ప్రధాన మెనూను తెరువు

నరవ (గిద్దలూరు)

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని గ్రామం


నరవ, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.

నరవ
రెవిన్యూ గ్రామం
నరవ is located in Andhra Pradesh
నరవ
నరవ
అక్షాంశ రేఖాంశాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం682 హె. (1,685 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,503
 • సాంద్రత370/కి.మీ2 (950/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata
నరవ గ్రామదృశ్యం
స్థానికంగా మంగమ్మ తిప్ప అని పిలవబడే నరవకొండ
నరవ గ్రామంలోని భృగుమల్లేశ్వర ఆలయం

గ్రామం పేరువెనుక చరిత్రసవరించు

రెండు కొండల మధ్య సందులో సాగే దారిని నరవ అంటారు. ఈ గ్రామము రెండు కొండల మధ్య ఉండటము వలన గ్రామానికి ఆ పేరు వచ్చింది.

గ్రామ భౌగోళికంసవరించు

నరవ గ్రామం, మండల కేంద్రమైన గిద్దలూరు నుండి తూర్పు వైపున 3 కిలోమీటర్ల దూరములో గిద్దలూరు - కొమరోలు మార్గమున ఉంది.

సమీప గ్రామాలుసవరించు

కొంగలవీడు 2 కి.మీ,ముండ్లపాడు 4 కి.మీ,కొమ్మునూరు 5 కి.మీ,అంబవరం 6 కి.మీ,కంచిపల్లి 7 కి.మీ.

సమీప మండలాలుసవరించు

తూర్పున కొమరోలు మండలం,ఉత్తరం రాచెర్ల మండలం,దక్షణం కలసపాడు మండలం,ఉత్తరం బెస్తవారిపేట మండలం.

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

నరవ గ్రామంలో, 1892 లో బోర్డు స్కూలు ఏర్పాటు చేసారు. తరువాత గుర్తింపు వచ్చింది. [2]

గ్రామ పంచాయతీసవరించు

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బండి రాజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
  2. ఈ గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణానికి, 2015,ఆగస్టు-15వ తేదీనాడు భూమిపూజ నిర్వహించారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

 
నరవ చెరువు - నరసింహస్వామి ఆలయమున్న బోడు నుండి తీసిన ఫోటో

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంసవరించు

నరవ బోడుపై ఒక ప్రాచీన నరసింహ స్వామి ఆలయము ఉంది. దీనిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మించాడని స్థానికుల కథనం[2]. కానీ ఈ ఆలయం 1487కు పూర్వం కట్టబడిందనడానికి శాసనాధారాలు ఉన్నాయి.[3] ఇక్కడ ప్రతి యేడూ ఫాల్గుణ మాసంలో, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించెదరు. ఈ తిరుణాలకు చుట్టుపక్కల గ్రామాలనుండి పెద్దసంఖ్యలో తరలివస్తారు. కొండపైన ఆలయానికి వెళ్ళటానికి సోపానమార్గము ఉంది. ఈ ఆలయానికి నరవలో 5 ఎకరాలు, బయ్యనపల్లెలో 4.62 ఎకరాల, రంగారెడ్డిపల్లెలో 7.15 ఎకరాల మాన్యంభూములున్నవి. [3]

శ్రీ భృగుమల్లేశ్వరస్వామివారి ఆలయంసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,503 - పురుషుల సంఖ్య 1,260 - స్త్రీల సంఖ్య 1,243 - గృహాల సంఖ్య 675

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,556.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,299, మహిళల సంఖ్య 1,257, గ్రామంలో నివాస గృహాలు 662 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 682 హెక్టారులు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-24; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-6; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-16; 5వపేజీ.