నారాయణరావు (నవల)

తెలుగు నవల

నారాయణరావు తెలుగు నవలను ప్రముఖ సంగీతవేత్త, సాహిత్యకారుడు, చిత్రకారుడు అడవి బాపిరాజు రచించారు. 1934 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించిన తెలుగు నవలల పోటీల్లో ఈ నవల విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలతో సమంగా ఉత్తమ నవలగా ఎంపికైంది.

నారాయణరావు (నవల)
కృతికర్త: అడవి బాపిరాజు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నవల
ప్రచురణ:
విడుదల: 1934

రచన నేపథ్యం

మార్చు

1934లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు తెలుగులో నవలల పోటీ నిర్వహించింది. పోటీ కోసం అడవి బాపిరాజు నారాయణరావు నవల రచించారు. ఆ పోటీలో ప్రథమస్థానాన్ని విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలుతో పాటు బాపిరాజు రాసిన నారాయణరావు నవలలకు పంచారు న్యాయనిర్ణేతలు. స్వాతంత్ర్య సమరయోధుడు ముష్టి లక్ష్మీ నారాయణ రావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాపిరాజు ఈ నవల రచించారన్నది ఆనాటి సాహిత్యవేత్తల అంచనా.[1] కానీ బాపిరాజు మాత్రం నవల ముందు ఈ కథా, కథలోని పాత్రలూ కేవలం కల్పితములు. అనే వాక్యం ఉంచారు. ఈ నవలను మొదట ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు.[2]

ఇతివృత్తం

మార్చు

ఉన్నత తరగతికి చెందిన బ్రాహ్మణ రైతు కుటుంబం యువకుడు నారాయణరావు కథ ఇది. మద్రాసులో న్యాయవిద్యార్థిగా ఉన్న నారాయణరావు స్నేహితులతో కలిసి తన స్వగ్రామం కొత్తపేటకు రైల్లో వెళ్తుండగా నవల ప్రారంభమవుతుంది. విశ్వలాపురం జమీందారు, జస్టిస్ పార్టీ సభ్యుడు లక్ష్మీ సుందర ప్రసాదరావు తన మొదటి కుమార్తెకు జమీందారీ వివాహం చేసి దెబ్బతిని ఉండడంతో సామాన్యుడైన, యోగ్యుడైన వరుణ్ణి అన్వేషణ చేస్తూండగా నారాయణరావు కనిపిస్తాడు. నారాయణరావు, ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయనకు తన చిన్న కూతురు శారదను ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటాడు. శారదకు ఇంట్లోనే సంగీతంతోపాటుగా చదువు కూడా చెప్పిస్తూంటారు. ఆమెను జమీందారీ కుటుంబం నుంచి అందునా తన మేనల్లుడు జగన్మోహనరావు ఇచ్చి పెళ్ళి చేయాలని తల్లి కామేశ్వరీ దేవి భావించడంతో ఈ సంబంధం ఆమెకు నచ్చదు. తండ్రికి మాత్రం జగన్మోహనుని ప్రవర్తన నచ్చక అతనికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయడం ఇష్టం ఉండదు. ఐనా తల్లి చెప్పినదే సరైనదని అనిపించినా శారద తండ్రి మాట ఎదురాడలేక ఈ పెళ్ళికి అంగీకరిస్తుంది. నారాయణరావు తండ్రి సుబ్బారాయుడిని ఒప్పించి జమీందారు పెళ్ళి చేస్తారు. ఐనా తల్లి వల్ల ముందుగా తనలో ఏర్పడ్డ వ్యతిరేకత వల్ల నారాయణరావుతో సంసారం సజావుగా సాగించలేక పోతుంది శారద. ఆత్మగౌరవంతో ఈ విషయాన్ని ఎక్కడా పొక్కనివ్వడు నారాయణరావు. చివరకు ఆ సంసారం ఏమైందన్నది కథలో మిగిలిన భాగం.

