నరసింహ సరస్వతీస్వామి

నరసింహ సరస్వతీస్వామి

'మాయాతమోర్కం విగుణం గుణాడ్యం|శ్రీవల్లభం స్వీకృతభిక్షువేషం|| సద్భక్త సేవ్యంవరిష్టం|వందే నృసిం హేశ్వర పాహి మాం త్వం||

182.18.177.246 06:26, 1 జూలై 2016 (UTC) రజనీభరధ్వాజ

మహారాష్టదేశంలోని అకోలా జిల్లాలోని "కరంజా"అనే గ్రామంలో శుక్లయజుశాఖకు [యాజ్ఞవల్క్యశాఖ] చెందిన మాధవశర్మ,అంబ దంపతులకు నరసిం హ సరస్వతి జన్మించారు.గత జన్మలో శ్రీపాదవల్లభులచే తాను పుత్రునిగా జన్మించగలనని వరం పొందిన మూర్ఖ పుత్రుని తల్లియైన అంబికయే ఈ అంబ .మాధవశర్మ ,అంబ దంపతులకు కుమారుడు పుట్టిన వెంటనే సాధారణ శిశువులా ఏడవకుండా ఓంకారాన్ని ఊచ్ఛరించటం చూచి తల్లితండ్రులతోపాటు చుట్టుపక్కలవారుకూడా ఆశ్ఛర్యపోయారు.ఈ శిశువు జాతకాచక్రాన్ని చూసిన జోతిష్యులు "ఈ పిల్లవాడు భవిష్యత్తులో జగద్గురువు అవుతాడు ధర్మోద్ధరణ చేస్తాడు ఈ పురుష శ్రేష్టుని వల్ల మీ వంశం యావత్తూ తరిస్తుంది".అని చేప్పటం వల్ల వాళ్ళు ఆ పిల్లవానికి "నరహరి"అని పేరు పెట్టారు నరహరి అంటే "నరులలోశ్రేష్టమైనవాడు అని అర్ధం .పురుషోత్తముడని విశేషార్ధం .

తన దగ్గిర పిల్లవాడికి చాలినన్ని పాలు లేకపోవటం చూచి "ఒక ఆవును గాని మేకను గానీ లేదా ఒక దాదిని గాని ఏర్పాటు చేయమని" అంబ భర్తతో చెబుతుంటే, చంకలోని ఆ పిల్లవాడు తల్లి వక్షోజాలను కిల కిలా నవ్వుతూ తాకాడు వెనువెంటనే వాటి నుంచి ధారాపాతంగా పాలు స్రవించాయి. ఈ అద్భుత లీలను చూచి మాధవశర్మ, అంబ దంపతులిరువురు ఈ లీల అందరికి తెలిస్తే దిష్టి తగులుతుందని భయపడి ఎవరికి చెప్పలేదు. పిల్లవాడికి ఏడేళ్ళు వచ్చినా అతడు ప్రణవం తప్ప ఏ మాటలు ఊచ్ఛరించేవాడు కాదు.తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి మాటలు రావాలని ఎన్నో విధాల ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది అందుకు వాళ్ళు కలతచెంది విచారిస్తుంటే నరహరి తన దగ్గర ఉన్న ఒక ఇనప వస్తువును తాకాడు వెంటనే అది సువర్ణంగా మారింది .ఆ లీల పరమార్ధం ఏమిటో వాళ్ళు గ్రహించలేకపోయారు. అనుమానంతో మరికొన్ని ఇనప వస్తువులను ఆ పిల్లవాడి చేతికిచ్చి తాకించారు.ఆ వస్తువులన్నీ కూడా బంగారంగా మారాయి .ఈ వింత చూచి తమ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదనీ ఏ సిద్ధ పురుషుడో ఇలా తమకు పుత్రుడై జన్మించాడనీ వాళ్ళు భావించినప్పటికీ అతడు మాట్లాడకపోవటం చూచి చాలా దిగులు పడుతూ వుండేవారు. ఒకరోజు అంబ తన కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని "నాయనా !నీవెప్పూడు మాట్లాడతావురా? నీ ముద్ధు మాటలు వినే భాగ్యం మాకు లేదా తండ్రీ?" అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. నరహరి చేత్తో సైగలు చేస్తూ తనకు ఉపనయనమై యజ్ఞోపవీతం మెళ్ళోపడిన తర్వాత గాయత్రీ ఉపదేశమైన వెంటనే మాట్లాడతా"నని తెలియచేసాడు.

