నీజతగా నేనుండాలి
నీజతగా నేనుండాలి 2014 ఆగస్టు 22న విడుదలైన తెలుగు చిత్రం. విజయవంతమైన హిందీ చిత్రం ఆషికి 2కి ఇది తెలుగు రూపకము.
నీజతగా నేనుండాలి [1] | |
---|---|
దర్శకత్వం | జయ రవీంద్ర |
స్క్రీన్ ప్లే | షగుఫ్తా రఫీక్ |
కథ | షగుఫ్తా రఫీక్ |
నిర్మాత | బండ్ల గణేశ్ |
తారాగణం | సచిన్ నజియా హుస్సేన్ |
సంగీతం | మిథూన్ జీత్ గంగూలీ అంకిత్ తివారీ |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
కథ
మార్చుబాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై..భారీ ఘన విజయాన్ని ఆషికి 2 సొంతం చేసుకుంది. డ్రగ్స్, మద్యానికి బానిసై.. విఫలమైన ఓ గాయకుడి కథను నేపథ్యంగా తీసుకుని మ్యూజికల్, లవ్‌స్టోరిగా రూపొందిన ఆషికి 2 చిత్రాన్ని ప్రాంతాలు భాషలకతీతంగా ప్రేక్షకులు బ్రహ్మరంధం పట్టారు. అదే చిత్రాన్ని ‘నీజతగా...నేనుండాలి’ టైటిల్‌తో రూపొందించి ఆగస్టు 22 తేదిన విడుదల చేశారు. హిందీలో ఆకట్టుకన్న విధంగానే ‘నీజతగా నేనుండాలి’ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే.
కొద్దికాలంలోనే పేరు ప్రతిష్ఠలను సొంతం చేసుకున్న ఆర్‌జే, గాయకుడు రాఘవ జయరాం. మత్తు పదార్థాలు, మద్యానికి బానిసైన రాఘవ క్రమంగా తన పేరు ప్రఖ్యాతులను క్రమంగా కోల్పోతాడు. ఈ నేపథ్యంలో గాయత్రి నందన అనే బార్ సింగర్‌ను చూసి ఆమెలోని ప్రతిభను ఇష్టపడుతాడు. గాయత్రిని గొప్ప గాయకురాలు చేయాలని నిర్ణయించుకుంటాడు. గాయత్రిపై ఇష్టం ప్రేమగా మారుతుంది. గాయత్రిని గొప్ప గాయకురాలు చేశాడా? గాయకుడిగా రాఘవ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడా?గాయత్రి, రాఘవల ప్రేమ సుఖాంత మవుతుందా అనే ప్రశ్నలకు సమాధానమే నీజతగా నేనుండాలి.
నటవర్గం
మార్చురాఘవగా సచిన్, గాయత్రిగా నజ్రియాలు నటించారు. తమ శక్తి సామర్ధ్యాల మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. పాధ్యాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రావు రమేశ్, శశాంక్‌లు వారి పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
పాటల జాబితా
మార్చుప్రేమంటే ఏమిటో, రచన: చంద్రబోస్, గానం.శరిబ్ సబ్రి
క్షమించవే చెలి , రచన: చంద్రబోస్ గానం..శ్రీరామచంద్ర మైనంపాటి
నిజమా కాదా, రచన: చంద్రబోస్,గానం. అభయ్ జోధ్పుర్కర్, పలక్ ముచ్చాల్
ఈ పిచ్చే ప్రేమని , రచన: చంద్రబోస్, గానం.పలక్ ముచ్చల్ , మైనంపాటి శ్రీరామచంద్ర
కనబడునా , రచన: చంద్రబోస్ గానం.కె.కె , అర్పిత చక్రవర్తి
ప్రాణమా నా ప్రాణమా , రచన: చంద్రబోస్, గానం.అర్జిత్ సింగ్
మనసే పెదవిన , రచన: చంద్రబోస్, గానం.అర్పిత చక్రవర్తి
వింటున్నావా నేస్తమా ,( మేల్ వాయిస్) రచన: చంద్రబోస్ గానం.అంకిత్ తివారీ
వింటున్నావా, నేస్తమా(ఫిమేల్ వాయిస్) రచన: చంద్రబోస్, గానం.శ్రేయా ఘోషల్ .
సాంకేతికవర్గం
మార్చుసగటు సంగీత అభిమానులను హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించికున్న ఆషికి 2 పాటలు మళ్లీ వినాలనే స్థాయిలో ఉన్నాయి. నేపథ్యగీతాలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం బాగుంది.
బయటి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Nee Jathaga Nenundali Review". ApToday. Archived from the original on 2014-08-25. Retrieved August 22, 2014.