నదేజ్దా మిఖల్కోవా
రష్యన్ నటి
నదేజ్దా నికితిచ్నా మిఖల్కోవా, రష్యన్ సినిమా నటి.
నదేజ్దా మిఖల్కోవా | |
---|---|
జననం | నదేజ్దా నికితిచ్నా మిఖల్కోవా 1986 సెప్టెంబరు 27 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రెజో గిగినీష్విలి |
పిల్లలు | 2 |
జననం
మార్చునదేజ్దా మిఖల్కోవా 1986, సెప్టెంబరు 27న సినీ నటుడు, దర్శకుడు నికితా మిఖల్కోవ్ - ఫ్యాషన్ డిజైనర్ టాట్యానా షిగేవా దంపతులకు మాస్కో నగరంలో జన్మించింది. ఈమె సోదరుడు ఆర్టియోమ్, సోదరి అన్నా కూడా నటులే.
సినిమారంగం
మార్చు6 సంవత్సరాల వయస్సులో తన తండ్రి దర్శకత్వం వహించిన బర్న్ట్ బై ది సన్ [1] సినిమాలో తొలిసారిగి నటించింది. ఈ సినిమా కేన్స్‌లో గ్రాండ్ ప్రైజ్,[2] అనేక ఇతర అవార్డులతోపాటు ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డును కూడా అందుకుంది.[3]
వ్యక్తిగత జీవితం
మార్చుదర్శకనిర్మాత రెజో గిగినీష్విలితో నదేజ్దా మిఖల్కోవా వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె,[4] కుమారుడు ఉన్నాడు. 7 సంవత్సరాల వివాహం తర్వాత 2017 అక్టోబరులో వారు విడాకులు తీసుకున్నారు.[5]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1993 | అన్నా: 6 - 18 | నదియా | డాక్యుమెంటరీ, ఆమె వలె |
1994 | బర్న్ట్ బై ది సన్ | నాడియా కోటోవా | తొలి సినిమా |
1999 | ది బార్బర్ ఆఫ్ సైబీరియా | ఫెయిర్ వద్ద అమ్మాయి | గుర్తింపు పొందలేదు |
2000 | ది ప్రెసిడెంట్ అండ్ హిజ్ గ్రాండ్ ఢాటర్ | మాషా, ఆమె కవల | |
2010 | బర్న్ట్ బై ది సన్ 2: ఎక్సోడస్ | నాడియా కోటోవా | |
2011 | బర్న్ట్ బై ది సన్ 2: సిటాడెల్ | నాడియా కోటోవా | |
2019 | డెడ్ లేక్ | నటాషా | |
2021 | బ్రైటన్ ఫోర్త్ |
మూలాలు
మార్చు- ↑ "Nadezhda Mikhalkova Profile". Special Broadcasting Service. Archived from the original on 2011-11-12. Retrieved 2023-06-30.
- ↑ "The Exodus, the destiny of Serguei Kotov seen by Nikita Mikhalkov". Festival de Cannes. Retrieved 2023-06-30.
- ↑ "Burnt By The Sun 2: Exodus". AllBusiness.com. Retrieved 2023-06-30.
- ↑ Стрельникова, Елена. "Надежда Михалкова родила дочку". Komsomolskaya Pravda. Retrieved 2023-06-30.
- ↑ "Дочь Михалкова развелась с режиссером Резо Гигинеишвили". ria.ru. Retrieved 2023-06-30.