నరావతారం
నరావతారం మానవ పరిణామంపై నండూరి రామమోహనరావు 1972 లో రాసిన పుస్తకం.[1] ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఉపోద్ఘాతం. రెండో భాగంలో ప్రాచీన మానవుని పరిణామం, మూడో భాగంలో ఆధునిక మానవుని పరిణామాన్ని గురించి చర్చించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ పుస్తకానికి నార్ల వెంకటేశ్వరరావు ముందుమాట రాశాడు.
రచయిత(లు) | నండూరి రామమోహనరావు |
---|---|
ప్రచురణ సంస్థ | 1972 |
ప్రచురణ కర్త | విక్టరీ పబ్లికేషన్స్ |
పూర్వరంగం
మార్చుతెలుగులో దేవుళ్ళ అవతారాల గురించి చాలామంది రాస్తున్నారనీ, కానీ నరావతారం లాంటి రచనలు నండూరి లాంటి కొద్దిమంది రచయితలే రాస్తున్నారని పుస్తకానికి ముందుమాటలో నార్ల వెంకటేశ్వరరావు అన్నాడు. ఆధునిక వైజ్ఞానిక, శాస్త్రసాంకేతిక రంగాలు నూతన దిశలో పురోగమిస్తున్నట్లు చిత్తశుద్ధిగా నమ్మినవాడు, దానిచే ఉత్తేజం పొందినవాడు అయిన నండూరి విజ్ఞానశాస్త్రంలో ఏ డిగ్రీ లేకపోయినా ప్రామాణికమైన, రసవత్తరమైన రచనలు చేశాడని నార్ల తన పరిచయంలో పేర్కొన్నాడు. [2]
భూమండలంపై జీవజాతుల్లో నరావతారం ఉన్నత స్థాయికి చెందినది. మానవుడు ప్రస్తుత రూపంలోకి మారడానికి మునుపు ప్రకృతిలో ఎన్నో నర వానర రూపాలు వచ్చాయి. వీటిలో హోమో సేపియన్స్ అనే ప్రస్తుత రూపం విజయవంతమైంది. దీనికి ముందు జరిగిన ప్రయోగాలు, అంతకు ముందటి అసంఖ్యాకమైన జీవజాతుల పరిణామ క్రమాన్ని వివరించడమే ఈ పుస్తకం ఉద్దేశ్యమని రచయిత ముందుమాటలో వివరించాడు.
విభాగాలు
మార్చు- మొదటి భాగం
- ఉపోద్ఘాతం
- జీవకోటిలో మానవుని స్థానం
- డార్విన్ కు ముందు పరిణామ వాదం
- జీవకోటి పరిణామ పద్ధతి
- వంశ పారంపర్యం
- భూమి తొలిరోజుల కథ
- యుగయుగాలలో పరిణామం
- మానవుని సన్నిహిత బంధువులు
- రెండవభాగం
- మానవరూపానికి మహా ప్రస్థానం
- ఆదిమానవుని అవతరణ ఆఫ్రికాలోనా
- అయిదు లక్షల ఏళ్ళనాడు
- హిమానీ యుగంలో నర పరిమాణం
- ఆదిమ నరుల జీవితం
- ఎట్టకేలకు ఆధునిక నరులు
- క్రోమాన్యాన్ కళా వైదగ్ధ్యం
- కొత్త రాతియుగం
- మూడవభాగం
- మానవులలో జాతి వైవిధ్యం
- మానవ జాతుల సమానత్వం
- మానవ శరీర పరిణామం
- మెదడు పరిణామం
- మానవుని భవిష్యత్తు
- మరికొన్ని ఊహాగానాలు
- అనుబంధం
- సాంకేతిక, శాస్త్రీయ పదవిరమణ
- ఆధార గ్రంథావళి
మూలాలు
మార్చు- ↑ "పాత్రికేయ పితామహుడు నండూరి". www.andhrajyothy.com. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
- ↑ నండూరి, రామమోహనరావు (2012). నరావతారం. విజయవాడ: విక్టరీ పబ్లిషర్స్. p. 4.