దొంగమల్లన్న దేవాలయం
దొంగమల్లన్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం తిర్మలాపురం పక్కనవున్న మల్లన్నపేట గ్రామంలో ఉన్న దేవాలయం.[1] చాళుక్యుల కాలంలో గ్రామస్థులకెవరికి తెలియకుండా రాత్రికి రాత్రే దొంగతనంగా ఆలయాన్ని నిర్మించడం వల్ల దీనికి దొంగమల్లన్న పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
దొంగమల్లన్న దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°47′26″N 79°03′42″E / 18.790618°N 79.061623°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | జగిత్యాల జిల్లా |
ప్రదేశం: | మల్లన్నపేట |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షిణ భారతదేశం |
చరిత్ర
మార్చుచాళుక్యుల శిల్పకళా రీతులలోనున్న ఈ దేవాలయం పొలవాస రాజులచే 11, 12 శతాబ్దాలకాలంలో నిర్మించారు. ఇదొక అద్భుతమైన, అరుదైన రెండంతస్తుల దేవాలయం. ఇక్కడ లింగాకారంలో ఉన్న శివున్ని గొల్ల వారు, కురుమవారు మల్లన్నగా కొలుస్తారు. మల్లన్న గుడి ఉన్న ఈ ఊరును మల్లన్నపేట అంటారు.[2]
ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం మార్గశిర పంచమి నుంచి 7 వారాలపాటు ప్రతి ఆది, బుధ వారాల్లో జాతర నిర్వహించబడుతుంది. కొండూరి వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతీ సంవత్సరం బోనాలు తీసి తులాభారం పంచిపెట్టి పట్నాలు వేస్తారు. ఒగ్గుడోలు కళాకారులు , శివసత్తుల పూనకాలతో ప్రత్యేకపూజలు నిర్వహింస్తారు.
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "దొంగమల్లన్న దేవాలయం, మల్లన్నపేట". Archived from the original on 16 July 2018. Retrieved 11 June 2018.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 15 జూలై 2018 suggested (help) - ↑ నవతెలంగాణ (8 November 2016). "విశిష్ట చరిత్ర గల దొంగమల్లన్న ఆలయం". Retrieved 11 June 2018.