ప్రధాన మెనూను తెరువు

నిషియమా ఆన్‌సెన్‌ కియున్‌కన్‌ ' ప్రపంచంలోనే అత్యంత పురతనమైన హోటల్ గా ప్రసిద్ధి చెందింది.

నేపధ్యముసవరించు

జపాన్‌లో ఉన్న నిషియమా ఆన్‌సెన్‌ కియున్‌కున్‌ హోటల్‌ను అప్పటి జపాన్‌ రాజ కుమారుడు ఫుజివరా మహితొ క్రీ.శ. 705 సంవత్సరంలో ప్రారంభించారు. ఫుజివరా కుటుంబీకులు 52 తరాల నుంచి ఈ హోటల్‌ను కొనసాగిస్తున్నారంటే..అతిశయం అనిపించక మానదు. ఇన్ని తరాలు మారినా ఇప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తూ పేరు నిలుపుకుంటుంది. ప్రపంచంలోనే అతి పురాతమైన హోటల్‌గా నిలిచి గిన్నీ్‌సబుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం పొందింది. చక్రవర్తులు, రాజులు, సైన్యాధిపతులు, దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, సినిమా స్టార్లు, క్రీడాకారులు ఎందరో ఇందులో బస చేశారు. తరాలు మారుతున్న ఈ హోటల్‌కు వచ్చే సందర్శకులు సంఖ్య మాత్రం తగ్గట్లేదు. 20 సంవత్సరాల క్రితం ఈ హోటల్‌ను మరింత ఆధునీకరించి విలాసవంతంగా తీర్చిదిద్దారు.

హోటల్‌ చుట్టూ ఉండే పచ్చని ప్రకృతి శోభ మనసును దోచుకుంటుంది. పలకరించే పిల్లగాలులు, పక్షుల కిలకిలరావాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇంత చక్కని వాతావరణంతో పాటు ఫుజి పర్వతం, మంకీ పార్కులకు దగ్గరలో ఉండటంతో పర్యాటకులకు ఇదో ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. ఈ పురాతన హోటల్‌లో 35 గదులున్నాయి. ఇందులోని ప్రకృతిసిద్ధ కొలనులు అందరినీ ఆకట్టుకుంటాయు. హాట్‌స్ర్పింగ్‌ బాత్స ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హోటల్‌ సిబ్బంది, ఇంటరీయర్‌ డిజైన్స్‌, అలంకరణ సామగ్రి, ఆహార పదార్థాలు ఇలా అన్నింటిలోనూ నిషియమా హోటల్‌ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎంత వారైనా చెప్పులను విడిచే లోపలికి రావాలనే నిబంధన అమలు చేయడంతో పాటు, ప్రతి పనిలోనూ సమయపాలన పాటిస్తుంది. ఒక్కరోజు ఇందులో బస చేయడానికి దాదాపు 31 వేల రూపాయలు ఖర్చవుతుంది. తరతరాలుగా తమ వ్యాపారాన్ని కాపాడుకుంటూ వస్తున్నవాళ్లు చాలామంది ఉంటారు. కానీ 13 వందల ఏళ్ల నుంచి ఒకే కుటుంబీకులు ఒకే హోటల్‌ను నిర్వహిస్తుండటం మాత్రం ఆశ్చర్యమే.[1]

మూలాలుసవరించు

  1. ""52 తరాలు.. 1311 ఏళ్లు.. ఇదీ ఓ హోటల్ చరిత్ర"". www.andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. 8 జూన్ 2016. Retrieved 8 జూన్ 2016.

బయటి లంకెలుసవరించు