ధన్వంతరి - అష్టవిభాగ ఆయుర్వేదం

ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది. మానవాళికి శస్త్ర చికిత్సను మొదటిగా పరిచయం చేసింది ధన్వంతరి. ప్రకృతి సిద్ధంగా గాయం కుళ్లకుండా ఆపే సాధనంగా పసుపును మనిషికి ప్రసాదించింది ధన్వంతరే! అలాగే నిల్వ ఉంచే సాధనంగా ఉప్పును, సర్వరోగ నివారిణిగా వేపను పరిచయం చేశారు ధన్వంతరి. ప్రపంచంలో ప్రప్రథమంగా ప్లాస్టిక్ సర్జరీని ధన్వంతరి ప్రయోగించి నిరూపించాడు.

ధన్వంతరి - ఆయుర్వేదంసవరించు

ఎలాంటి కృత్రిమ రసాయన పదార్థాలను వాడకుండా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే ఓషధులను రోగులకు ఔషధంగా యిచ్చి పూర్తి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా స్వస్థత చేకూర్చడం ధన్వంతరి ప్రవేశపెట్టిన వైద్య విధానం. ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా నిర్వచించి, దానిని ఎలా వాడాలో నిర్దెశించాడు ధన్వంతరి.

అష్ట విభాగ ఆయుర్వేదంసవరించు

ఆయుర్వేద వైద్యాన్ని ధన్వంతరి ఎనిమిది విభాగాలుగా వివరించాడు. అవి:

కాయ చికిత్ససవరించు

శరీరానికి చేసే చికిత్సను కాయచికిత్స అంటారు. ఈ చికిత్సలో మనిషి ఉదర సంబంధ వ్యాధులకు, యింకా కడుపు లోకి తీసుకోవాల్సిన ఓషధులు - వాటి పనిచేసే విధానం సవివరంగా చర్చించబడింది. సాధారణంగా మనిషికి వచ్చే 90 శాతం జబ్బులు నోటి ద్వారా కడుపులోకి చేరే మందుల వల్లే తగ్గుతాయని మనందరికీ తెలిసిందే.

బాల చికిత్ససవరించు

పుట్టిన ముహూర్తం నుండి బాల్యదశ వరకూ పిల్లలకు వచ్చే సాధారణ రుగ్మతలు, తరుణ వ్యాధులు, వాటి చికిత్సా విధానం, బాలల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలింతలైన స్త్రీలు - ఆహార నియమాలు, శిశు పోషణ రహస్యాలు.. యిలా ఒకటేమిటి? పిల్లలకు సంబంధించిన సర్వ రోగ నివారక ఆరోగ్యప్రదాయక విశేషాలు యిందులో చెప్పారు

గ్రహ చికిత్ససవరించు

మనిషి మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉన్నపుడే శారీరక వ్యాధుల నుండి త్వరగా కోలుకోగలుగుతాడు. ఈ విధానంలో మానసిక రోగ లక్షణాలు - చికిత్సా విధానాలు, మానసిక ఆరోగ్యానికి పాటించవలసిన నియమాలు - మానసికోల్లాస విషయ పరిజ్ఞానం చెప్పారు. ఇవాళ సైక్రియాట్రిక్ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారాలు ఈ గ్రహ చికిత్సా విధానంలో చెప్పబడ్డాయి.

శలాక్యతంత్రసవరించు

మనిషై ముఖ్యావయాలాలైన కన్ను, చెవి, ముక్కు, గొంతు బాధలకు కారణాలు, రోగ లక్షణాలు, చికిత్సా విధానాలు, కూలంకషంగా వివరించారు. అలాగే శరీరంలోని సున్నితమైన అవయవాలైన కన్ను, చెవి, ముక్కు, గొంతు స్వ్యంగా ఆరోగ్యంగా ఉండే పరిస్థితులు, పరిసరాల పరిశుభ్రత మొదలైన ఎన్నో ఆరోగ్యదాయక విశేషాలు ఇందులో ఉన్నాయి.

శల్యతంత్రసవరించు

మందులతో తగ్గని శస్త్రచికిత్స అవసరపడే చిన్న, పెద్ద వ్యాధులు వాటికి చేయవలసిన లఘు, ఘన శస్త్రచికిత్సా విధానాలు ఈ శల్యతంత్ర విభాగంలో విస్తారంగా వివరింపబడ్డాయి.

విషతంత్రసవరించు

శరీరంలోకి చెరుపు చేసే విషపదార్థాలు చేరుకున్నప్పడు వాటికి విరుగుడు, విషపదార్థాలు వివరాలు, శరీరంలోకి అవి ప్రవేశించినప్పుడు మనిషిలో చోటు చేసుకునే రోగలక్షణాలు, విషపదార్థాలను విరిచే వివిధ రకాల ఔషధాలు - వాటి ప్రయోగ విధాలు, ఇలా అనేక అంశాలను సవివరంగా విశద పరిచిన ఆయుర్వేద విభాగం విషతంత్రం.

రసాయన తంత్రసవరించు

దీనినే ఆధునిక అల్లోపతీ వైద్యులు "జీరిమాట్రిక్స్" అంటారు. అరుదుగా ఆయన ఒకానొకప్పుడు రోగచికిత్సకు రసాయనాల ప్రయోగం అత్యావశ్యకం! అయితే ఆ ప్రయోగంలో రోగి దేహధర్మవైఖరులు, రోగిలోని సహజ రోగనిరోధక వ్యవస్థ తీరుతెన్నులు క్షుణ్ణంగా పరిశీలించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలన్నీ ఈ రసాయన తంత్రలో చర్చించబడినాయి.

వాజీకరణతంత్రసవరించు

పురుషుడిలో నపుంసకత్వాన్ని తొలగించి, పుంసకత్వాన్ని పెంపొందించే అద్భుత ఔషధ పరిజ్ఞానం అంతా ఈ వాజీకరణ తంత్రలో పొందుపరచబడింది. పురుషుల్లో నపుంసకత్వం, స్త్రీలలో వంధ్యత్వత (పిల్లలు పుట్టక పోవడం) ఏర్పడటానికి గల కారణాలు, అందుకు దారితీసే పరిస్థితులు, శరీరంలో ఏర్పడే లోపాలు, చికిత్సకు ఉపయోగపడే ఔషధాల వివరాలు, చికిత్సచేసే విధానం అన్నీ వివరింపబడ్డాయి.

ఈ ఎనిమిది విభాగాలు మనిషిలోని సర్వావయవలకూ వచ్చే వ్యాధుల గురించి చర్చించాయి. అంటే మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంచగలిగే సంపూర్ణ వైద్యవిధానాన్ని ఆయుర్వేదం ద్వారా అందించారు ధన్వంతరి. అందుకే ఆయన ఆయుర్వేద స్రష్ట- అపర నారాయణ స్వరూపుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

యివి కూడా చూడండిసవరించు

సూచికలుసవరించు

యితరలింకులుసవరించు