తల్లిదండ్రులు పరమానందభరితులై తక్షణం కుమారుడికి ఉపనయనంచేయాలని సంకల్పించి దైవజ్ఞూలచే సుమూహుర్తం పెట్టించి శుభలేఖలు రాయించి అందరికి ఆహ్వానాలు పంపించారు."మాటలే రాని పిల్లవాడు గాయత్రీ మంత్రాన్ని ఏం ఉచ్ఛరిస్తాడు ? మూగవాడికి ఈ వడుగేమిటి ? వీళ్ళపిచ్చికాకపోతే ?" అని బంధువులు స్నేహితులు అంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. ఉపనయన సందర్భంలో తండ్రై అయిన మాధవశర్మ ఉపదేశించిన గాయత్రీ మంత్రాన్ని సుస్వరంతో నరహరి ఉచ్చరించటాన్ని చూచి ఈ శుభకార్యానికి వచ్చిన బంధు మిత్రులంతా విభ్రాంతులయ్యారు. ఇక తల్లిదండ్రులకైతే వారి ఆనందానికి పట్టపగ్గాలులేవు. ఉపనయనంలో ప్రప్రథమంగా మాతృమూర్తి వటువుకు భిక్ష ఇవ్వటం విధి .కాబట్టి అంబ కుమారుడు వద్ధకు వెళ్ళి "నాయనా !భిక్ష అడుగు !" అంది వేంటనే నరహరి "అగ్నిమీళం పురోహితం" అన్న ఋగ్వేదంలోని ప్రథమ మంత్రాన్ని ఫఠించి తల్లిని భిక్ష యాచించాడు తల్లి మొదటిసారి వటువుకు భిక్ష పెట్టింది. వటువు రెండోసారి యజుర్వేదంలోని "ఇషేత్వా" అనే రెండో పనస చదివి భిక్షమార్ధించాడు.తల్లి వటువుకు రెండోసారి భిక్ష ఇచ్చింది .నరహరి మూడోసారి 'అగ్ని ఆయాహి" అనే సామవేద మంత్రాన్ని చదివి తల్లిని భిక్షమార్ధించాడు.ఉపనయనానికి వచ్చిన వారందరూ విభ్రాంతులై 'నరహరి సాక్ష్యాత్తు భగవదవతారమే గాని నరుడు కాదు జగద్గురువు" అని నవ వతువైన నరహరికి భక్తి పూర్వకంగా నమస్కరించారు.

భిక్ష కాగానే నరహరి "అమ్మా!నువ్వు నన్ను భిక్ష అడగమన్నావు నీవు మాట తప్పరాదు అడుగుతున్నాను నీ మాట ప్రకారం నా యావ జీవితం భిక్షతోనే కాలం గడుపుతాను సన్యాసాశ్రమం స్వీకరించటానికి అనుజ్ఞ ఇవ్వు!" అని అడిగాడు ఇన్నాళ్ళు మూగగా వుండి అకస్మాత్తుగా మాట్లాడుతున్న పుత్రుడు ముద్ధు మాటలు వింటూ ఆనందంలో తేలిపోతున్న ఆ తల్లిదండ్రులకు నరహరి మాటలు అశునిపాతాలయ్యాయి.దఃఖం కట్టలు త్రెంచుకుంది "నాయనా!మాకు నువ్వు ఒక్కగానొక్క కుమారుడివి నువ్వు ఇళ్ళు విడిచిపోతే మాకింక దిక్కేవరు తండ్రీ!మేము బ్రతికేదెట్లారా నాయనా?" అంటూ ఆ బాలున్ని కౌగిలించుకుని వాళ్ళుశోకించటం మొదలు పెట్టారు .

