నార్మన్ ప్రిచార్డ్

నార్మన్ గిల్బర్ట్ ప్రిచార్డ్ (23 జూన్ 1875-30 అక్టోబర్ 1929), అతని రంగస్థల పేరు నార్మన్ ట్రెవర్ అని కూడా పిలుస్తారు, అతను 1900 పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు గెలుచుకున్నప్పుడు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ, మొదటి ఏషియన్ అథ్లెట్ అయ్యాడు. అతను ఒలింపిక్స్‌లో 200 మీటర్లు పరుగు పందెంలోనూ, 200 మీటర్ల హర్డిల్స్ పోటీలోనూ భారతదేశానికి తొలి పతకాలను అందించాడు.[1][2][3]

నార్మన్ గిల్బర్ట్ ప్రిచార్డ్
Portrait of Pritchard, The Sketch
(28 February 1900)
వ్యక్తిగత సమాచారము
పూర్తిపేరునార్మన్ గిల్బర్ట్ ప్రిచార్డ్
జాతీయతబ్రిటిష్ - ఇండియన్
జననం(1875-06-23)1875 జూన్ 23
కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1929 అక్టోబరు 30(1929-10-30) (వయసు 54)
లాస్ ఏంజలెస్, అమెరికా
విద్యసెయింట్ జేవియర్స్ కళాశాల, కలకత్తా
క్రీడ
క్రీడఅథ్లెటిక్స్
సంఘటన(లు)200 మీటర్ల హర్డిల్స్
200 మీటర్ల పరుగు

జీవితచరిత్ర

మార్చు
 
ది బ్లాక్ పాంథర్స్ కబ్ (1921) లో ఎర్లే ఫాక్స్, ఫ్లోరెన్స్ రీడ్ ప్రిచార్డ్ (కుడివైపు).

నార్మన్ ప్రిచార్డ్ కలకత్తా జార్జ్ పీటర్సన్ ప్రిచార్డ్, హెలెన్ మేనార్డ్ ప్రిచార్డ్ దంపతులకు జన్మించాడు.[1] ఇతడు కలకత్తాలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదువుకున్నాడు. జూలై 1897లో తో జరిగిన ఓపెన్ ఫుట్బాల్ టోర్నమెంట్లో సెయింట్ జేవియర్స్ జట్టు తర్రఫున ఆడి సోవబజార్ జట్టుపై భారతదేశంలో మొదటి హ్యాట్రిక్ సాధించిన ఘనతను పొందాడు.

ప్రిచార్డ్ 1894 నుండి 1900 వరకు వరుసగా ఏడు సంవత్సరాలు బెంగాల్ ప్రావిన్స్ 100 గజాల స్ప్రింట్ టైటిల్ గెలుచుకున్నాడు. 1898-99 లో మీట్ రికార్డును నెలకొల్పాడు. ఇతడు 440 గజాల (1/4 మైళ్ళు) పరుగు పందెంలో గెలిచాడు.[4] 1900 AAA ఛాంపియన్‌షిప్‌ 120 గజాల హర్డిల్స్ ఈవెంట్లో ప్రిచార్డ్ రెండవ స్థానంలో నిలిచాడు.[5][6]

ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ అథ్లెట్ ప్రిచార్డ్. అలాగే ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి వ్యక్తి కూడా. అలాగే ఆసియా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి వ్యక్తి కూడా.[7] ఇతడు పారిస్‌లో జరిగిన 1900 వేసవి ఒలింపిక్స్ లో రెండు రజత పతకాలను గెలుచుకున్నాడు. 200 మీటర్ల పరుగుపందెంలో రెండవ స్థానంలో, 200 మీటర్ల హర్డిల్స్ పోటీలో రెండవ స్థానంలో నిలిచాడు. ఇతడు 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌కు చేరుకున్నాడు, కానీ విజయుడు కాలేక పోయాడు. 60 మీటర్లు , 100 మీటర్ల పరుగుపందేలలో కూడా పాల్గొన్నాడు. వీటిలో ఇతడు చివరి దశకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు.[8]

1900 నుండి 1902 వరకు భారత ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. 1905లో ఇతడు శాశ్వతంగా బ్రిటన్‌కు వలస వెళ్ళాడు.[4]

ఆ తరువాత ఇతడు నటనలో వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లి, నార్మన్ ట్రెవర్ అనే పేరుతో హాలీవుడ్ మూకీ చిత్రాలలో నటించిన మొదటి ఒలింపియన్ అయ్యాడు.

జాతీయత దావా

మార్చు

2005లో IAAF 2004 సమ్మర్ ఒలింపిక్స్ కోసం అధికారిక ట్రాక్ అండ్ ఫీల్డ్ గణాంకాలను ప్రచురించింది. హిస్టారికల్ రికార్డ్స్ విభాగంలో ప్రిట్‌చర్డ్ 1900లో గ్రేట్ బ్రిటన్ తరపున పోటీ పడినట్లుగా జాబితా చేయబడింది. జూలై 1900లో బ్రిటీష్ AAA ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తర్వాత ప్రిచర్డ్ గ్రేట్ బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడని ఒలింపిక్ చరిత్రకారులు చేసిన కొన్ని పరిశోధనలో తేలింది. ఏది ఏమైనప్పటికీ, 1900లో బ్రిటీష్ ప్రెస్‌లో ఎక్కువ భాగం అతని దేశాన్ని భారతదేశంగా నమోదు చేసింది. IOC ప్రిచార్డ్‌ను భారతదేశం కోసం పోటీ పడినట్లుగా పరిగణించింది, అతని రెండు పతకాలు భారతదేశానికి జమ చేయబడ్డాయి.

అతను 1929 అక్టోబరు 30న లాస్ ఏంజిల్స్ మెదడు వ్యాధితో మరణించాడు.[1]

ఎంపిక చేసిన ఫిల్మోగ్రఫీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "The story of a champion from the East". The Telegraph – Calcutta (Kolkata). Archived from the original on 17 September 2008. Retrieved 26 March 2018.
  2. "Norman Pritchard". Olympedia. Archived from the original on 12 November 2020. Retrieved 22 December 2020.
  3. "Chronology of Important Sports Events — West Bengal". wbsportsandyouth.gov.in. Kolkata: Government of West Bengal – Department of youth services and sports. 2017. Archived from the original on 13 October 2022. Retrieved 25 January 2023.
  4. 4.0 4.1 "Norman Pritchard – India's first Olympic medalist". sportskeeda.com. Archived from the original on 17 May 2017. Retrieved 26 March 2017.
  5. "AAA, WAAA and National Championships Medallists". National Union of Track Statisticians. Retrieved 30 July 2024.
  6. "The Amateur Athletic Association Championships". Sporting Life. 9 July 1900. Retrieved 30 July 2024 – via British Newspaper Archive.
  7. "Norman Pritchard". Olympic.org. Archived from the original on 27 March 2017. Retrieved 18 September 2017.
  8. "Norman Pritchard". Olympedia.

బాహ్య లింకులు

మార్చు