నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీనృశింహాచార్యులు

నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీనృశింహాచార్యులు (నల్లంతిఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీ నృసింహాచార్యులు) ప్రాధాన్యత కలిగిన కవి. ఈయన అచ్చ తెలుగులో కుబ్జాకృష్ణ విలాసము అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో కుబ్జ(పొట్టి, అందవికారమైన అమ్మాయి)ని మధురలో కృష్ణుడు సుందరిగా మలిచిన గాథను ఇతివృత్తంగా స్వీకరించాడు. ఇటువంటి కావ్యం కవి భాషా సృజనశక్తికి అద్దంగా పాఠకుని భాషాసంపదకు ఆలంబనగా నిలుస్తుందని విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం పేర్కొన్నారు.

అతనికి "ఠంయాల" అనే బిరుదు నామము కలదు. అతను వరంగల్లుకు చెందినవాడు. అతని గోత్రము హతసగోత్రము. అతని తండ్రి రంగాచార్యులు. అతను ఆంధ్రభాషా ప్రవీణులు, చతుర్విధ కవితా ప్రబంధరచనా నిర్మాణధురీణుడు. ఈ విషయం నాశ్వాసాంత గద్యవలన స్పష్టమగుచున్నది. అతను అచ్చమైన తెలుగు ప్రబంధమునే కాక నిరోష్ట్యాద్యేతర గ్రంథములను కూడా కొన్ని రచిందాడు. అతని రచనా శైలి సులభ శైలి. ఇది పండిత పామరులకు ఆనందం కలిగిస్తుంది. అతని గ్రంథములలో పురాతన కవుల పోకడలు కనబడుతున్నవి.

కుబ్జా కృష్ణ విలాసమునందలి ద్వితీయాశ్వాసం నందలి వర్ణనాంశములు, తృతీయాశ్వాసము నందలి కూర్మబంధము, మర్దళబంధము, ఖడ్గ బంధము, మొదలగు బంధ విశేషములును, కల్పితమైన చతుర్విధ కందౌలను, కందగర్భ చంపకమాల వృత్తము మున్నగు వృత్త విశేషములు అతని పాండితీ వైభవమును చాటుచున్నవి. [1]

మూలాలు మార్చు

  1. నల్లాన్ చక్రవర్తుల లక్ష్మీనృశింహాచార్యులు (1932). అచ్చ తెలుగు కుబ్జాకృష్ణవిలాసము.

బయటి లింకులు మార్చు

డి.ఎల్.ఐలో అచ్చ తెలుగు కుబ్జాకృష్ణవిలాసము గ్రంథ ప్రతి