అప్పుడు నరహరి శోకిస్తున్న తల్లిని చూచి "అమ్మా!ధర్మ రక్షణ కోసం నేను ఈ భువిపై అవతరించాను నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు వాళ్ళు మిమ్మల్ని ఎంతో భక్తిగా సేవించి వంశాన్ని ఉద్ధరిస్తారు.నీవు పూర్వజన్మలోశివార్చనచేసి తత్పలితంగా నన్ను పుత్రునిగా పొందావు "అని చెప్పి ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగేటట్లు చేసాడు .ఫలితంగా అంబ తనకీజన్మలో కలిగిన పుత్రుడు శ్రీపాదవల్లభుడేననే సత్యాన్ని గ్రహించింది.నవ వటువైనటువంటి నరహరి పాదాలపై వ్రాలింది .నరహరి ఆమెను లేవనెత్తి "అమ్మా!నాకు తీర్ధాటనకై అనుమతినివ్వు "అని అడిగితే ఆమె "నాయనా'నాకు నలుగురు కుమారులు కలుగుతారన్నావు ఒకకుమారుడు కలిగేటంతవరకైనా నీవు మావద్ధవుండు "అని అంది ."అట్లాగేనమా!ఒకడు కాదు మీకు ఇద్ధరు కుమారులు కలిగేటంతవరకు మీదగ్గర వుంటాను ఆతర్వాత మీరు నాకు సన్యసించటానికి అనుజ్ఞ ఇవ్వాలి " అన్నాడు అందుకు మాధవశర్మ, అంబ దంపతులు సంతోషంగా అంగీకరించారు. ఇట్లా ఒక సంవత్సరం గడిచింది .అంబ గర్బం ధరించి కవల పిల్లలను కన్నది .అప్పుడు నరహరి తల్లిని చూచి "అమ్మా!నీకొరిక నెరవెరింది కదా?ఇంకా మీకు మరి ఇద్ధరు పుత్రులు కలుగుతారు ఆ తదుపరి ఒక కుమార్తె జన్మిస్తారు అందరూ పూర్ణాయుష్కులైవుంటారు .నేను నామాట నిలబెట్టుకున్నాను ఇక నీవు సంతోషంగా నాకు ఆజ్ఞ ఇవ్వవచ్చు .ముప్పైసంవత్సరాల తర్వాత మీకు మరలా నాదర్శనం లభిస్తుంది " అనిచెప్పి నరహరి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని బదరీనారాయుణుని దర్శనార్ధం బయలుదేరాడు . బదరీ దర్శించి ఆ తరువాత కాశీకి పయనమై వచ్చారు.కాశీలో గంగాతీరంలో అయన చేస్తున్న యోగ తపోధ్యానాలను చూచి కాశీవాసులంతా పాలుకారే పసితనంలోనే ఇంతటి వైరాగ్యమా అంటూ ఆశ్చర్యపోయారు. కాశీక్షేత్రంలో వున్న సన్యాసులలో మహాజ్ఞాని అనిపించుకున్న "కృష్ణసరస్వతి" అనే వృద్ధ తపస్వి నరహరిని చూచి "ఈ పిల్లవాడు భగవదవతారము" అని గ్రహించి వానికి సన్యాసమివ్వాలని సంకల్పించాడు.నరహరి ఆమహాత్ముని వద్ధ సశాస్త్రీయంగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించాడు.గురుదేవులైన కృష్ణసరస్వతి ఆ పిల్లవానికి "నరసిం హ సరస్వతి"అనే సన్యాసాశ్రమ నామంతోకూడిన యోగ ప్ట్టాను బహూకరించి తనజన్మధన్యమైనదని భావించాడు. కాశీ క్షేత్రంలో అనేకులు నరసిం హ సరస్వతీస్వామికి శిష్యులైనారు. కాశీక్షేత్రం నుండి నరసిం హసరస్వతి స్వామి వారు శిష్య సమూహంతో గంగాసాగర క్షేత్రానికి వచ్చి కొన్ని రోజులుండి అక్కడనుండి ప్రయాగ క్షేత్రతీర్ధానికొచ్చారు . ఆప్రయాగాక్షేత్రంలో "మాధవుడనే" భ్రాహ్మణునికి సన్యాసదీక్ష ఇచ్చారు .చాలామంది శిష్యులున్నప్పటికీ నరసిం హ సరస్వతి వారికి ఈ మాధవ సరస్వతి పై ప్రీతి ఎక్కువగావుందేది.స్వామివారి శిష్యులలో ప్రధానమైనవారు ఏడుగురు వాళ్ళపేర్లు బాలసరస్వతి, కృష్ణసరస్వతి, ఉపేంద్రసరస్వతి, మాధవసరస్వతి, సదానందసరస్వతి జ్ఞానజ్యోతిసరస్వతి, సిద్ధసరస్వతి ఈ సిద్ధసరస్వతే నామధారకుని ద్వారా "గురుచరిత్ర"ను జగతికి ఉపదేశించటం జరిగింది. .

