నర్సాపూర్ రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

నర్సాపూర్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మెదక్ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నర్సాపూర్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మెదక్ లోక్‌సభ నియోజకవర్గం, నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

నర్సాపూర్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామెదక్

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]

పరిపాలన మార్చు

నర్సాపూర్ డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం నర్సాపూర్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 నర్సాపూర్ మండలం 35 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
2 కౌడిపల్లి మండలం 22 రెవెన్యూ గ్రామాలు
3 కుల్చారం మండలం 21 రెవెన్యూ గ్రామాలు
4 చిలిప్‌చేడ్ మండలం 13 రెవెన్యూ గ్రామాలు
5 శివంపేట మండలం 25 రెవెన్యూ గ్రామాలు
6 మాసాయిపేట మండలం 9 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-07-12.
  3. "Revenue Divisions | District Medak, Government of Telangana | India". www.medak.telangana.gov.in. Archived from the original on 2021-09-04. Retrieved 2022-07-09.
  4. Vemula, Prakash (2022-03-12). "List of Revenue Divisions, Mandals in Medak District". TeachersBadi. Archived from the original on 2021-05-14. Retrieved 2022-07-12.
  5. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-07-12. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)