నారి
నారి 2025లో విడుదలైన తెలుగు సినిమా. షి ఫిలిమ్స్ & హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్‌పై శశి వంటిపల్లి నిర్మించిన ఈ సినిమాకు సూర్య వంటిపల్లి దర్శకత్వం వహించాడు.[1] ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా,[2] సినిమాను మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న విడుదల చేశారు.[3]
నారి | |
---|---|
![]() | |
దర్శకత్వం | సూర్య వంటిపల్లి |
స్క్రీన్ ప్లే | సూర్య వంటిపల్లి |
కథ | సూర్య వంటిపల్లి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వి. రవి కుమార్ & భీం సాంబ |
కూర్పు | మాధవ్ కుమార్ గుళ్ళపల్లి |
సంగీతం | వినోద్ కుమార్ విన్ను |
మాటలు | సూర్య వంటిపల్లి & భార్గవాచారి |
ఆర్ట్ డైరెక్టర్ | పవన్ కుమార్ |
విడుదల తేదీ | 7 మార్చి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మహిళా దినోత్సవం సందర్బంగా విడుదలైన ఈ సినిమా సినిమా చూసే కపుల్స్ కోసం 7వ తేదీన , 8వ తేదీన అన్ని షోస్ కు టికెట్స్ పై వన్ ఫ్లస్ వన్ ఆఫర్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.[4]
కథ
మార్చుఓ అమ్మాయిపై జరిగిన హత్యాచార కేసులో నిందితుల్లో మంత్రి భూపతి (నాగమహేశ్) కొడుకు ఉంటాడు, ఈ కేసును న్యాయవాది శారద (ప్రగతి) వాదిస్తూ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె భారతి (ఆమని, మౌనిక రెడ్డి) జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటుంది. అసలు భారతి ఎవరు? చిన్నప్పటి నుంచి కష్టాల మధ్య పెరిగిన భారతి ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను ఆమె ఎలా అడ్డుకుంది? భారతి చూపించిన పరిష్కారం ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[5]
నటీనటులు
మార్చు- ఆమని
- వికాస్ వశిష్ఠ
- మౌనిక రెడ్డి
- ప్రగతి
- ఛత్రపతి శేఖర్
- సునయన
- కేదార్ శంకర్
- ప్రమోదినీ
- నాగ మహేష్
- నిత్యశ్రీ
- రామచంద్ర
- కార్తికేయ దేవ్
- వినోద్ కుమార్ విన్ను
- శశి వంటిపల్లి
- సూర్య వంటిపల్లి
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "గుండెలోన ఏదో[6]" | ప్రసాద్ సాన | రమణ గోగుల | 2:57 |
2. | "హవాయి హవాయి హవా" | భాస్కరభట్ల రవికుమార్ | సునీత | 4:37 |
3. | "నిశి లో శశి లా[7]" | చిన్మయి శ్రీపాద | ||
4. | "ఈడు మగాడేంట్రా బుజ్జి" | సీషోర్ | సీషోర్ | 3:56 |
మూలాలు
మార్చు- ↑ "మహిళ సాధికారత, స్త్రీ శక్తిని చాటే 'నారి'". Chitrajyothy. 16 February 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "ప్రతి మహిళ చూడాల్సిన చిత్రం నారి". Mana Telangana. 23 February 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ". Sakshi. 5 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "'నారి - ది వుమెన్' రివ్యూ.. మహిళల కష్టాలు చూపిస్తూ మెసేజ్ తో." 10TV Telugu. 7 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "రమణ గోగుల కంబ్యాక్ అదిరింది.. వెంటనే మరో పాట". Chitrajyothy. 26 February 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "Song from Amani's Naari Out" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 16 February 2025. Retrieved 10 March 2025.