ధార్వాడ (కర్ణాటక)
Dharwad | |
![]() Karnataka Coat-of-arms | |
State | Karnataka |
Division | Belgaum |
Taluks | Dharwad, Hubli,Kalghatgi, Navalgund,Kundgol |
District headquarters | Dharwad |
District Commissioner | Sameer Shukla |
Area | 4265 km² |
Population (2011) | 1,846,993 |
Codes
|
+0836 KA-25,KA-63 |
Time zone | IST (UTC+5.30) |
కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో ధార్వాడ జిల్లా ఒకటి. ధార్వాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా ధార్వాడ పేడాకు (పాలతో చేసే స్వీటు) ప్రసిద్ధి. పురపాలకం వైశాల్యం 191 చ.కి.మీ. ధార్వాడ బెంగుళూరుకు వాయవ్యంగా 425 కి.మీ దూరంలో ఉంది. పూనాకు దక్షిణంగా 421 కి.మీ దూరంలో ఉంది. ఇది బెంగుళూర్- పూనా మార్గంలో రహదారికి దగ్గరగా ఉంది. జిల్లాలో " నార్త్ యూనిట్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ కంస్ట్రక్షన్ కార్పొరేషన్ " ప్రధాన కార్యాలయం ఉంది. జిల్లాలో హైకోర్ట్ సర్క్యూట్ బెంచ్ ఉంది.1997కు ముందు జిల్లా వైశాల్యం 13738. 1997 తరువాత ధార్వాడ నుండి గదగ్, హవేరి జిల్లాలు రూపొందించబడ్డాయి. ధార్వాడ, మరొక రెండు జిల్లాల నుండి భూభాగలను సేకరించి దావణగిరె జిల్లా రూపొందించబడింది.
పేరు వెనుక చరిత్రసవరించు
ధార్వాడ అంటే విడిది అంటే స్వల్పకాల విశ్రాంత ప్రదేశం అని అర్ధం. కొన్ని శతాబ్ధాలపాటు ధార్వాడ మలెనాడు భూభాగం, మైదాన భుభాగాల మద్య ప్రధాన ద్వారంగా ఉండేది. మలెనాడు భూభాగం, మైదాన భుభాగాల మద్య ప్రయాణించే యాత్రీకులు ఇక్కడ కొంతకాలం విశ్రమించేవారు. సంస్కృతపదం ద్వారావత పదం నుండి ధార్వాడ అనే పదం వచ్చింది. ద్వారా అంటే తలుపు వాడ అంటే పట్టణం.
మరొక కథనం విజయనగర పాలనాకాలంలో ధార్వాడ భూభాగాన్ని ధర్వ్ (1403) లో పాలించాడని ఆయన నుండి ఈ భూభాగానికి ధార్వాడ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో లభిస్తున్న కొన్ని శిలాశాసనాలు ఈ ప్రాంతాన్ని కామన స్థాన అని ప్రస్తావించబడింది.
చరిత్రసవరించు
నరేంద్ర గ్రామంలోని దుర్గాదేవి ఆలయసమీపంలో ఆర్.ఎల్.ఎస్ ఉన్నత పాఠశాల వద్ద లభించిన 12వ శతాబ్ధపు శలాశాసనాలు ధార్వాడ 900 సంవత్సరాల నుండి ఉనికిలో ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. బోక్యపూర్ సరససు (ధార్వాడ నుండి 18కి.మీ దూరంలో ఉన్న గ్రామం) వద్ద ఉన్న హనుమాన్ ఆలయం వద్ద లభించిన శిలాశాసనాలు కూడా ధార్వాడ గురించిన వివరాలను అందిస్తున్నాయి.
చాళుక్యులుసవరించు
12 వ శతాబ్దంలో చాళుఖ్యులు ధార్వాడను పాలించారు. 1117 లో భాస్కరదేవ పాలించినట్లు శిలాశాసనాలద్వారా తెలుస్తుంది. 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తానులు జిల్లాభూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇది కొత్తగా స్థాపించబడిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది. విజయనగర రాజులు ధార్వాడ వద్ద కోటను నిర్మించారు. 1565లో తాలికోట యుద్ధంలో విజయనగర పాలకులు ఓటమి పొందాక ధార్వాడ కొంతకాలం హిందూ రాజుల పాలనలో స్వతంత్రరాజ్యంగా ఉంది. 1573లో బీజపూర్ సుల్తాన్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత ఆదిల్ షా రాజ్యంలో భాగం అయింది. ఆఫిల్ షా ఇక్కడ నిర్మించిన కోట్ మన్నాఖిలె అని పిలువబడింది. తరువాత నజ్రతాబాద్ అని పిలువబడింది. ఈ కోట నిర్మాణంతో ధార్వాడ ఊహాత్మకంగా అభివృద్ధి చెందింది. తరువాత ధార్వాడ పలువురు ఔరంగజేబు, శివాజీ, ఔరంగజేబు కుమారుడు ము ఆజం, పేష్వా, బాలాజీ రావు, హైదర్ అలి, టిప్పు సుల్తాన్ చివరిగా బ్రిటిష్ ప్రభుత్వం మొదలైన పలువురి విజేతలను ఆకర్షించింది.
ముగల్ సామ్రాజ్యంసవరించు
1685లో ధార్వాడ కోటను ముగల్ పాలకులడు ఔరంగజేబు స్వాధీనం చేదుకున్నారు. 1764లో తరువాత ధార్వాడ మరాఠీల పాలనకుడైన పూనా పేష్వా పాలనలోకి మారింది. 1778లో ఈ భూభాగం మైసూరు పాలకుడైన హైదర్ అలి రాజ్యంలో భాగం అయింది. 1791లో ధార్వాడ తిరిగి మరాఠీల వశమైంది. చివరిగా బ్రిటిష్ ప్రభుత్వం పేష్వాను ఓడించి ధార్వాడను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ధార్వాడను బాంబే ప్రొవింస్‌లో చేర్చారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ రాజ్యవిస్తరణను నారాగుండ్ పాలకుడు బాబా షాహెబ్, కిత్తూరు చెన్నమ్మ మొదలైన స్థానిక పాలకులు తీవ్రంగా వ్యతిరేకించారు.
జహంగీర్ బాద్సవరించు
జహంగీర్‌దర్ (బాద్) కులీనవర్గీయుడు. ఆయన ఒక జమీందారుగా ఉన్నాడు. ఆకాలంలో వారు రాజా, నవాబు, మిర్జా, పలు ఇతర బిరుదునామాలను స్వీకరించేవారు. జాగీరుదారులు రాజప్రతినిధులకు సమానంగా ఉండేవారు. కొంన్ని మార్లు వారు స్వతంత్రంగా వ్యవహరించేవారు. మరికొన్ని మార్లు స్వతంత్ర రాజులుగా వ్యవహరించే వారు. బ్రిటిష్ పాలనా కాలంలో జాగీరుదారులు కూడా వారి ప్రాభవాన్ని కోల్పోయారు. ముగల్ పాలనలో జాగీరుదార్లు ప్రజల నుండి పన్ను వసూలు చేసే అధికారం కలిగి ఉండేవారు. జాగీరుదారి అధికారం వారసత్వంగా కొనసాగేది. జాగీరు సరాసరి వైశాల్యం 50,000 హెక్టార్లు. (50-150 గ్రామాలు). జాగీరుదారుల స్వంతంత్ర భావాలకు వెరచిన మొగల్ పాలకులు జాగీరు అధికారాన్ని తరచుగా మారుస్తూ వేరే వారిని జాగీరుదారులుగా నియమించేవారు. 17వ శబాబ్ధం నుండి వారసత్వ అధికారంగా మారిన జాగీరుదారి 18 వ శతాబ్దం వరకు కొనసాగింది.
స్వాతంత్ర్య సమరయోధుడుసవరించు
ధార్వాడ ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు " కర్నాటక కులపురోహిత్ ", శ్రీ అలూర్ వెంకటరావులకు జన్మస్థలం. శ్రీ అలూర్ వెంకటరావు రచించిన " కర్నాటక గత వైభవ " కర్నాటక ప్రజలలో ఉత్తేజం కలిగించింది.
19వ శతాబ్దం అధకభాగం ధార్వాడ ప్రశాంతంగానే ఉండేది. ఈ సమయంలో ధార్వాడలో 1848లో ఒక ఆగ్ల మాధ్యమ పాఠశాలను స్థాపించింది. తరువాత 1863లో ది బాసెల్ మిషన్ ఆర్గనైజేషన్ మరొక స్కూలును ప్రారంభించింది. 1867లో బ్రిటిష్ మరొక స్కూలును స్థాపించింది. వర్మల్ స్కూల్, తరువాత 1867లో ఇది ట్రైనింగ్ స్కూలుగా మార్చబడింది. 1883లో పురపాలక ప్రాంతంలో సిధాపూర్, లకమంహళ్ళి, హవేరి పీట్, బాగ్తలన్, మదిహల్, గలగంజికోప్, మాలపూర్, కమల్‌పూర్, నారాయణపూర్, సప్తపూర్, అత్తికోలా, హోసయపూర్ విలీనం చేయబడ్డాయి. 1888లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ రైల్వే స్టేషను ఏర్పాటు చేసింది.
రైల్వేసవరించు
ధార్వాడ పట్టణంలో సదరన్ మరాఠా రైల్వే మార్గంలో ఒక రైల్వే స్టేషను ఉంది. 1901 గణాంకాలను అనుసరించి పట్టణ జనసంఖ్య 31,279. జిల్లాలో పలు కాటన్ జిన్, కాటన్ మిల్, రెండు హైస్కూళ్ళు ఉన్నాయి. ఒకదానిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. రెండవదానిని బాసెల్ జర్మన్ మిషన్ నిర్వహిస్తుంది.
1947 ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1956లో రాష్ట్ర పునర్విభజన సమయంలో బాంబే రాష్ట్రంలో ఉన్న కన్నడ మాట్లాడే జిల్లాలు మైసూరు రాష్ట్రంలో చేర్చబడ్డాయి. వాటిలో ధార్వాడ జిల్లా ఒకటి. 1972 నుండి మైసూరు రాష్ట్రం కర్నాటక రాష్ట్రంగా మార్చబడింది. ధార్వాడలో " కర్నాటక విశ్వవిద్యాలయం ", యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైంసెస్ (యు.ఎ.ఎస్) అలాగే పలు ఇతర కాలేజీలు ఉన్నాయి.
1941లో ధార్వాడ జనసంఖ్య 47,992.[1] 1961లో ధార్వాడ పొరుగున ఉన్న హుబ్లీ పట్టణంలో కలిసిపోయి హుబ్లి- ధార్వాడ పురపాలకం అయింది. రెండు నగరాల జనసంఖ్య కలిసి జనసంఖ్యాపరంగా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బెంగుళూరు ఉంది. 1981-1991 మద్య కాలంలో హుబ్లి- ధార్వాడ జనసంఖ్య 22.99% (527,108 నుండి 648,298) అభివృద్ధి చెందింది. 1991 - 2001 మద్య కాలంలో హుబ్లి ధార్వాడ జనసంఖ్య 21.2 % అభివృద్ధి చెందింది. 2008లో ధార్వాడలో సర్క్యూట్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ కర్నాటక స్థాపించబడింది. ది సర్క్యూట్ బెంచి పరిధిలో ముంబయి - కర్ణాటక చేర్చబడ్డాయి.
భౌగోళిక విశేషాలుసవరించు
హుబ్ళి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ధార్వాడ వైశాల్యం 4263చ.కి.మీ. 15°02' నుండి 15°51' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 73°43' నుండి 75°35'డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తున ఉంది. జిల్లాలో ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణం ఉంది. భౌగోళికంగా జిల్లా మూడు విభాగాలుగా విభజించబడి ఉంది. మాల్నాడు, సెమీ మాల్నాడు, మైదాన్. జిల్లాలో ప్రాంతాలను అనుసరించి భారీ, మితమైన వర్షపాతం ఉంటుంది. కల్ఘతగి, అల్నవర్ ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. జిల్లాలోని ఇతర తాలూకాలకంటే ధార్వాడ తాలూకాలో అధిక వర్షపాతం ఉంటుంది.
సరిహద్దులుసవరించు
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | బెల్గాం |
తూర్పు సరిహద్దు | గదగ్ |
దక్షిణ సరిహద్దు | హవేరి |
పశ్చిమ సరిహద్దు | ఉత్తర కన్నడ |
- తాలూకాలు :-
- ధార్వాడ
- హుబ్లి
- కుంద్గొల్
- నావల్గుండ్
- కల్ఘత్గి
ప్రముఖ వ్యక్తులుసవరించు
- దాదాసాహెబ్ చింతామణి పవతె
- డాక్టర్. బెంద్రే
- కె ఎస్ అమర్
- జి. ఎస్ అమర్
- వెంకన్న హెచ్ నాయక్
- సుధా మూర్తి
- గంగూబాయ్ హంగల్
- పండిత్ మల్లికార్జున్ మన్సూర్
- పండిట్ సవాయి గంధర్వ
- పండిత్ బసవరాజ్ రాజ్గురు
- పండిత్ కుమార్ గంధర్వ
- పండిట్ భీమ్సేన్ జోషి
- గిరీష్ కర్నాడ్
- సురేష్ హెబిల్కర్
- ఆర్.సి. హిరెమత్
- సరోజినీ మహిషి, (మాజీ మంత్రి ఇందిరా మహాత్మా గాంధీ మంత్రివర్గం)
- జి.ఎ. కులకర్ణి
సీనియర్ పోలీస్ అధికారులుసవరించు
అనుభవఙలైన పోలీసు అధికారులు :-
- వీరన్న ఐవల్లి - ఐ.పి.ఎస్. (1943-2002) కాశ్మీర్ పోలీస్ లో పనిచేసాడు. 2002 ఆగస్టులో " షేర్- ఇ- కాశ్మీర్ " అవార్డును అందుకున్నాడు.
- షరనబస్సప్ప బి తొంగ్లి - ఐ.పి.ఎస్. (జననం1920 డిసెంబరు 12 - మరణం 2012 జనవరి 25)
- వి.బి. నంగూర్- ఐ.పి.ఎస్
- ఆర్.పి. మాలిమఠ్ - ఐ.పి.ఎస్
- ఎస్.ఎస్.హస్బి- ఐ.పి.ఎస్
విద్యసవరించు
ధార్వాడ జిల్లా విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది. జిల్లాలో పలు ప్రముఖ ఉన్నత పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విద్యాసంస్థల జాబితా. 19వ శతాబ్దం మద్యకాలం నుండి జిల్లాలో మరాఠీ భాష ప్రాబల్యంలో ఉంది. అందువలన జిల్లాలో మరాఠీ పాఠశాలలు కూడా ఉన్నాయి. మరాఠీ ఆగ్లం ప్రభుత్వ పాఠశాలలు, కోర్టు వ్యవహారం, చట్టం మొదలై విషయాలకు ఉపయోగిస్తున్నారు. అందువలన కన్నడ భాష జిల్లాలో కొంత వెనుకబాటుకు గురైంది. అందువలన చెన్నబసప్ప, అర్తల్ రుద్రగౌడ, రోడా శ్రీనివాస్ రావు, సర్ సిద్దప్ప, కాంబ్లి, సక్కారి బాలాచార్య, ఆర్.హెచ్. దేశ్పాండే, ఆలూర్ వెంకట్రావు, కడప రాఘవేంద్ర రావు, సలి రామచంద్ర రావు విద్యావంతులైన కన్నడ భాషాభిమానులు కన్నడ భాషను పునఃస్థాపన కొరకు తమజీవితాలను కన్నడ భాషకు అంకితం చేసారు. వారు పాఠశాలలను, కాలేజీలను స్థాపించి కన్నడ భాషా మాధ్యమంలో బోధన జరగడానికి ఉపాధ్యాయులను నియమించి మాతృభాషకు సేవలందించారు. ధార్వాడ జిల్లా సరస్వతీ నిలయంగా పేరు పొందింది. జిల్లాలో విద్యావంతులు, విద్యాసంస్థలు, విద్యాభిమానులు, విద్యానుకూల పరిస్థితులున్న కారణంగా పరిసర జిల్లాలలోని విద్యార్థులు కూడా జిల్లాకు విద్యను అభ్యసించడానికి వస్తూ ఉన్నారు. ఉదయం 8-10, మద్యాహ్నం 12-1 సాయంత్రం 5 గంటల సమయానికి ధార్వాడ రహదార్లు, బస్సులు, ఆటోరిక్షాలు విద్యార్థులతో నిండిపోతుంటాయి. ఈ సమయాలలో ధార్వాడ మొత్తం ఒక పెద్ద పాఠశాలగా దర్శనమిస్తుంది. ధార్వాడలో కన్నడ, ఆంగ్లం, ఉర్దు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి.
పరిశ్రమలుసవరించు
హుబ్లి ఒక ప్రాధాన్యత కలిగిన పారిశ్రామిక కేంద్రం. 1000 స్మాల్ మరొయు మీడియం తరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో మెషి టూల్స్ ఇండస్ట్రీలు, ఎలెక్ట్రికల్, స్టీల్ ఫర్నీచర్, ఆహార ఉత్పత్తులు, రబ్బర్, తోలు పరిశ్రమలు, శిక్షణా సంస్థలు ఉన్నాయి.
- సంస్థల జాబితా :-
- టాటా మోటార్స్ లిమిటెడ్
- టాటా మార్కోపోలో మోటార్స్ లిమిటెడ్
- టెల్కో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (టెల్కోన్).
- కిర్లోస్కర్ ఎలక్ట్రికల్ కో లిమిటెడ్
- కంపెనీస్ మైక్రోఫినిష్ గ్రూప్.
- భోరుకా టెక్స్టైల్ మిల్.
- ఎన్.జి.ఇ.ఎఫ్ లిమిటెడ్.
- కర్నాటక మిల్క్ ఫెడరేషన్.
- ఇండస్ట్రీస్ బి.డి.కె. గ్రూప్.
- మురుడేశ్వర్ సెరామిక్స్ లిమిటెడ్
- కామత్ గ్రూపు (హోటల్స్ ప్రజాదరణ సమూహం) హోటల్స్ ఈ చాలా నగరంలో ప్రారంభమయ్యాయి.
- జె.బి.ఎం.ఇండస్ట్రీస్.
- డి.ఆర్.టి. సెలవులు భారతదేశం.
- వి.ఆర్.ఎల్.
- హుబ్లి నగర నడిబొడ్డులో ఐ.టి పార్క్ - హుబ్లి ఉంది. దీనిని గవర్నమెంట్ ఆఫ్ కర్నాటక ఐ.టి డిపార్ట్మెంటు స్థాపించింది. కెయోనిక్స్ హుబ్లి ఐ.టి పార్క్ నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహాబాధ్యతలు నిర్వహిస్తుంది.
ప్రయాణ సౌకర్యాలుసవరించు
రహదారి మార్గంసవరించు
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్.డబల్యూ.కె.ఆర్.టి.సి (నార్త్‌వెస్ట్ కర్నాటక రోడ్డు ట్రాన్‌పోర్ట్ కార్పొరేషన్) ప్రధానకార్యాలయం హుబ్లీలో ఉంది. నగరంలో హుబ్లి, ధార్వాడ, కల్ఘటి, నావలగుండు, కుండగోల్ మద్య చక్కని రవాణా వ్యవస్థ ఉంది. ఎన్.డబల్యూ.కె.ఆర్.టి.సి, బెంద్రె నగర సారిగె ఈ ప్రదేశాల మద్య దినసరి బసు సర్వీసులు అందిస్తూ పూర్తి స్థాయిలో రవాణాసౌకర్యం కలిగిస్తుంది. హుబ్లి, బెంగుళూరు, మంగుళూరు, పూనా, ముంబయి, గోవా, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు నగరం నుండి దినసరి బసు సౌకర్యంలభిస్తుంది.
రైలు మార్గంసవరించు
హుబ్లి సౌత్ వెస్టర్న్ రైల్వేస్ జోన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రధానకార్యాలయం ఉంది. పలు ఎక్స్‌ప్రెస్ పాసింజర్ దినసరి రైళ్ళు హుబ్లీ - బెంగుళూరు మద్య నడుపబడుతున్నాయి. ప్రధాన రైలు జంక్షన్ అయిన హుబ్లీ నుండి ముంబై, పూనే, మిరాజ్, ఢిల్లీ, హైదరాబాదు (ఆంధ్ర ప్రదేశ్), అహ్మదాబాద్, విజయవాడ, మైసూర్ లకు దినసరి రైలు వసతి లభిస్తుంది. చెన్నై, హౌరా, తిరువనంతపురం లకు వారాంతపు రైలు సౌకర్యం లభిస్తుంది.
వాయుమార్గంసవరించు
స్పైస్ జెట్ బెంగుళూరు - ముంబయి విమానసర్వీసులు లభిస్తున్నాయి. హుబ్లి విమానాశ్రయంలో నైట్ - లాండింగ్ సౌకర్యం అభివృద్ధి చేయబడింది.
. .
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,846,993,[2] |
ఇది దాదాపు. | కొసవొ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 256 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 434 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 15.13%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 967:1000,[2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 80.3%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
సంస్కృతిసవరించు
ధార్వాడ భూభాగం కొన్ని హిందుస్థానీ సంగీతకళాకారులను అందించింది. జిల్లాలో సవైగంధర్వ, మల్లుకార్జున మంసూర్, భీంసేన్ జోషి (2011లో మరణించాడు), బసవరాజ్ రాజగురు, కుమార్ గంధర్వ, గంగుభాయ్ హంగల్ మొదలైన హిందూస్థానీ గాయకులు ఉన్నారు.
అబ్దుల్ కరీం ఖాన్సవరించు
ధార్వాడ కిరణ ఘరన కళకు కూడా గుర్తింపు పొందింది. ఉసాద్ అబ్దుల్ కరీం ఖాన్ తరచుగా మైసూర్ దర్బారుకు వచ్చిపోతూ ఉండేవాడు. మైసూర్ దదర్బార్ ఆయనకు సంగీతరత్న బిరుదు ఇచ్చి సత్కరించింది. మైసూరుకు వెళ్ళేదారిలో ఆయన తనసోదరునితో ధార్వాడలో కొంతకాలం నివసించాడు. ధార్వాడలో ఆయన ఒక తన అత్యంత కీర్తి పొందిన శిష్యునికి సంగీతం నేర్పాడు. ఆ శిష్యుడే సవై గంధర్వ. సవైగంధర్వ గంగుభాయి హంగల్, భీంసేన్, బసవరాజ్ రాజగురు వంటి శిష్యులకు సంగీతం నేర్పాడు.
ప్రముఖులుసవరించు
ఙానపీఠ్ అవార్డ్ విజేతలు డాక్టర్ బెంద్రె, వి.కె గోకక్, గిరీష్ కర్నాడ్ వారి పూర్వీక మూలాలతో ధార్వాడతో సంబంధం ఉంది. కన్నడ రచయిత, విమర్శకుడు సాహిత్య అవార్డ్ గ్రహీత కీర్తినాథ్ కులకర్ణి తనజీవితంలో అధికాలం ధార్వాడలో నివసించాడు. ఒక మరాఠీ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత జి.ఎ. కులకర్ణి కూడా తన జీవితంలో చాలాకాలం ధార్వాడలో నివసించాడు. ప్రముఖ హిందీ నటి, కిషోర్ కుమార్ భార్య లీనా చందావర్కర్ ధార్వాడలో నివసించింది. తరువాతి కాలంలో కూడా రైల్వే స్టేషను సమీపంలో ఆమెకు ఆస్తులు ఉన్నాయి.
నందన్ నిలెకానిసవరించు
నందన్ నిలెకాని ఇంఫోసిస్ కోచైర్మన్ తన అంకుల్ కుటుంబంతో ధార్వాడకు వెళ్ళి విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆయన సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో నివసించాడు. నిలెకాని " కర్నాటక కాలేజి ఆవరణలో సృజన పేరుతో ఆర్ట్ అడిటోరియం నిర్మించజేసాడు. .
న్యాయవాదులుసవరించు
ధార్వడ ప్రముఖ సంగ్లాడ్ జె, .బన్నూర్మఠ్బ జె., ఎ.సి కబ్బిన్ జె., మోహన్ షందంతంగౌదర్ జె, బి.ఎస్ పాటిల్, అశోక్ హించిగేరి జె. సుభాష్ ఆది జె. న్యావాదులు అయిన ష్రీ హితెగౌదార్, సి.బి. పాటిల్, షరత్ ఎస్. జవలి (సుప్రీం కోర్ట్) మోహన్ కతర్కి (కావేరి వివాద పరిషార కర్నాటక న్యావాది) మొదలైన చట్టసంబంధిత ప్రముఖులకు స్వస్థలంగా ఉంది.
మరి కొందరు ప్రముఖులుసవరించు
ప్రముఖ ఇంవెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఉమ శశికాంత్, సుచేత దలాల్, ముంబయిలో నివసిస్తున్న ఫైనాంషియల్ జర్నలిస్ట్ (హర్షద్ మెహ్తతా కుంభకోణం వెలికి తీసాడు) కూడా ధార్వాడలో విద్యాభ్యాసం చేసారు. పి.బి. మహిషి, టి.ఎం. శివకుమార్, గణపతి భట్, మనిష్ దేశాయి, కె నంది సివిల్ సర్వీసులలో ల్యూసి, వారి ప్రత్యేకత చాట్టుకున్నారు. డి. అబ్ర్యూ కూడా ధార్వాడలో జన్మించిన వాడే. దళిత నాయకుడు ధార్వాడ పాల్వంకర్ బాలూ జన్మస్థలం. ఆయన క్రికెట్ క్రీడాకారుడుగా తరువాత రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించాడు. ఇండియన్ క్రికెట్ బౌలర్ సన్ జోషి ధార్వాడ వాసి మాత్రమేకాక పండిట్ భీంసేన్ బంధువు కూడా.
ఆధ్యాత్మిక ప్రముఖులుసవరించు
జిల్లాలో ఆధ్యాత్మిక ప్రముఖులు ఉన్నారు. జిల్లాలో షిషునల్ షరీఫ్ సాహెబ్ సిద్దారూఢ స్వామిగళు, కుమార స్వామీజి, హురకడ్లి అజ్జా, మృత్యుంజయ అప్పగళు, మహంత అప్పగళు, గతగ్ మాదీవలేశ్వర మొదలైన అధ్యాత్మిక ప్రముఖులు ఉన్నారు.
పర్యాటకసవరించు
ధార్వాడ జిల్లాలలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. చారిత్రక ఆలయాలు, స్మారకచిహ్నాలు ఉన్నాయి.[5]
ధార్వాడసవరించు
- అమ్మింభవి ధార్వాడ నుండి 6 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ 24 తీర్ధంకర బసది, హిరె మాతా, గుహాలయం ఉంది. ఆలయంలో కిత్తూరు నుండి వచ్చిన కొయ్యఫలకం మీద చిత్రించిన చిత్రం ఉంది.
హుబ్లిసవరించు
- ఉంకల్ వద్ద ప్రముఖ చంద్రమౌళేశ్వరాలయం ఉంది. ఇది పశ్చిమ చాళుఖ్యుల కాలం నాటిదని భావిస్తున్నారు. ఆలయ సమీపంలో ఉంకల్ సరసు ఉంది. ధార్వాడలో జిల్లాలోని అందమైన సరసులలో చంద్రమౌళీశ్వరాయం ఒకటి.
- ఉంకల్ సరసు హుబ్లి నుండి 3కి.మీ దూరంలో ఉంది. ఇది అందమైన పూదోటలు, పిల్లల వినోదసౌకర్యాలు, బోటింగ్ సౌకర్యం మొదలైన ఆకర్షణలతో కూడిన విహారకేంద్రం.
- భవాని శంకర్ ఆలయం :- చాళుఖ్యులు నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దైవం నారాయణుడు.
- అసర్:- 1616లో దీనిని మొహమ్మద్ అలి షాహ్ దీనిని కోర్ట్ హాలుగా ఉపయోగించడానికి నిర్మించాడు. ఈ హాలును ప్రవక్త అనుయాయులు బసచేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో స్త్రీలకు అనుమతి లేదు.
- నృపతుంగ హాల్ :- ఇది జిల్లా ఈశాన్య భూభాగంలో చిన్న కొండ మీద ఉంది. కొండమీద నుండి హుబ్లీ నగరం సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడి నుండి హుగ్లీ నగరంలోని అమరగోలి, విమానాశ్రయం వరకు కనిపిస్తుంది. ఉదయపు నడక సాగించే వారికి, సాయంత్రపు వేళలో వ్యాహ్యాళికి వెళ్ళే వారికి ఇది చాలా అనువైన ప్రదేశం.
- సిద్ధరూత మఠం :- ఇది ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ. ఇది స్వామి సిద్ధరూధ అధ్వైత సిద్ధాంత ప్రవచన కేంద్రం. ఇది హుబ్లీ నగర శివార్లలో ఉంది.
- గ్లాస్ హౌస్ :- ఈ అద్దాల మండపాన్ని ప్రధానమంత్రి ఇందిరాగాంధి చేత ప్రారంభించబడింది.
- బాణశంకరి ఆలయం (అమర్గొలి) లో శంకరలింగ, బాణశంకరి ఆలయాలు ఉన్నాయి. ఇది హుబ్లి- ధార్వాడ మార్గంలో నవనగర సమీపంలో ఉంది.
- అన్నిగెరి :- వద్ద పలు కల్యాణి చాళుక్యుల కాలంనాటి " అమరేశ్వర ఆలయం " ఉంది. చారిత్రక ఆలయాలు ఉన్నాయి. హుబ్లి నుండి కి.మీ దూరంలో ఉంది. ఇది హుబ్లికి 30కి.మీ దూరంలో హుబ్లి- గదగ్ మార్గంలో ఉంది.
- నావలగుండ :- శ్రీ జగద్గురు అజాత నాగలింగ స్వామి ముత్త .
- కుండోగి :- హుబ్లీ నుండి 15 కి.మీ దూరంలో హుబ్లీ- ధార్వాడ మార్గంలో ఉంది. ఇక్కడ శంభులింగ ఆలయం ఉంది. ఇది కర్నాటక రాష్ట్రంలోని హిదూస్థానీ సంగీతానికి కేంద్రంగా ఉంది. ఇది హిందూస్థానీ సంగీతానికి విశ్వవిద్యాలయం వంటిది. సవాయి గంధర్వ యొక్క జన్మస్థలం. భారతరత్న, సవాయి గంధర్వ గురు పండిట్ భీమ్సేన్ జోషి, గంగూబాయ్ హంగల్ హిందుస్తానీ సంగీతం అధ్యయనం చేసారు.
కల్ఘతగిసవరించు
- తంబూర్ :- కల్ఘత్గి నుండి 8 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ బసవన్న ఆలయం ఉంది. ఇక్కడ దేవకూప్ప అరణ్యం ఉంది.
- శ్రీ బసవేశ్వరాలయం :- ఇది భోగెనగరకొప్పలో ఉంది. ఇది కలఘతగి నుండి 14 కి.మీ దూరంలో ఉంది.
- మహాలక్ష్మీ ఆలయం.
- శాంతినాథ ఆలయం.
- శాతినాథ బసది జైన ఆలయం.
రిచ్ జానపద వారసత్వంసవరించు
- డోల్లు కునిథ :- ఇది ప్రబల డ్రమ్ము నృత్యం, డ్రమ్ములను వర్ణరంజితమైన వస్త్రాలతో అలంకరించి వాయిస్తారు.
- వీరాగాసె :- వీరాగాసె ప్రబల జానపద నృత్యం. ఇది వీరత్వానికి చిహ్నంగా ప్రదర్శించబడుతుంది. ఇది వీరబధ్ర స్వామిని ఆరాధిస్తూ నర్తించబడుతుంది. శ్రావణ, కార్తిక మాసాలలో ఈ నృత్యం శివారాధనలో భాగంగా నర్తించబడుతుంది. ఈ నర్తకులను లింగదేవరు అంటారు.
- నందికొలు కునిత :- మాలే భక్తులు శివారాధన సమయంలో ఈ కళను ప్రదర్శిస్తుంటారు. నంది పోలె 18 క్యూబిట్ల పొడవు ఉంది. ఒక్కొక క్యూబిటును ఒక ధర్మ అంటారు. పోల్ పొడవును ఇత్తడి కుండలు, రేకులతో అలంకరించబడి ఉంది. భక్తులు ఆనందపరవశత్వంతో వాయిధ్యగోష్ఠి నడిమ చేసే నృత్య ప్రకంపనలు పోలులో ఉన్న ఇత్తడి కుండలు, రేకులు ప్రతిధనిస్తాయి.
- జొడు హలిగె :- హలిగె అంటే రెండు వాయిద్యాలను ఒకేసారి లయబద్ధంగా వాయిస్తూ ప్రదర్శించే కళారూపం. కాళాకారులు వారి శక్తియుక్తులను ఉపయోగిస్తూ చేసే ప్రదర్శన పేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. హల్లిగి గుండ్రంగా ఉంటుంది. దానిని బర్రెతోలుతో బిగించి తయారు చేస్తుంటారు. దీనిని చిన్న పూల్లలను ఉపయోగించి వాయిస్తారు.
- లంబాని నృత్యం :- లంబాని నృత్యంలో స్త్రీలు వర్ణరంజితమైన వస్త్రధారణ చేస్తుంటారు. గుండ్రంగా నిలిచి లయబద్దంగా తిరుగుతూ నరిస్తుంటారు. ఈ నృత్యం అసాధారణంగా ఉంటుంది. వారు కొన్ని ముఖ్యసమయాలలో స్వేచ్ఛాయుతంగా నర్తింస్తుంటారు. నాట్యం వారి జీవితంలో ఒక భాగంగాఉంటుంది. లంబాడీ నివాసం, వస్త్రధారణ, జీవనసరళి ప్రత్యేకంగా ఉంటుంది.
- వీరబధ్రకునిత :- నృత్యకారులు వీరబధ్రుని కథను వువరిస్తూ నర్తింస్తుంటారు. పౌరాణిక దైవం మహాశివుని సృష్టి. దక్షుని అహంకారానికి తగిన బుద్ధి చెప్పడానికి దక్షాయఙాంలో సతీదేవి ఆత్మాహుతికి కృద్ధుడైన పరమశివునిచేత వీరబధ్రుడు సృష్టించబడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ జానపద కళారూపం అంతరించిపోతున్న దశలో ఉంది. కర్నాటకాలో ఈ నృత్యరూప ప్రదర్శనకు తగిన ప్రోత్సాహం లభించడం లేదు. ప్రత్యేకంగా ఉత్తరకర్నాటకలోని దొద్దాట, సన్నట, గొంబెవతలో ఇప్పుడీ కళ క్షీణస్థితిలో ఉంది.
