మూస:Expand French

Nice
Nice-night-view-with-blurred-cars 1200x900.jpg
Flag of Nice
Flag
Coat of arms of Nice
Coat of arms
Motto(s): 
Nicæa civitas.
దేశంఫ్రాన్సు
RegionProvence-Alpes-Côte d'Azur
DepartmentAlpes-Maritimes
ArrondissementNice
IntercommunalityNice-Côte d'Azur
ప్రభుత్వం
 • Mayor (2008–2014) Christian Estrosi
విస్తీర్ణం
 • Land171.92 కి.మీ2 (27.77 చ. మై)
జనాభా
(2007)
 • ర్యాంక్5th in France
 • పట్టణ
 (2010)
955
 • Population2
348721
 • Population2 density4,800/కి.మీ2 (13,000/చ. మై.)
ప్రామాణిక కాలమానంCET (GMT +1)
INSEE/Postal code
06088
1 French Land Register data, which excludes lakes, ponds, glaciers > 1 km² (0.386 sq mi or 247 acres) and river estuaries. 2 Population without double counting: residents of multiple communes (e.g., students and military personnel) only counted once.

నీస్ (pronounced /ˈniːs/; French pronunciation: ​[nis]; Niçard Occitan: Niça [సంప్రదాయ నియమావళి] లేదా నిస్సా [అప్రామాణికత], ఇటాలియన్: Nizza లేదా నిజ్జా మ్యారిట్టిమా, Greek: Νίκαια, లాటిన్: నైసియా ) ఫ్రాన్స్‌లోని అత్యంత జనసమర్దమైన ఐదవ నగరం, పరిపాలనకు సంబంధించిన 71.92 kమీ2 (28 sq mi) విస్తీర్ణపు పరిధిలో 348,721 జనాభాతో ప్యారీస్‌, మార్సెయిల్లే, ల్యాన్ మరియు టౌలస్‌ల తర్వాత నీస్ ఈ ఘనతను సాధించింది. అలాగే నీస్‌కు సంబంధించిన పట్టణ ప్రాంతం 955,000[1]కు మించిన జనాభాతో, 721 kమీ2 (278 sq mi) విస్తీర్ణంతో పరిపాలన నగర పరిధికి మించి విస్తరించింది. మధ్యదరా సముద్రంపై ఫ్రాన్స్‌ యొక్క ఆగ్నేయ తీరంలో ఉన్న నీస్, మధ్యదరా సముద్ర తీరంలో వెలిసిన ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరంగా ఉంటోంది.

నీస్ లా బెల్లే (Niçardలో నిస్సా లా బెల్లా ) అనే ముద్దు పేరు ఈ నగరం సొంతం, నీస్ అందమైనది అని ఈ ముద్దుపేరుకు అర్థం. ఆల్పెస్ మారిటైమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు రాజధాని నగరంగా ఉండడంతో పాటు మార్సెయిల్లే తర్వాత రీజియన్ ప్రొవియన్స్-ఆల్పెస్-Côte d'Azurలో రెండో అతిపెద్ద నగరంగా ఉంటోంది.

నేడు నీస్‌గా ఉనికిలో ఉన్న ఈ ప్రాంతం, ఐరోపా‌లో మానవ నివాసాలకు సంబంధించిన పురాతన నగరాల్లో ఒకటిగా కూడా విశ్వసించబడుతోంది. పురాతత్వ సంబంధిత ప్రాంతాల్లో ఒకటైన టెర్రా అమాటలో నిప్పును తొలిసారిగా ఉపయోగించిన ఆనవాళ్లు నేటికీ అందుబాటులో ఉన్నాయి. 350 BC ప్రాంతంలో, మార్సెయిల్లేకు చెందిన గ్రీకులు ఇక్కడ స్థిరనివాసం సాగించడంతో పాటు విజయానికి అధిదేవత పేరుతో మొదట్లో దీన్ని నైకాయ్ అని అటుపై నైక్ అని పిల్చేవారు.[2]