ఉత్తర భారత దేశంలోని సకల క్షేత్రాలను దర్శించి మేరు పర్వత ప్రదక్షణ కావించారు తదనంతరం గంగా యమునా నదీ పరిక్రమణ యాత్ర కావించారు.పిమ్మట శిష్య సమూహంతో సహా దక్షణ బారతదేశానికి తరలివచ్చారు.దక్షణ బారతావనిలో కల ఎన్నెన్నో మహిమాన్వితమైన క్షేత్రతీర్ధాలను సేవిస్తూ ..పూర్వాశ్రమంలో తన జన్మస్ఠలమైన కరంజా నగరానికితిరిగి వచ్చారు నరసిం హసరస్వతీస్వామి .అక్కడ తన తల్లిదండ్రులను తమ్ముళ్ళను చెళ్ళిలిని ఆనందింపచేసారు. ఆ నగరములోని భ్రాహ్మణ్యమంతా యతీశ్వరులైన నరసిం హ సరస్వతీస్వామివారిని శిష్యసమేతంగా భిక్షకు ఆహ్వానించారు. నరసిం హసరస్వతులవారు శిష్యసమేతంగా బహూరూపాలు గైకొని ఏక సమయంలో అందరి ఇండ్లకు భిక్షకు వెళ్ళి అందరిని ఆశ్చర్యపరిచారు.చెల్లెలైన రత్న తన భవిష్యత్తును చెప్పమనికోరగా ..రత్న భవిష్యత్తును తెలుపుతూ " పూర్వజన్మలో నీవు గోవును కర్రతోకోట్టిన పాపము వల్ల ఈ జన్మలో నీకు కుష్టు రోగం వస్తుంది .అప్పుడు నాదర్శనం మరలనీకు లభిస్తుంది. ఆ రోగం వచ్చిన వెంటనే గంధర్వనగరానికి [గాణుగాపురం] నీవు వచ్చి భీమానదీ తీరానికి దక్షణంగా ఉన్న పాపవినాశతీర్ధంలో స్నానం చేయగానే ఆ రోగమ్నశించి పరిపూర్ణ ఆరొగ్యవంతురాలువు కాగలవు" అనిచెప్పి తల్లిదండ్రులనుండి సెలవు గైకొని కరంజా నగరం నుండి శిష్య సమేతంగా బయల్ధేరి మంజీరక క్షేత్రంలోగల మాధవారణ్యకం చేరారు .అక్కడ నృసిం హా భక్తుడైన మాధవారుణ్యయతికి నరసిం హస్వామిగా దర్శనమొసగి ఆయన్ని సంతృప్తుణ్ణి కావించారు

