలేడని డాన్ దగ్గర మొరపెట్టుకుంటాడు. అది విన్న డాన్ స్వయానా టాంను కాలిఫోర్నియాకు పంపుతాడు. స్టూడియో యజమాని అయిన వోల్జ్ తాను ఎంతగానో ఇష్టపడే నటీమణిని వలలో వేసుకున్న జానీ ఫాంటానాను సినిమాలో నటుడిగా తీసుకోనని టాంతో చెప్తాడు. మరుసటి రోజు ఉదయం వోల్జ్ నిద్ర లెచినపుడు దుప్పటిలో తనకు ఎంతో ఇష్టమయిన $600,000 విలువగల గుర్రం తల ఉండడం చూసి భయకంపితుడవుతాడు.

టాం న్యూయార్క్ తిరిగివచ్చినప్పుడు శత్రు మాఫియా కుటుంబం అయిన టటాలియా మద్దతు ఉన్న సొలోజ్జో అనే డ్రగ్ డీలర్ డాన్‌తో సమావేశమవుతాడు. సొలోజ్జో తాను చేయబోయే మాదకద్రవ్యాల వ్యాపారానికి అవసమయిన డబ్బు, రాజకీయ, చట్టపరమయిన సహాయం కావాలని కోరుతాడు. అప్పటికే తన పెద్ద కొడుకు సన్నీ, టాం డ్రగ్స్ వ్యాపారం వల్ల చాలా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పినప్పటికీ, డ్రగ్స్ వ్యాపారం వల్ల తనకున్న విలువపోతుందని తాను సహాయం చేయనని సొలోజ్జోకు చెప్తాడు డాన్. తర్వాత సొలోజ్జో గురించి మరిన్ని వివరాలు తెలుకొనడానికి తన ముఖ్య అనుచరుడయిన లూకా బ్రాజిని పంపుతాడు.

ఇది జరిగిన తరువాత డాన్ పైన హత్యాప్రయత్నం జరుగుతుంది. పలుమార్లు కాల్చబడినా డాన్ బ్రతుకుతాడు. అదే సమయంలో లూకా బ్రాజిని సొలోజ్జో హతమారుస్తాడు. సొలోజ్జో ఆ తరువాత టాంని బంధించి తన వ్యాపారానికి సహాయం చెయ్యవలసిందిగా సన్నీని ఒప్పించమని ఆదేశిస్తాడు. సన్నీ అందుకు ఒప్పుకొనక తన అనుచరులతో కలసి టటాలియా కొడుకును హత్య చేయిస్తాడు.

తన తండ్రి పైన జరిగిన హత్యాయత్నాన్ని తెలుసుకొని మైఖేల్ తన తండ్రి ఉన్న హాస్పిటల్‌కు వచ్చి అక్కడ అవినీతిపరుడయిన పోలీస్ అధికారి కాప్టెన్ మెక్క్లుస్కి చేతిలో దెబ్బలు తింటాడు. డాన్ కుటుంబ సభ్యులతో సమావేశానికి ఆహ్వానం పంపుతాడు సొలోజ్జో. కేవలం మైఖేల్ ఒక్కడే ఆ సమావేశానికి హాజరయి సొలోజ్జోను, కాప్టెన్ మెక్క్లుస్కీని కాల్చి చంపుతాడు. ఇది తెలుసుకొన్న సన్నీ వెంటనే తన తమ్ముడిని సిసిలీకి పంపించి మిగిలిన ఐదు కుటుంబాల పైన యుద్ధం ప్రకటించి పోలీసుల సహకారంతో వారి కార్యకలాపాలకు అవరోధం కలిగిస్తాడు.

 
డాన్ విటో కోర్లియోన్‌గా మార్లాన్ బ్రాండో

కొద్ది కాలానికి ఒక రోజు సన్నీ తన చెల్లెలయిన కాన్నీని ఆమె భర్త కార్లో కొట్టాడని తెలుసుకొని కార్లోని తీవ్రంగా కొట్టి మరొక్కసారి తన చెల్లెలిని కొడితే ప్రాణాలు తీస్తాను అంటాడు. పగతో కార్లో శత్రువులయిన టటాలియా, బార్జినిలతో చేతులు కలుపుతాడు. కట్టుదిట్టమయిన భద్రతలో ఉన్న సన్నీని బయట రప్పించడానికి కార్లో మరొక్కసారి తన భార్యను కొడతాడు. ఇది తెలుసుకొని సన్నీ ఒంటరిగా బయలుదేరి దారి మధ్యలో హతమవుతాడు.

పెద్దకొడుకు మరణవార్త విన్న డాన్ మిగితా మాఫియా నాయకులను సమావేశపరచి తన మూడవ కొడుకయిన మైఖేల్‌కు ఎటువంటి హానీ తలపెట్టకపోతే వారి వ్యాపారాలకు పూర్తి సహకారం అందించడానికి ఒప్పుకుంటాడు. ప్రాణహాని లేదన్ని సంగతి తెలిసిన మైఖేల్ అమెరికాకు తిరిగి వస్తాడు. ఏడాది తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ అయిన కేని కలుసుకొని ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు. డాన్ ఆరోగ్యం సరిగా లేకపోవడం, తన రెండవ అన్నయ్య ఫ్రేడో సమర్థుడు కాకపొవడంతో మైఖేల్ మొత్తం కుటుంబ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెడతాడు. ఐదేళ్ళలో అన్ని వ్యాపారాలు చట్టబద్దం చేస్తానని తన భార్యకు మాట ఇస్తాడు మైఖేల్.

