నవగ్రహాలు జ్యోతిషం

భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం

మార్చు

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.

  1. సూర్యుడు
  2. చంద్రుడు
  3. అంగారకుడు (మంగళగ్రహం)
  4. బుధుడు
  5. గురువు
  6. శుక్రుడు
  7. శని
  8. రాహువు
  9. కేతువు

నవ గ్రహాల పూజ

మార్చు

నవ గ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాలలో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో నవగ్రహాల మందిరాలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి గ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి.

నవగ్రహలు : అధి దేవతలు

మార్చు
  1. సూర్యుడు. శివ.
  2. చంద్రుడు. దేవి.
  3. కుజుడు, స్కంధ,
  4. బుధుడు, హరి,.
  5. గురుడు. బ్రహ్మ,
  6. శుక్రుడు. ఇంద్ర,
  7. శని, యముడు.
  8. రాహువు. మృత్యు.
  9. కేతువు. చిత్రగుప్త

నవగ్రహాల విశేషాలు

మార్చు

జ్యోతిష్య సంప్రదాయంలో నవ గ్రహాల గుణాలనూ, సంకేతాలనూ తెలిపే ఒక పట్టిక క్రింద ఇవ్వబడింది.

పేరు ఆంగ్లంలో గుణము సూచిక
సూర్యుడు (सूर्य) Sun సత్వము ఆత్మ, రాజయోగం, పదోన్నతి, పితృయోగం.
చంద్రుడు (चंद्र) Moon సత్వము మనసు, రాణి యోగం, మాతృత్వం.
కుజుడు (मंगल) Mars తామసము శక్తి, విశ్వాసం, అహంకారం
బుధుడు (बुध) Mercury రజస్సు వ్యవహార నైపుణ్యం
బృహస్పతి,గురువు (बृहस्पति) Jupiter సత్వము విద్యా బోధన
శుక్రుడు (शुक्र) Venus రజస్సు ధనలాభం, సౌఖ్యం, సంతానం
శని (शनि) Saturn తామసము పరీక్షా సమయం. ఉద్యోగోన్నతి, చిరాయువు
రాహువు (राहु) Head of Demon Snake
Ascending/North Lunar Node
తామసము తన అధీనంలో ఉన్నవారి జీవితాన్ని కలచివేసే గుణం
కేతువు (केतु) Tail of Demon Snake
Descending/South Lunar Node
తామసము విపరీత ప్రభావాలు

నవగ్రహ శిల్పాలు

మార్చు
 
బ్రిటిష్ మ్యూజియమ్లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి
 
బ్రిటిష్ మ్యూజియమ్లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) శుక్రుడు, శని, రాహువు, కేతువు

నవగ్రహాల ఆలయాలు

మార్చు

నవగ్రహ అలయలు మొత్తముగా తమిళనాడులో ఉన్నాయి. అవి 1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొవెల

2. బుధ గ్రహానికి గాను తిరువెన్కాదు

3. శుక్ర గ్రహానికి గాను కన్ఛనూరు

4. కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ్

5. గురు గ్రహానికి గాను ఆలంగుడి

6. శని గ్రహానికి గాను తిరునల్లారు

7. రాహువు గ్రహానికి గాను తిరునాగేశ్వరమ్

8. చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు

9. సూర్య గ్రహానికి గాను సూరియానారు

నవగ్రహాలు మరికొన్ని విశేషాలు

మార్చు
  • ఒక్కో గ్రహానికి ఒక్కో వర్ణం ఉంటుంది. అవి వరసగా
  • తెలుపు వర్ణం :- శుక్రుడు, చంద్రుడు .
  • పసుపు వర్ణం :- గురువు.
  • ఎరుపు వర్ణం :- అంగారకుడు, సూర్యుడు.
  • ఆకుపచ్చ వర్ణము :- బుధుడు.
  • నలుపు వర్ణము :- శని.
  • పొగరంగు (దూమ్ర వర్ణం ):- రాహువు, కేతువు.
  • రాశులకు జాతులు ఉంటాయి. అవి వరుసగా
  • బ్రాహ్మణ జాతి :- గురువు, శుక్రుడు.
  • క్షత్రియులు :- సూర్యుడు, కుజుడు.
  • వైశ్యులు :- బుధుడు, చంద్రుడు.
  • శూద్రుడు :- శని.
  • చంఢాలుడు :- రాహువు.
  • సంకరుడు :- కేతువు.
  • శుభగ్రహాలు :- గురువు, శుక్రుడు, బుధుడు, చర ఋశిలో ఉన్న కేతువు.
  • పాపగ్రహాలు :- సూర్యుడు, కుజుడు, శని, పాపులతో చేరిన బుధుడు, స్థిర, ద్వస్వభావయుతుడైన కేతువు.
  • గ్రహములు ద్రవ్యములు:- సూర్యుడికి తామ్రము, చంద్రుడికి మణులు, కుజుడికి పగడము, బుధుడికి ఇత్తడి,కంచు.గురువుకు బంగారము, శుక్రుడికి వెండి, శనికి ఇనుము, సీసము.
  • శరీరభాగాలు గ్రహములు :- సూర్యుడు ఎముకలకు, చంద్రుడు నెత్తురుకు, బుధుడు చర్మము, శుక్రుడు రేతస్సు, గురువు మెదడు, శని నరములకు, కుజుడు మజ్జ.
  • పంచ భూతములు గ్రహములు :- అగ్నికి సూర్యుడు, కుజుడు. భూమికి బుధుడు.
  • సూర్యుడు తూర్పు దిక్కు, చంద్రుడు వాయవ్య దిక్కు, కుజుడు దక్షిణము, బుధుడు ఉత్తరము, గురువు ఈశాన్యము, శుక్రుడు ఆగ్నేయము, శని పశ్చిమము.

నవగ్రహ ధ్యాన శ్లోకములు

మార్చు

నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి

జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం

చంద్ర

దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

కుజ

ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ

ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం

గురు

దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం

శుక్ర

హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం

శని

నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం

రాహు

అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్

కేతు

ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్