అటు పిమ్మట వాసర [నేటి భాసర}క్షేత్రానికిపోయి గోదావరిలో ప్రాణత్యాగం చేసుకొబోతున్న బ్రాహ్మణుని కాపాడి అయన ఉదరశుల[కడుపునొప్పి}వ్యాధిని పొగొట్టారు.సాయిదేవుని భక్తికి మెచ్చుకొని శిష్యునిగాస్వీకరించి, పదిహేను సంవత్సరాల తర్వాత మరల తన దర్శనం లభించగలదని వరమిచ్చారు .తనతోపాటు ఉన్న శిష్యులందరిని తీర్ధయాత్రలు చేయవలిసిందిగా ఆజ్ఞాపించి వారందరిని పంపి సిద్ధసరస్వతిని మాత్రం తోడు తీసుకుని వైద్యనాధం వెళ్ళి అక్కడ సంవత్సరకాలం పాటు నివసించారు .ఆ తరవాత భిల్లవాటిక[ఔదంబరు]క్షేత్రానికి వచ్చి, హస్తస్పర్శమాత్రంచేతనే మూర్గబ్రాహ్మణున్ని మహాజ్ఞాని అయ్యేటట్లు చేసారు ఆ తరవాత అమరపురానికి పోయి అక్కడ పన్నెండేళ్ళు వున్నారు ఆ ఊరిలోనే పేదభ్రాహ్మణుని ఇంటికి భిక్షకు పోయి, వాళ్ళ పెరటిలో తమ్మచెట్టు తీగను పీకి ఆ గృహస్ఠులకు ఆ తీగపాదులో నిధి లభించేటట్లుచేసి వారి దారిద్ర్యాన్ని దూరంచేసారు. గంగానుజుడను చాకలివాడిని తన యోగ శక్తితో ఒక్కరోజులో కాశీ, గయ, ప్రయాగలను దర్శింపచేసి ఇంటికి తీసుకుని వచ్చారు. తరవాత సిద్ధసరస్వతితో సహా నరసిం హసరస్వతీ స్వామి వారు గంధర్వపురం[నేటి గాణుగాపురం} చేరుకుని తాను కృష్ణాతటి పరీవాహక ప్రాంతంలోగల కదళీ వనంలో అదృశ్యమయ్యేటంతవరకు {అవతార పరిసమాప్తి వరకు ] అక్కడే నివసించారు .

గాణుగాపురంలో శ్రీ నరసిం హ సర్స్వతీస్వమివారు చూపిన లీలలు అనితరసాధ్యం. గొడ్డుభోతు బర్రెను పాలిచ్చే పాడి బర్రెగా మార్చారు. త్రివిక్రమయతికి విశ్వరూపంచూపించారు.తాను ప్రసాదించిన భస్మధారణ చేత ఛండాలునిగత ఏడు జన్మల పూర్వ స్మృతి కలిగించి వాని నోట నాలుగు వేదాలు పలికించారు వేద పండితుల గర్వమనిచారు. ఎండిన మేడికొమ్మను చిగురించేటట్లు చేసారు గౌరి అనేవృద్ధవనితకు ఋతుక్రమాన్ని కలిగించి పుత్రోదయమయ్యేటట్లు చేసారు .బ్రహ్మరాక్షసునికి శాపవిమోచనంకలగచేసారు ఏకకాలంలోఎనిమిది రూపాలలో ఎనిమిది ఊర్లలోని భక్తులింట భిక్షగైకొని భక్తులను సంతృప్తులను చేసారు బీదరు నవాబు రాచపుండు వ్యాధిని నయంచేసారు .పూర్వాశ్రమంలో తన చెల్లెలైన రత్నాబాయి కుష్టువ్యాధిని, నరహరి అనేభ్రాహ్మణుని కుష్టువ్యాధిని పొగొట్టారు .భాస్కరుడనే బ్రాహ్మణుడు ముగ్గురికి సరిపడే వంట చేస్తే ఆ వంటను అక్షయంగా చేసి వేలాదిమంది భుజించేటట్లుచేసారు .పొట్టకోసినా అక్షరం ముక్కరాని నందీశ్వరశర్మను మహాకవీశ్వరుని కావించారు

