ద్వికుంభాకార కటకం

ఒక కటకానికి రెండు తలాలూ కుంభాకార ఆకారంలో ఉంటే ఆ కటకాన్ని "ద్వికుంభాకార కటకం" అంటారు. ఒకవేళ రెండు తలాలు ఒకే వక్రతా వ్యాసార్థాన్ని కలిగియున్నచో దానిని "సమకుంభాకార కటకం" (ఈక్వి కాన్వెక్స్ లెన్స్) అంటారు. ఒక ద్వికుంభాకార కటకం లేదా సమతల-కుంభాకార కటకం పై పడిన కాంతి కిరణ పుంజం వక్రీభవనం చెంది ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. ఆ బిందువును "నాభి" అంటారు. ఇది కటకానికి వెనుక భాగంలో ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ఈ కటకాన్ని ధనాత్మక లేదా కేంద్రీకరణ కటకం అంటారు. కటకానికి నాభికీ మధ్య దూరాన్ని నాభ్యంతరం అంటారు. దినిని కిరణ చిత్రాలలో లేదా సమీకరణాలలో సాధారణంగా f అనే ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు.

ద్వికుంభాకార కటకంపై పడిన కాంతి కిరణాలు కేంద్రీకరణ
Biconvex lens
Large convex lens.jpg

ప్రతిబింబ లక్షణాలుసవరించు

కుంభాకార, పుటాకార కటకాలు ప్రతిబింబాలను ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకొనుటకు పతనమయ్యే వివిధ కాంతికిరణముల ప్రవర్తనను అవగాహన చేసుకోవాలి. ఆ కిరణాల ప్రవర్తన ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతికిరణమైనా విచలనం చెందదు.
  2. కటక దృక్‌ కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం కూడా విచలనం చెందదు.
  3. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రీకరించబడతాయి లేదా నాభి నుండి వికేంద్రీకరించబడతాయి.
  4. కాంతి కిరణాలు కనిష్ఠకాల నియమాన్నిపాటిస్తాయి. కాబట్టి నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.
సంఖ్య వస్తువు స్థానం చిత్రం ప్రతిబింబ స్థానం పరిమాణం నిజ/మిధ్యా ప్రతిబింబం నిటారైన/తలక్రిందులైనది
1 వక్రతా కేంద్రానికి దూరంగా నాభి, వక్రతాకేంద్రం మధ్య చిన్నది నిజ ప్రతిబింబం తలక్రిందులైనది
2 వక్రతా కేంద్రంపై వక్రతా కేంద్రం వద్ద సమాన పరిమాణం నిజ ప్రతిబింబం తలక్రిందులైనది
3 నాభి, వక్రతా కేంద్రం మధ్య వక్రతా కేంద్రానికి ఆవల పెద్దది నిజ ప్రతిబింబం తలక్రిందులైనది
4 నాభి పై అనంత దూరంలో *** *** ***
5 కటక కేంద్రానికి, నాభికి మధ్య వస్తువు ఉన్నవైపు పెద్దది మిధ్యా ప్రతిబింబం నిటారైనది

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు