ధోబాలే లక్ష్మణ్ కొండిబా

ధోబాలే లక్ష్మణ్ కొండిబా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

ధోబాలే లక్ష్మణ్ కొండిబా

పదవీ కాలం
2009 – 2014
ముందు రాజన్ పాటిల్
తరువాత రమేష్ కదమ్
నియోజకవర్గం మోహోల్

నీటి సరఫరా శాఖ మంత్రి
పదవీ కాలం
2009 – 2014

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర , భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ధోబాలే లక్ష్మణ్ కొండిబా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి క్షీరసాగర్ సంజయ్ దత్తాత్రయపై 29,179 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా నీటి సరఫరా శాఖ మంత్రిగా పని చేశాడు.

ధోబాలే లక్ష్మణ్ కొండిబాకి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ నుండి టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవస్థానంలో నిలిచాడు.[3] ధోబాలే లక్ష్మణ్ కొండిబా ఆ తరువాత బహుజన రాయత్ పరిషత్ ద్వారా బిజెపితో పొత్తు పెట్టుకొని ఆ తరువాత 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు అక్టోబర్ 23న బారామతి ఎంపి సుప్రియా సూలే సమక్షంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) పార్టీలో చేరాడు.[4]

వివాదం

మార్చు

లక్ష్మణ్‌రావ్ ధోబ్లే తనను పదే పదే లైంగికంగా వేధిస్తున్నాడని 42 ఏళ్ల మహిళ ఆరోపించిన నేపథ్యంలో ఆయనపై బోరివాలి పోలీసులు IPC సెక్షన్లు 376 (అత్యాచారం), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ బాల్సింగ్ రాజ్‌పుత్ తెలిపాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "Mohol Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
  4. "Blow for BJP in Maharashtra: Former minister Laxman Dhobale joins Sharad Pawar's NCP" (in ఇంగ్లీష్). Business Today. 23 October 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
  5. "Maharashtra NCP leader Dhobale booked for rape" (in Indian English). The Hindu. 13 September 2014. Archived from the original on 10 June 2018. Retrieved 13 January 2025.
  6. "NCP leader and former Maharashtra minister Laxman Dhoble accused of rape". The Times of India. 13 September 2014. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.