దొరకునా ఇటువంటి సేవ

దొరకునా ఇటువంటి సేవ 2022లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ డ్రామా సినిమా.[1] దేవి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై దేవ్ మహేశ్వరం నిర్మించిన ఈ సినిమాకు రామచంద్ర రాగిపిండి దర్శకత్వం వహించాడు. సందీప్ పగడాల, నవ్యరాజ్, వెంకీ, టిఎన్ఆర్, నక్షత్ర, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలైంది.

దొరకునా ఇటువంటి సేవ
దర్శకత్వంరామచంద్ర రాగిపిండి
కథరామచంద్ర రాగిపిండి
నిర్మాతదేవ్ మహేశ్వరం
తారాగణం
ఛాయాగ్రహణంరామ్ పండుగల
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంయస్ యస్ ఫ్యాక్టరీ
నిర్మాణ
సంస్థ
దేవి ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 11 (2022-02-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అర్జున్ (అర్జున్ పగడాల) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. అర్జున్ తన ఇంట్లోనే తన భార్య (నవ్య రాజ్), ప్రియుడు (వెంకీ)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ దొరికిపోతుంది. ఆ సంఘటనను చూసిన అర్జున్ వాళ్ళిద్దరి పట్ల ఎలా ప్రవర్తించాడు. తన భార్య నవ్య, ప్రియుడుతో కలిసి అర్జున్ ని చంపడానికి ప్రయత్నిస్తే, వాళ్ల నుండి తప్పించుకొని బయటపడగలిగాడా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • సందీప్ పగడాల
  • నవ్యరాజ్
  • వెంకీ
  • టిఎన్ఆర్
  • నక్షత్ర
  • రవి వర్మ
  • బేబీ వీక్ష
  • మాస్టర్ రిత్విక్ రెడ్డి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: దేవి ఫిలిం ఫ్యాక్టరీ
  • నిర్మాత: దేవ్ మహేశ్వరం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామచంద్ర రాగిపిండి[3]
  • సంగీతం: యస్ యస్ ఫ్యాక్టరీ
  • సినిమాటోగ్రఫీ: రామ్ పండుగల
  • ఎడిటర్ : చోటా కె ప్రసాద్

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (10 December 2020). "'దొరకునా ఇటువంటి సేవ'.. టీజర్‌ వచ్చేవరకు సస్పెన్సే" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
  2. Andhra Jyothy (25 November 2020). "అక్రమ సంబంధాల నేపథ్యంలో." (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
  3. The New Indian Express (7 December 2021). "Director Ramachandra Ragipindi is chasing the dream". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.

బయటి లింకులు మార్చు