నిర్ణయ నిరోధ హక్కు(వీటో)

నిర్ణయ నిరోధ హక్కు (వీటో) ..అంటే ఒక సమితి లేదా సదస్సులో నిర్ణయాలు లేదా శాసనాలను ఆపడానికి ప్రత్యేక అధికారాలు కలిగియుండుట. మామూలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకున్న నిర్ణయాలను కూడ కొందరు సభ్యులు ఈ ప్రత్యేక హక్కులతో నిరాకరించ గలుగుతారు. ఇది , పాత రోమన్ సామ్రాజ్యం వాడుక నుంచి తీసుకున్న పదం.

ఉదాహరణకి అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి ఆ దేశ శాసన సభలు తీసుకున్న నిర్ణయాలను అమలుచేయకుండా నిరోధించే అర్హత (వీటో) ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యులైన ఐదు దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లకు ఆ సమితి నిర్ణయాలను వీటో" చేసి, తీర్మానాలుగా మారకుండా ఆపగలిగే అధికారం ఉంది.