పాత్రలు

మార్చు
  1. నారాయణరావు, కథానాయకుడు
  2. పరమేశ్వరమూర్తి, నారాయణ రావు ప్రాణమిత్రుడు, కవి, చిత్రకారుడు
  3. రాజారావు, నారాయణ రావు మిత్రుడు, వైద్యుడు
  4. రాజేశ్వరరావు, నారాయణరావు మిత్రుడు, ఇంజనీరు, స్వతంత్ర ప్రేమ సంఘంలో సభ్యుడు
  5. లక్ష్మీపతి, నారాయణరావు బావ, నారాయణరావు మేనత్త కొడుకు
  6. ఆలం సుల్తాన్, నారాయణ రావు మిత్రుడు, లా విద్యార్థి
  7. తల్లప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు, విశ్వలాపురం జమీందారు, శారద తండ్రి
  8. శారద, కథానాయిక, జమీందారు చిన్న కుమార్తె
  9. వరదకామేశ్వరి, శారద తల్లి
  10. శకుంతలా దేవి, జమీందారు పెద్ద కుమార్తె
  11. కొవ్విడి బసవరాజేశ్వర జగన్మోహనరావు, వరదకామేశ్వరి దేవి మేనల్లుడు
  12. సుబ్బారాయుడు, నారాయణరావు తండ్రి
  13. జానకమ్మ, నారాయణరావు తల్లి
  14. వేపా శ్రీనివాసరావు, జమీందారు స్నేహితుడు, వకీలు
  15. సుందర వర్దనమ్మ, జమీందారు అక్క, భర్త మరణంతో తమ్ముడి ఇంటనే నివాసం ఉంటుంది
  16. సూర్యకాంతం, నారాయణరావు చిన్న చెల్లెలు
  17. శ్రీరామమూర్తి, నారాయణరావు అన్న
  18. లక్ష్మీనరసమ్మ, జానకమ్మ అక్క
  19. వరలక్ష్మమ్మ
  20. వెంకాయమ్మ, నారాయణరావు అక్క
  21. విశ్వేశ్వరరావు, శకుంతల భర్త, కలెక్టరు
  22. శ్యామ సుందరీ దేవి, నారాయణరావు స్నేహితురాలు
  23. రోహిణీ దేవి, శ్యామ సుందరీ దేవి చెల్లెలు
  24. నళినీ దేవి, శ్యామ సుందరీ దేవి చెల్లెలు
  25. సరళా దేవి, శ్యామ సుందరీ దేవి చెల్లెలు
  26. రుక్మిణి, పరమేశ్వరమూర్తి భార్య
  27. రమణమ్మ, లక్ష్మీపతి భార్య, నారాయణరావు చెల్లెలు
  28. వెంకట్రాయుడు, నారాయణరావు మామయ్య
  29. బాచిగాడు, లక్ష్మీపతి కొడుకు, నారాయణరావు మేనల్లుడు
  30. ఆనందరావు
  31. డిప్యూటీ కలెక్టర్
  32. తహసీల్దారు
  33. డిప్యూటీ తహశీల్దార్
  34. కరణము వెంకటరాజు
  35. సిద్ధాంతి
  36. మృత్యుంజయరావు
  37. రామచంద్రరావు, నారాయణరావు బావ, సూర్యకాంతం భర్త, చదువు కోసం విదేశాలకు వెళతాడు.
  38. బుద్దవరపు భీమరాజు
  39. నటరాజన్, నారాయణరావు మిత్రుడు, తమిళుడు
  40. శ్రీరామయ్య, శారదకు సంగీత గురువు

శైలి-శిల్పం

మార్చు

ప్రాచుర్యం

మార్చు

ప్రచురణలు

మార్చు

మూలాలు

మార్చు
  1. విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన నారాయణరావు నవలకు కలం కుంచె అయినవేళ శీర్షికన సంపాదకుడు ఏటుకూరి ప్రసాద్ ముందుమాట
  2. నారాయణరావు నవలలో అంజలి శీర్షికన అడవి బాపిరాజు రాసిన తొలిపలుకులు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: