ది గ్రేట్ ఇండియన్ కిచెన్
ది గ్రేట్ ఇండియన్ కిచెన్, 2021లో విడుదలైన మలయాళం సినిమా. మ్యాన్ కైండ్ సినిమాస్, సిమ్మెట్రీ సినిమాస్, సినిమా కూక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జియో బేబీ దర్శకత్వం వహించాడు.[1]
ది గ్రేట్ ఇండియన్ కిచెన్ | |
---|---|
దర్శకత్వం | జియో బేబీ |
రచన | జియో బేబీ |
నిర్మాత | డిజో అగస్టిన్ జొమోన్ జాకబ్ విష్ణు రాజన్ సాజిన్ ఎస్ రాజ్ |
తారాగణం | నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడు |
ఛాయాగ్రహణం | సలూ కే థామస్ |
కూర్పు | ఫ్రాన్సిస్ లూయిస్ |
సంగీతం | సూరజ్ ఎస్ కురుప్(పాటలు) మాథ్యూస్ పులికన్ (నేపథ్య సంగీతం) |
నిర్మాణ సంస్థలు | మ్యాన్ కైండ్ సినిమాస్ సిమ్మెట్రీ సినిమాస్ సినిమా కూక్స్ |
పంపిణీదార్లు | నీ స్ట్రీమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 15 జనవరి 2021 |
సినిమా నిడివి | 100 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
కథ
మార్చుకేరళలోని సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువతి(నిమీషా సజయన్)కి స్కూల్ టీచర్(సూరజ్ వెంజరమూడు) తో పెళ్ళవుతుంది. మ్యారేజ్ కు ముందు డాన్సర్ గా పేరు తెచ్చుకోవాలని, డాన్స్ టీచర్ కావాలని ఆ అమ్మాయి కలలు కుంటుంది. కానీ పెద్దలు కుదిర్చిన సంబంధానికి తలొగ్గి పెళ్ళి చేసుకున్నాక, ఆమె కలలన్నీ కల్లలు అవుతాయి. భర్తకు, మామ (టి. సురేశ్ బాబు)కి ముప్పూటలా వండి పెట్టడమే ఆమె జీవితంగా మారిపోతోంది. ఇంటి పని మొత్తం ఆమె ఒక్కతే చేసుకోవాలి. అంతేకాదు… వంటలు చేసేప్పుడు మిక్సీ, గ్రైండర్ వంటివి వాడకూడదు, రుబ్బురోలే ఉపయోగించాలి. దొడ్డు బియ్యాన్ని ప్రెజర్ కుక్కర్ మీద పెట్టకూడదు, కట్టెల పొయ్యిమీదే వండాలి. బట్టలను వాషింగ్ మిషన్ లో ఉతక కూడదు, చేత్తో బండకేసి బాది మాత్రమే ఉతకాలి. ఆ నవ వధువుకు ఇలాంటి ఆంక్షలు లక్షా తొంభై ఉంటాయి! వీటికి అదనంగా రాత్రి అయితే భర్తగారి మరో ఆకలీ తీర్చాలి! కష్టాన్ని కడుపులోనే దాచుకుని, పంటి బిగువున భరిస్తూ, ఏదో చదువుకు తగ్గ ఉద్యోగాన్ని చేస్తానంటే భర్త, మావ ససేమిరా అంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ‘ది గ్రేట్ ఇండియన్ కిచన్’కు ఓ నమస్కారం పెట్టి, అందులోంచి ఎలా బయట పడిందన్నదే ఈ సినిమా కథ. [2]
నటీనటులు
మార్చు- నిమిషా సజయన్ -భార్య, డాన్సర్
- సూరజ్ వెంజరమూడు - శాడిస్టు భర్త, స్కూల్ టీచర్
- టి. సురేశ్ బాబు - ఆచ్చాన్ [3]
- అజిత - అమ్మ
- రమాదేవి - అమ్మాయి (రమాదేవి)
- కాబాని - ఉష, పని మనిషి
- సిధార్థ శివ - భర్త, పిన్న తమ్ముడు
- అనుపమ- నిమీషా సజయన్ తల్లి
- ఎంవి సురేష్ బాబు - నిమీషా సజయన్ తండ్రి
- నిశిత కల్లింగళ్ - సూరజ్ మరదలు
- గిరీష్ పెరించీరి - గురుస్వామి
- అపర్ణ శివగామి - సామజిక కార్యకర్త
- సురేష్ ఆచూస్ - న్యూస్ రీడర్
సాంకేతిక నిపుణులు
మార్చు- దర్శకత్వం జియో బేబీ
- నిర్మాతలు: డిజో అగస్టిన్, జొమోన్ జాకబ్, విష్ణు రాజన్, సాజిన్ ఎస్ రాజ్
- రచన: జియో బేబీ
- సంగీతం:సూరజ్ ఎస్ కురుప్ (పాటలు), మాథ్యూస్ పులికన్ (నేపథ్య సంగీతం)
- ఛాయాగ్రహణం: సలూ కే థామస్
- కూర్పు: ఫ్రాన్సిస్ లూయిస్
- నిర్మాణ సంస్థ: మ్యాన్ కైండ్ సినిమాస్, సిమ్మెట్రీ సినిమాస్, సినిమా కూక్స్
మూలాలు
మార్చు- ↑ NTV-Telugu News (16 April 2021). "రివ్యూ : ది గ్రేట్ ఇండియన్ కిచెన్". NTV-Telugu News. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ Andhrajyothy (15 April 2021). "'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
- ↑ "ചിരിച്ചുകൊണ്ട് കഴുത്തറക്കുന്ന അമ്മായിച്ഛൻ; ആ നടൻ ഇവിടെയുണ്ട്". Malayala Manorama. 18 January 2021. Retrieved 19 January 2021.