దీపికా కామయ్య

బాలీవుడ్, దక్షిణ భారత సినిమా నటి, మోడల్.

దీపికా కామయ్య (ఆంగ్లం: Deepika Kamaiah) బాలీవుడ్, దక్షిణ భారత సినిమా నటి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా ఫైనల్‌కు చేరిన దీపికా కన్నడ బిగ్ బాస్ రెండో సీజన్‌లో కూడా పాల్గొన్నది.

దీపికా కామయ్య
జననం
వృత్తిసినిమా నటి, మోడల్.
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం

మార్చు

దీపికా కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించింది. తల్లి ఉపాధ్యాయురాలు. దీపికా బెంగుళూరులోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. 2009లో బిషప్ కాటన్ ఉమెన్స్ క్రిస్టియన్ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేసింది.

వృత్తిరంగం

మార్చు

మోడలింగ్

మార్చు

11వ తరగతి చదువుతున్నప్పుడే మోడలింగ్ లోకి ప్రవేశించిన దీపికా, 2009లో ఫెమినా మిస్ ఇండియా సౌత్ అందాల పోటీలో ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. 2010లో లైక్రా ఎంటీవి స్టైల్ అవార్డులను కూడా గెలుచుకుంది.

సినిమా

మార్చు

తమిళ దర్శకుడు కులైందై వీరప్పన్ దర్శకత్వం వహించిన అన్మై తవరేల్ సినిమాలో తొలిసారిగా నటించింది.[1] 2012లో వచ్చిన చింగారి అనే కన్నడ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. తన నటనకు ప్రశంసలు అందుకుంది. [2][3] దీపక్ తిమ్మయ్య దర్శకత్వం వహించిన నేనే బారి నేనే అనే సినిమాలో కూడా నటించింది.[4] ఆటో రాజా సినిమాలో నటించింది.[5] రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో షాహిద్ కపూర్, ఇలియానా నటించిన ఫాటా పోస్టర్ నిక్లా హీరో సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[6] [7]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2011 ఆణ్మై తవరేల్ నందిని తమిళం
2012 చింగారి గీత కన్నడ
2013 ఆటో రాజా రాగిణి కన్నడ ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డుకు నామినేట్ చేయబడింది
2013 ఫటా పోస్టర్ నిక్లా హీరో హిందీ
2014 డమాల్ డుమీల్ తమిళం
2015 నేనే బారి నేనే కన్నడ ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డుకు నామినేట్ చేయబడింది
2016 జగ్గు దాదా కన్నడ అతిథి పాత్ర
2016 దేవరవ్నే బిదు గురూ కన్నడ [8]

మూలాలు

మార్చు
  1. "'I consider myself lucky to get such a fantastic break' - Rediff.com Movies". Rediff.com. 2 February 2012. Retrieved 2022-02-07.
  2. "Review: Chingari is quite racy - Rediff.com Movies". Rediff.com. 3 February 2012. Retrieved 2022-02-07.
  3. "Review: Chingari | NDTV Movies.com". Movies.ndtv.com. 6 February 2012. Retrieved 2022-02-07.[permanent dead link]
  4. Sharanya CR, TNN (16 July 2012). "Deepika to play female protagonist in her next film". The Times of India. Archived from the original on 24 June 2013. Retrieved 2022-02-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "Deepika replaces Chaitra in 'Auto Raja' - Kannada Actor, Actress, Movie News & Gossips". ApnaIndia.com. 22 May 2013. Archived from the original on 2016-03-03. Retrieved 2022-02-07.
  6. "Deepika Kamaiah in a Shahid Kapoor film". The Times of India. 26 December 2012. Archived from the original on 3 December 2013. Retrieved 2022-02-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. Ramchander (6 March 2013). "Deepika Kamaiah in Shahid Kapoor's Phata Poster Nikla Hero - Oneindia Entertainment". Entertainment.oneindia.in. Archived from the original on 2013-09-21. Retrieved 2022-02-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "Deepika Kamaiah is back". Indiancinemagallery.com. 27 October 2013. Archived from the original on 2018-08-07. Retrieved 2022-02-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లింకులు

మార్చు