మైఖేల్ కుటుంబం మొత్తం న్యూయార్క్ నుండి నెవాడాకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తాడు. తన చెల్లెలి భర్త అయిన కార్లో నెవాడాలో తన ముఖ్య అనుచరుడిగా పని చేస్తాడని టాం కేవలం ఒక లాయర్‌గా మాత్రమే ఉంటాడని ప్రకటిస్తాడు. కొద్ది రోజులకు డాన్ గుండిపోటుతో మరణిస్తాడు. తన చెల్లిలి కొడుకు బాప్టిజం జరుగుతున్న సమయంలో మిగిలిన ఐదు కుటుంబాల బాస్‌లను తన అనుచరులతో హత్య చేయిస్తాడు. తన అన్నను హత్య చేయించడంలో కార్లో పాత్ర ఉందని కార్లోతో నిజం చెప్పిస్తాడు. కొద్ది క్షణాలకే కార్లో హతమవుతాడు.

చివరగా, కాన్నీ తన భర్తను చంపించినది నువ్వే అంటూ మైఖేల్‌ను నిలదీస్తుంది. అది చూసి మైఖేల్ భార్య అయిన కే కూడా నిలదీసినపుడు కార్లోని తాను హత్య చేయించలేదని అబద్ధం చెప్తాడు మైఖేల్. అనుచరులు ఒక్కొక్కరు వచ్చి మైఖేల్‌ను డాన్‌గా గౌరవిస్తారు.

నిర్మాణం

మార్చు
 
టాం హేగన్‌గా రాబర్ట్ డువాల్ (ఎడమ), మైఖేల్ కోర్లియోన్‌గా అల్ పచినో (కుడి)

డాన్ విటో కోర్లియోన్ పాత్ర పోషించడానికి మార్లాన్ బ్రాండోను ఎన్నుకున్నాడు దర్శకుడయిన కొప్పాలా. కానీ అప్పటికే ఇతర చిత్రాలలో బ్రాండోతో ఎదుర్కొన్న సమస్యలవల్ల చిత్ర నిర్మాత అయిన పారామవుంట్ పిక్చర్స్ ఒప్పుకోలేదు. పారామవుంట్ పిక్చర్స్ అధినేతలను కొప్పాలా ఎంతో బ్రతిమాలుకున్న తర్వాత బ్రాండో అప్పటి తన పారితోషికం కంటే తక్కువ పారితోషికానికి నటించాలి, స్క్రీన్ టెస్ట్ తీసుకోవాలి, చిత్ర నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు అన్న షరతులతో ఒప్పుకున్నారు.

మైఖేల్ పాత్రకు పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఇటాలియన్-అమెరికన్ లా కనిపించే అల్ పచినోను ఎన్నుకోవడం కూడా నిర్మాతలకు రుచించలేదు. అల్ పచినో పొడవు తక్కువ ఉండడం, కేవలం రెండు చిత్రాల అనుభవం మాత్రమే ఉన్నందువల్ల అతనిని నటుడుగా తీసుకోవడానికి నిర్మాతలు ఒప్పుకోక ఇతర నటులను తీసుకోవలసిందిగా కొప్పాలాకు సూచించారు. అల్ పచినోను మైఖేల్ పాత్రకు ఎంపిక చేయకుంటే తాను దర్శకత్వం చేయనని కొప్పాలా చెప్పడంతో నిర్మాతలు ఒప్పుకున్నారు.

చిత్ర నిర్మాణం 1971 మార్చి 29 న మొదలయి 1971 ఆగష్టు 6 న అనుకున్న ప్రణాళికకంటే ఆరు రోజులు ముందుగా 77 రోజుల్లో పూర్తి అయినది. ఈ చిత్రంలో గుర్రం తలను చూపించడాన్ని జంతు హక్కుల సంఘం తీవ్రంగా ఆక్షేపించింది. ఈ చిత్రం కోసం తాము గుర్రం తల ఖండిచలేదని, అది ఒక ఆహారపదార్థాల కంపెనీ పంపిందని కొప్పాలా వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

చిత్ర నిర్మాణం న్యూయార్క్, కాలిఫోర్నియా, సిసిలీలలో జరిగింది.

స్పందన

మార్చు

విడుదల తర్వాత ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నది. దాదాపు అన్నిచోట్ల ప్రపంచ సినీ చరిత్రలో అత్యుత్తమమయిన చిత్రంగా ప్రశంసలు అందుకున్నది. అప్పటివరకు ఉన్న బాక్సాఫీసు కలెక్షన్లను ఈ చిత్రం తిరగరాసింది. $6,000,000 తో నిర్మించబడి $81,500,000 కలెక్షన్లు సాధించి నిర్మాతలకు అమిత లాభాలను ఆర్జించింది. 11 విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు ఎన్నికయి 3 విభాగాల్లో ఆస్కార్ గెలుచుకుంది.

ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో గ్యాంగ్‌స్టర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఆ సంవత్సర ఆస్కార్ అవార్డులలో మార్లోన్ బ్రాండోకి ఉత్తమ నటుడు అవార్డు లభించింది.
మార్లొన్ బ్రాండొ పొషించిన డాన్ విటొ కొర్లీయొన్ పాత్రను రెండవ భాగంలో పొషించిన రాబర్ట్ డి నీరొకి 1974 సంవత్సర ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు పొందారు. ఒకే పాత్రను పొషించిన ఇద్దరు నటులకు ఆస్కార్ రావడం ఇదే ప్రథమం.

ఇతర లింకులు

మార్చు

వనరులు

మార్చు
  1. 1.0 1.1 Allmovie Production credits