నందిత బన్న సింగపూర్ కు చెందిన మోడల్, ప్రవాస భారతీయురాలు. ఆమె 18 సెప్టెంబర్ 2021న మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌ - 2021 కిరీటాన్ని గెలుచుకుంది.[1]

నందిత బన్న
మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌ - 2021
వ్యక్తిగత వివరాలు
జననం2001
సింగపూర్
తల్లిదండ్రులుగోవర్ధన్‌రావు , ఫణి మాధురి
బంధువులుహర్ష సౌరవ్‌ (తమ్ముడు)

జననం, కుటుంబ నేపథ్యం, విద్యాభాస్యం

మార్చు

నందిత బన్న 2000లో సింగపూర్లో జన్మించింది. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారు, దూదివారి వీధి. నందిత తల్లిదండ్రులు ఫణి మాధురి, గోవర్ధన్‌లు ఉద్యోగరీత్యా 25 సంవత్సరాల క్రితం సింగపూర్‌ వెళ్లి స్థిర పడ్డారు. ఆమె నాన్న సింగపూర్‌లో ఏవియేషన్‌ సప్లై చెయిన్‌ సీనియర్‌ మేనేజర్‌గా, తల్లి సివిల్‌ ఇంజినీరుగా పని చేస్తుంది.

నందిత బన్న విద్యాభాస్యం 2000లో సింగపూర్‌లో ప్రారంభించింది. ఆమె తలితండ్రులు తనకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గురించిన అవగాహన కల్పించడం కోసం విశాఖపట్నంలోని టింఫనీ స్కూల్లో 5, 6, 7 తరగతులు చదివించారు. నందిత తర్వాత సింగపూర్‌లో ప్రతిష్ఠాత్మకమైన రాఫుల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో పాస్ అయ్యి సీట్ సంపాదించి, అక్కడ 8 నుంచి 12వ తరగతి వరకు చదివింది. ఆమె సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్శిటీలో డబుల్‌ డిగ్రీ చేసే అర్హత సంపాదించి, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టం మేనేజ్‌మెంట్‌ (బిజినెస్ అనలిటిక్స్) రెండింట్లోనూ డిగ్రీను చదువుతుంది. ఆమె తమ్ముడు హర్ష సౌరవ్‌ కెనడా, వాంకోవర్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు.[2]

మోడలింగ్ రంగం

మార్చు

నందితకు చిన్ననాటి నుంచి ఫ్యాషన్‌ రంగం పై ఆసక్తి ఉండడంతో ఆమె పార్ట్‌ టైమ్‌ మోడల్‌గా ఈ రంగాన్ని ఎంచుకుంది. ఫ్యాషన్‌ రంగంలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన పోటీలకు హాజరైంది. ఆమె మార్చిలో సింగపూర్‌లోని ఆర్ట్-సైన్స్ మ్యూజియంలో లూయిస్ విట్టన్ ఉమెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2021 లో మోడల్‌గా, హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్‌ను ప్రమోట్ చేసే టీవీ యాడ్‌లో, డిసెంబర్ 2020-జనవరి 2021 వోగ్ సింగపూర్ లో పని చేసింది. నందిత సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్ని ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి 'మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021' కిరీటం గెలుచుకుంది.[3][4]ఆమె 2021 డిసెంబర్‌లో ఇజ్రాయిల్‌లో జరిగే మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సింగపూర్ తరపున పాల్గొంటుంది.[5]

మూలాలు

మార్చు
  1. Eenadu (18 September 2021). "మన అమ్మాయే మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  2. Andrajyothy (19 September 2021). "మనమ్మాయి మిస్‌ సింగపూర్‌". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  3. TV9 Telugu (18 September 2021). "Miss Universe Singapore 2021: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి.. నందిత బన్న.. ఆమెది ఎక్కడో తెలుసా..?". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (20 September 2021). "మిస్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  5. Eenadu (19 September 2021). "ముగ్గురూ... ముగ్గురే..." Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.