నిప్పట్లపాడు

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లోని గ్రామం


నిప్పట్లపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 253. ఎస్.టి.డి కోడ్:08592.

నిప్పట్లపాడు
రెవిన్యూ గ్రామం
నిప్పట్లపాడు is located in Andhra Pradesh
నిప్పట్లపాడు
నిప్పట్లపాడు
నిర్దేశాంకాలు: 15°36′07″N 79°45′47″E / 15.602°N 79.763°E / 15.602; 79.763Coordinates: 15°36′07″N 79°45′47″E / 15.602°N 79.763°E / 15.602; 79.763 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంచీమకుర్తి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,335 హె. (3,299 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,798
 • సాంద్రత210/కి.మీ2 (540/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523253 Edit this at Wikidata

సమీప గ్రామాలుసవరించు

బొద్దికూరపాడు 5 కి.మీ, యెలూరు 6 కి.మీ, మంచికలపాడు 6 కి.మీ, వెలుగువారిపాలెం 7 కి.మీ, తలమళ్ళ 7 కి.మీ.

సమీప మండలాలుసవరించు

పశ్చిమాన మర్రిపూడి మండలం, పశ్చిమాన పొదిలి మండలం, ఉత్తరాన దర్శి మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

ప్రభుత్వ పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

పశువైద్యశాలసవరించు

విద్యుత్తుసవరించు

ఈ గ్రామంలో నూతనంగా ఒక విద్యుత్తు ఉపకేంద్రాన్ని నిర్మించారు. [5]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

మైనర్ ఇరిగేషన్ చెరువు:- ఈ చెరువులో చేపపిల్లలను వేసి, పెంచి, పట్టుకొను హక్కు కొరకు, 2 సంవత్సరాలకొకసారి, బహిరంగ వేలం ద్వారా నిర్ణయించి, ఆ వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమచేయుదురు. [3]

ఓటికట్లవాగు:- ఈ వాగుపై ఒక చెక్ డ్యా నిర్మించి ఆ నీటితో గ్రామంలోని 600 ఎకరాలకు సాగునీరందించుటకై ప్రయత్నించుచున్నారు. [4]

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలై జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీమతి ఎద్దు పేరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ మువ్వా మాలకొండయ్య విశ్రాంత ఉపాధ్యాయులు. వీరి కుమారుడు శ్రీ రవికిరణ్, అమెరికా దేశంలోని అట్లాంటాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. అయినాగానీ వీరు తన స్వంత గ్రామాన్ని మర్చిపోకుండా, గ్రామాన్ని అనేక విధాల అభివృద్ధి చేయాలనే తలంపుతో, రెండున్నర సంవత్సరాల క్రితం గ్రామాన్ని దత్తత తీసికొని, లక్షల రూపాయలు వెచ్చించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. శ్రీ మాలకొండయ్య గ్రామంలోనే నివసించుచూ, ఈ కార్యక్రమాల్ను స్వయంగా పర్యవేక్షించుచుండటం, ఈ తండ్రీ కొడుకుల పట్టుదలనూ, గ్రామంపై వీరికి ఉన్న మమకారాన్నీ తెలియజేయుచున్నది. [4]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,798 - పురుషుల సంఖ్య 1,440 - స్త్రీల సంఖ్య 1,358 - గృహాల సంఖ్య 645

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,216.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,130, స్త్రీల సంఖ్య 1,086, గ్రామంలో నివాస గృహాలు 492 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,335 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, సెప్టెంబరు-13; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, డిసెంబరు-6; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, జనవరి-14; 1వపేజీ & ఈనాడు ప్రకాశం; 2017, మే-20; 9వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-21; 2వపేజీ.