నాన్న (ధారావాహిక)

నాన్న, 2003-2004 మధ్యకాలంలో జెమినీ టీవీలో ప్రసారం చేయబడిన ధారావాహిక. 2004లో ఉత్తమ టీవీ సీరియల్, ఉత్తమ మాటల రచయిత, ఉత్తమ బాలనటుడు, ఉత్తమ సహాయనటి విభాగాల్లో నంది పురస్కారాలు గెలుచుకుంది.[1]

నిర్మాణంసవరించు

జస్ట్ ఎల్లో మీడియా సంస్థ బ్యానరులో వెంకట్ డేగ, గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ ను నిర్మించగా, మురళీకృష్ణ ముడిధాని దర్శకత్వం వహించాడు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఆసం శ్రీనివాస్ ఈ సీరియల్ స్క్రిప్ట్ రాశాడు. కల్యాణి మాలిక్ సంగీతాన్ని సమకూర్చాడు. మళ్ళీ మా టీవీలో ఉదయం 11:30 గంటలకు రీప్లే అయింది.[2]

నటవర్గంసవరించు

  • నూతన్ ప్రసాద్ (కాకర్ల దశరత రామయ్య)
  • మాస్టర్ వంశీ మోహన్ (సిధార్ట్ “సిద్దూ”)
  • నవీన్ (కాకర్ల సాంబశివరావు “సంబుడు”)
  • అనితా చౌదరి (జూలీ/శారద)
  • ప్రీతి అమీన్ (కవిత, సాంబశివ భార్య)
  • రఘునాథారెడ్డి (కాకర్ల దశరథరామయ్య బెస్ట్ ఫ్రెండ్)
  • శివన్నారాయణ (పంచాక్షరం, సాంబశివరావు బెస్ట్ ఫ్రెండ్)
  • రాగిణి (సుగుణ)
  • చిత్రలేఖ (నందిని)
  • భరణి శంకర్ (భరణి)
  • వాసు ఇంటూరి (ఎస్ఐ అంకిరెడ్డి)

అవార్డులుసవరించు

అవార్డులు విభాగం గ్రహీత ఫలితం
నంది టీవీ అవార్డులు 2004 మొదటి ఉత్తమ టీవీ సీరియల్ నాన్న (గంగరాజు గుణ్ణం) గెలిచింది
నంది టీవీ అవార్డులు 2004 ఉత్తమ సంభాషణల రచయిత ఆసం శ్రీనివాస్ గెలిచింది
నంది టీవీ అవార్డులు 2004 ఉత్తమ బాల నటుడు మాస్టర్ వంశీ మోహన్ గెలిచింది
నంది టీవీ అవార్డులు 2004 ఉత్తమ సహాయ నటి రాగిణి గెలిచింది

మూలాలుసవరించు

  1. nettv4u, serial. "Telugu Tv Serial Nanna". Archived from the original on 6 December 2018. Retrieved 28 May 2021.
  2. "NANA". Just Yellow Media. Archived from the original on 23 జూన్ 2016. Retrieved 28 May 2021.