భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి (N.I.T.I.). దీనిని తెలుగులో భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం. దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక సీఈవో ఉంటారు. భారత్ లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరినీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్రమంత్రుల నుంచి నలుగురు దీనిలో సభ్యులుగా ఉంటారు.

నీతి ఆయోగ్
సంస్థ అవలోకనం
స్థాపనం 1 జనవరి 2015; 5 సంవత్సరాల క్రితం (2015-01-01)
పూర్వపు ఏజెన్సీ Planning Commission
అధికార పరిధి Government of India
ప్రధాన కార్యాలయం New Delhi
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/లు Narendra Modi, Chairman
Rajiv kumar, Vice Chairman
Bibek Debroy, Member
V. K. Saraswat, Member
Ramesh Chand, Member
Amitabh Kant, CEO
Parent Agency Government Of India

శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది.

లక్ష్యాలుసవరించు

ఇది ఆర్థికాంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్న జాతీయ, అంతర్జాతీయ విషయాలపై సూచనలిస్తుంది. జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలకు చురుకైన పాత్రను, భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. గ్రామస్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపజేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్ది, వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనాలను చూస్తుంది. ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందలేకపోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం, భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగాన్ని పెంచడం వంటివి దీని యొక్క ప్రధాన లక్ష్యాలు.

 
నీతి అయోగ్ మొదటి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ

మూలాలుసవరించు

  • ఈనాడు దినపత్రిక - 02-01-2015 (ప్రణాళిక స్థానంలో నీతి ఆయోగ్)
  • సాక్షి దినపత్రిక - 02-01-2015 (కొత్త దిక్సూచి 'నీతి ఆయోగ్')