ప్రజలు, భాష, ఆచారాలుసవరించు
జిల్లాలో ప్రధానంగా కన్నడ వాడుకలో ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో మరాఠీ భాష వాడుకలో ఉంది. మరాఠీ భాష కూడా గుర్తించతగిన స్థితిలో ఉంది. ఇక్కడ మాట్లాడే కన్నడ భాషను ధార్వాడ కన్నడ అంటారు. ఇది దక్షిణ కర్నాటకలో మాట్లాడే భాషకంటే స్వల్పమైన భేదంతో ఉంటుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో పురుషులు తలపాగా (ఫెటా) ధరిస్తుంటారు. పలువురు పురుషులు తెల్లని టోపీలను కూడా ధరిస్తుంటారు.
వ్యవసాయం, వాణిజ్యంసవరించు
జిల్లాలో అధికంగా జొవర్, మొక్కజొంబ, గోధుమలు, ఎర్రగడ్డలు, ఇతర పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో అదనంగా బొప్పాయి, అరటి, హార్టికల్చర్ పంటలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. వ్యవసాయ ఆధారితమైన బొరుగుల తయారీ, ఆతుకుల తయారీ, ఆహార నూనెనెల తయారీ సంస్థలు ఉన్నాయి.
వాణిజ్య కేంద్రంసవరించు
జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు హుబ్లి ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉంది. కర్నాటక రైతులే కాక ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వారి ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తున్నారు. హుబ్లీలో పెద్ద ఎ.పి.ఎం.సి మార్కెట్ ఉంది. ఇది హుబ్లి- ధార్వాడ మార్గంలో అమర్గొల్ వద్ద ఉంది. హుబ్లీ ఎ.పి.ఎం.సి. మార్కెట్‌లో ఎండుమిరపకాయలకు, ఎర్రగడ్డలకు, బియ్యం, పత్తి, జొన్నల పంటలు విక్రయించబడుతున్నాయి. హుబ్లి- ధార్వాడ నగరాలలో మద్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు గుర్తించతగినంతగా స్థాపించబడి ఉన్నాయి. పరిశ్రమల నుండి ఇంజనీరింగ్ పరికరాలు, ఎలెక్ట్రికల్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తున్నాయి. జిల్లాలో పలు స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి.
పరిపాలనా విభాగాలుసవరించు
విభాగాల వివరణసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | 5 ధార్వాడ్, హుబ్లి, కాల్ఘాట్గీ, కుంద్గోల్ల, నావల్‌గుండ్. |
గ్రామ పంచాయితీలు | 50 [6] |
హుబ్లి- ధార్వాడ నరపాలితంసవరించు
Hubli-Dharwad Municipal Corporation హెచ్.డి.ఎం.సి 1962లో రూపొందించబడింది. రెండు నగరాల మద్య 20 కి.మీ దూరం ఉంది. నగరాభివృద్ధి చరిత్రలో ఇది ఒక ప్రయోగం. నగరపాలిత (కార్పొరేషన్) వైశాల్యం 181.66 చ.కి.మీ. ఇందులో 45 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 1991లో జనసంఖ్య 7 లక్షలు. ప్రస్తుత జనసంఖ్య 15 లచలు.
- హుబ్లి :- 1855 ఆగస్టు 15న హుబ్లి పురపాలకం రూపొందించబడింది.
- ధార్వాడ :- ది ధార్వాడ ముంసిపల్ కౌంసిల్ 1856 జనవరిలో రూపొందించబడింది.
- హుబ్లి వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా గుర్తించబడుతుంది. విద్యా కేంద్రగా కూడా ధార్వాడ అభివృద్ధి చెందింది.
- వైశాల్యపరంగా జంట నగరాల కార్పొరేషన్ రాష్ట్రంలో రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో బెంగుళూరు కారఒరేషన్ ఉంది. హెచ్.డి.ఎం.సి పలు మార్పులను చూసింది. నగరపాలన ప్రజానుకూలంగా, పారదర్శకంగా నిర్వహించబడుతుంది. అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. అత్యున్నత సేవలకు పోలీస్ వ్యవస్థ ఐ.ఎస్.ఒ సర్టిఫికేట్ పొందింది.
ఇది కూడ చూడుసవరించు
మూలాలుసవరించు
- ↑ Columbia-Lippincott Gazeteer. p. 511
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
Kosovo 1,825,632 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
West Virginia 1,852,994
- ↑ "Chapter XIV, Karnataka, The Tourist Paradise". Archived from the original on 4 మార్చి 2009. Retrieved 30 March 2009.
- ↑ "Reports of National Panchayat Directory:". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-07. Retrieved 4 ఫిబ్రవరి 2015.