నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం

(నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గం నుండి దారిమార్పు చెందింది)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. మక్తల్ నియోజకవర్గం నుంచి నారాయణపేట మండలం, కొడంగల్ నియోజకవర్గం నుంచి దామరగిద్ద మండలం, రద్దయిన అమరచింత నియోజకవర్గం నుంచి ధన్వాడ మండలం, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి కోయిలకొండ మండలాలు కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటుచేశారు. దీనితో డివిజన్ కేంద్రమైననూ ఈ పేరుతో నియోజకవర్గం లేని లోటు తీరింది.

నారాయణపేట
—  శాసనసభ నియోజకవర్గం  —
Narayanapeta assembly constituency.svg
నారాయణపేట is located in Telangana
నారాయణపేట
నారాయణపేట
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

  • 2001 లెక్కల ప్రకారము నియోజకవర్గపు జనాభా: 2,44,367.
  • ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి): 1,97,375.[1]
  • ఎస్సీ, ఎస్టీల శాతం:14.32%, 7.26%.

నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులుసవరించు

మహబూబ్ నగర్ జిల్లా వాయువ్యాన ఉన్న ఈ నియోజకవర్గానికి ఉత్తరాన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఈశాన్య వైపున మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆగ్నేయాన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. దక్షిణమున మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం ఉంది.

రాజకీయపార్టీల బలాబలాలుసవరించు

నారాయణపేట మండలంలో భారతీయ జనతా పార్టీకి మంచి పట్టుంది. ఇక మిగిలిన మండలాలలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన బాలాలున్నాయి.[2]

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శ్రీ రాజేందర్ రెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఎల్కోటి ఎల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ సూగప్ప కాంగ్రెస్ పార్టీ
2014 ఎస్‌. రాజేందర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ కె.శివకుమార్ రెడ్డి తె.రా.స

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో అన్ని పార్టీల కంటే ముందుగా భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికలలో మక్తల్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయిన నారాయణపేట పట్టణ నివాసి అయిన నాగూరావు నామాజీని తన అభ్యర్థిగా ప్రకటించింది.[3] కాంగ్రెస్ పార్టీ తరఫున సుగూరప్ప పోటీలో చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి ఎల్లారెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున సాయిబాబా పోటీ చేశారు. ప్రధాన పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూగప్పపై 12126 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.[4]

2009 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు సాధించిన ఓట్లు
క్రమసంఖ్య పార్టీ సాధించిన ఓట్లు
1 తెలుగుదేశం పార్టీ 45898
2 కాంగ్రెస్ పార్టీ 33772
3 భారతీయ జనతా పార్టీ 26807
4 ప్రజారాజ్యం పార్టీ 4707
5 ఇతరులు 10514

నియోజకవర్గపు ప్రముఖులుసవరించు

నాగూరావు నామాజీ
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడైన నాగూరావు నామాజీ నారాయణపేట పట్టణానికి చెందినవాడు. పార్టీపరంగా గతంలో రాష్ట్ర స్థాయి పదవులు కూడా నిర్వహించాడు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలంగాణా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. నామాజీ 2004లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం నర్సిరెడ్డి చేతిలో కేవలం 2356 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పొందినాడు.[5] నామాజీ భార్య గతంలో నారాయణపేట పురపాలకసంఘం చైర్మెన్‌గా పనిచేసింది. 2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి[6] మూడవస్థానం పొందినాడు[7]
రెడ్డిగారి రవీంద్రరెడ్డి
ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా ఉన్న రెడ్డిగారి రవీంద్రరెడ్డి కోయిలకొండ మండలానికి చెందినవాడు. గతంలో సర్పంచు పదవిని నిర్వహించాడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  2. సాక్షి దినపత్రిక, మహబూబ్‌నగర్ ఎడిషన్, పేజీ 12, తేది 11.09.2008
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 14.03.2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  5. http://archive.eci.gov.in/March2004/pollupd/ac/states/s01/aconst199.htm[permanent dead link]
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 20-03-2009
  7. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009