ఈ లోకంలోకి తాను వచ్చిన పని విజయవంతంగాపూర్తి చేసుకొని, అవతారసమాప్తి గావించాలని నిశ్చయించుకొని మఠంలో తననిర్గుణ పాదుకలుంచి శ్రీశైలయాత్ర చేయాలనే మిషతో శ్రీ నరసిం హాసరస్వతీ యతీశ్వరులు నలుగురు శిష్యులను వెంట గైకొని గాణుగాపురం నుంచి బయలుదేరారు తనను విడువలేక వెన్నంటి వస్తున్న పురజనులనుచూసి "నేనెక్కడికి వెళ్ళటం లేదు నా నిత్య కృత్యాలన్నీ యధావిధిగా భీమా అమరజా సంగమంలోని ఔదంబరవృక్షం క్రద జరుగుతాయి మధ్యాహ్నసమయానికి ఎప్పటిమాదిరిగానే నేను మఠానికి వచ్చి ఇక్కడే వుంటాను .అయితే నాపై నిజమైన నిశ్చలభక్తి కలిగినవారికే నా దర్శన భాగ్యం కలుగుతుంది అపరాహ్నవేళ భిక్షాసమయంలో అర్హులందరికి నాదర్శనం కలగచేస్తాను .ఈ గంధర్వపురానికి నాదర్శనంకోసం వచ్చేవాళ్ళ కోరికలన్నీ నేను తీరుస్తాను .ప్రాతఃకాలంలో సంగమంలో స్నానచేసి నానివాస స్ఠానమైన అశ్వస్ఠ వృక్షాన్ని అర్చించి ,నా సగుణ పాదుకలను పూజించే .మఠానికి వచ్చి నా నిర్గుణ పాదుకలను సందర్శించి సేవించేవాళ్ళను అనుగ్రహించై సదావాళ్ళ వశవర్తినై వుంటాను మఠంలో నేను లేననే మాట మరిచిపోండి" అని చెప్పి వాళ్ళను వెనకకు మరలించారు. వాళ్ళు మఠానికి తిరిగి వచ్చి చూసేసరికి యధాస్ఠానంలో కూర్చుని వున్న నరసిం హసరస్వతీ యతీశ్వరస్వామి వారు వారికి కనిపించారు .అప్పుడు వాళ్ళకు స్వామి మాటల్లోని సత్యం భోధపడింది .వారి మనస్సులు తేలిక అయినాయి .

నరసిం హసరస్వతీ స్వామివారు తన నలుగురు శిష్యులతో శ్రీశైలం చేరారు. తను గతంలో వైద్యనాధం పోయేముందు తనశిష్యులకులో గడ చెప్పినప్రకారం తన దర్శనం కోసం వచ్చి తన రాక కోసం నిరీక్షిస్తున్న శిష్య సమూహాన్ని కలుసుకుని వారికి పరమానందం చేకూర్చారు కొంతసేపటికి కొందరు జాలరులైన నావికులు ఆ నలుగురు శిష్యుల వద్ధకు వచ్చి "మేము మార్గ మద్యంలో శ్రీనరసిం హ సరస్వతీయతీస్వరులను దర్శించాం .వారి చేతిలో దండకమండలాలు వున్నాయి .ఆ యతీశ్వరులు మమ్మలనుచూచి 'నాశిష్యులు పాతళ గంగతీరంలోవేచిచూస్తున్నారు, వారికి మాక్షేమసమాచారాలు తెలియచేయండి మేము కదళీవనానికి వెళ్తున్నామని చేప్పండి వారిని గంధర్వనగరం వెళ్ళమని సెలవిచ్చారు."అంటూ గురు సందేశం చెప్పి జాలర్లు వెళ్ళిపోయారు .ఇంతలో నాలుగు పుష్పాలు కృష్ణానదీజలాలలో తేలియాడుతూ వారున్నచోటుకు వచ్చి ఆగిపోయాయి.ఆ నలుగురు శిష్యులు గురుప్రసాదంగా తమకు లభించిన ఆ నాలుగు పుష్పాలను కళ్ళకద్ధుకుని పరమానందభరితులై స్వీకరించారు.

గురుమహిమను ఎవరూ వాక్కులతో వర్ణించలేరు అలా వర్ణించే శక్తి కూడా ఎవ్వరికీవుండదు.గురుప్రసాదాన్ని పుష్కలంగా పొందిన గంగాధరసరస్వతీ "గురుశ్చరిత్రం ఖలు విస్తరేణ మయోదితం కామధుగాదరేణ " అని నేను చెప్పిన ఈ గురుచరిత్ర కామదేను సదృశయమైనదని ఉద్బోధించాడు.ఈ చరిత్ర వేదతుల్యమనటంలో ఎటు వంటి సందేహంలేదు. దత్తపరంపరలో శ్రీపాదులు యతిధర్మానికి ఆధ్యులైనిలిచి గురు తత్వానికి బీజావాపనం గావిస్తే, శ్రీనరసిం హసరస్వతీస్వాంవారు దానికి దోహదంచేసి మహావృక్షం కావించారు ఆ తరవాత అది శాఖోపశాఖలై ఎలా విస్తరించిందో !ఆ తరవాత వచ్చి విస్తరిల్లిన గురుపరంపరే నిదర్శణంగా నిలుస్తున్నది

ఓం ద్రాం శ్రీ నృసిం హ సరస్వత్యై నమః అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త! .