కాలగమనంలో ఈ నగరం అనేకసార్లు చేతులు మారింది. వ్యూహాత్మక ప్రదేశం మరియు ఓడరేవు లాంటివి ఈ నగరానికి సంబంధించిన నావికా రంగ బలాన్ని పట్టిచూపుతాయి. చాలా ఏళ్లపాటు ఇటాలియన్ భూభాగంలో అంగంగా ఉన్న ఈ నగరం 1860లో ఫ్రాన్స్‌లో భాగమైంది. కాలగమనంలో సంస్కృతిపరంగా మరియు వాస్తుశిల్ప విన్యాసపరంగా సంవృద్ధి సాధించిన నీస్ నగరం నేడు ఒక నిజమైన కాస్మోపాలిటిన్ పర్యాటక గమ్యంగా నిలుస్తోంది.[3] నీస్‌లో కనిపించే అద్వితీయమైన ప్రకృతి సౌందర్యం మరియు అక్కడ కనిపించే నులివెచ్చని మధ్యదరా ప్రాంత వాతావరణం 18వ శతాబ్దంలో ఆంగ్లేయుల్లోని ఉన్నత వర్గాల వారిని ఆకర్షించడంతో, అప్పటినుంచి ఉన్నత వర్గ కుటుంబాలు తమ శీతాకాలాన్ని ఇక్కడ గడపడం అలవాటుగా చేసుకున్నారు. ఇక్కడి రిసార్ట్‌కు తరలివచ్చిన ప్రారంభ పర్యాటకులకు నగరానికి సంబంధించిన ప్రధాన సముద్రతీర విహార ప్రదేశమైన ప్రోమినేడ్ డెస్ ఆంగ్లైస్ (‘వాక్‌వే ఆఫ్ ది ఇంగ్లీష్’) ఎప్పటికీ రుణపడి ఉంటుంది.[4] దశాబ్దాల తర్వాత ప్రస్తుతం, శృంగారపూరిత అందాలకు నిలయమైన నైసీన్ పరిసరాలు కేవలం సేదతీరే ప్రదేశం కోసం వెతికేవారినే కాకుండా ప్రేరణ కోసం అన్వేషించే వారిని సైతం ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి పరిశుభ్రమైన గాలి మరియు సుతిమెత్తని కాంతి లాంటివి కొన్ని రకాల పాశ్చాత్య సంస్కృతులకు చెందిన అనేకమంది ప్రఖ్యాత చిత్రకారులకు ఆహ్వానాలుగా నిలుస్తున్నాయి, మార్క్ చాగల్, హెన్రీ మాటిస్సే, నికీ డే సెయింట్ పల్లే మరియు అర్మాన్ లాంటి వారు ఇక్కడి అందాలకు ముగ్ధులయ్యారు. వారి చేతిలో రూపుదిద్దుకున్న కళాఖండాలు నగరానికి చెందిన మ్యూసీ మార్క్ చాగల్, మ్యూసీ మాటిసే మరియు మ్యూసీ డెస్ బియాక్స్-ఆర్ట్స్ జూలెస్ చెరెట్ లాంటి మ్యూజియంలతో సహా అనేక మ్యూజియంలో స్మారక చిహ్నాలుగా కొలువుదీరాయి.[5] ఇక్కడి వాతావరణం మరియు ప్రకృతి దృశ్యం లాంటివి నేడు అనేకమంది పర్యాటకులను నీస్ నగరం వైపు ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక హోటళ్ల సామర్థ్యం కలిగి రెండో ప్రదేశం[6]గా ఉన్న నీస్, ప్రతి ఏటా 4 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఫ్రాన్స్‌లోని ప్యారీస్ తర్వాత అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే రెండో అతిపెద్ద నగరంగా నిలుస్తోంది.[7] అలాగే ఫ్రాన్స్‌లోని ప్యారీస్ తర్వాత అత్యధిక జనసమర్దతతో నిండిన విమానాశ్రయం కలిగిన రెండో నగరం[8]గా ఖ్యాతి గడించడంతో పాటు వ్యాపార పర్యాటకం కోసం ఇక్కడ రెండు సంప్రదాయ కేంద్రాలు అంకితం చేయబడ్డాయి. ఒక విశ్వవిద్యాలయం, అనేక వ్యాపార జిల్లాలతో పాటు మ్యూజియంల వంటి కొన్ని ప్రధాన సంప్రదాయ సౌకర్యాలు, ఒక జాతీయ రంగస్థలం, ఒక ప్రాంతీయ గ్రంథాలయం మరియు అనేక సంగీత విభావరి వేదికలు మరియు జూదశాలలు కలిగిన ఒక ఒపేరా హౌస్ లాంటి ఎన్నెన్నో అంశాలు ఈ నగరంలో ఉన్నాయి. అంతేకాకుండా కంట్రీ ఆఫ్ నీస్ (కంటే డీ నీస్ ) యొక్క చారిత్రక రాజధాని నగరంగా కూడా నీస్ విలసిల్లుతోంది.

నీస్ నగరం మధ్యదరా వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి వేసవి/సెలవుల సీజన్ అనేది మే మొదలుకుని అక్టోబరు వరకు ఆరు నెలల్లో పూర్తయినప్పటికీ, కొన్నిసమయాల్లో ఏప్రిల్ మరియు నవంబరులో సైతం ఉష్ణోగ్రతలు 20 °C (68 °F) మించి నమోదవుతుంటాయి. డిసెంబరుతో మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగే ఇక్కడి శీతాకాల వాతావరణం మందంగా ఉండడంతో పాటు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు సరాసరిగా 13.4 °C (56.1 °F) ఉండడంతో పాటు రాత్రిపూట 5.8 °C (42.4 °F) వరకు నమోదవుతుంటాయి.

విషయ సూచిక

చరిత్రసవరించు

 
నీస్ నౌకాశ్రయం.

పునాదిసవరించు

దాదాపు 400,000 ఏళ్లకు పూర్వం మొదటిసారిగా నీస్‌లో జనావాసాలు ప్రారంభమయ్యాయి;[9] టెర్రా అమాట ఆర్కియాలజికల్ ప్రదేశంలో మానవ నాగరికత ప్రారంభంలో ఉపయోగించించిన నిప్పు ఆనవాళ్లతో పాటు గృహాల నిర్మాణం మరియు చెకుముకి రాళ్ల గుర్తింపులు లాంటివి ఉన్నాయి, ఇవన్నీ దాదాపు 230,000 సంవత్సరాల పూర్వానికి చెందినవిగా భావించబడుతున్నాయి.[10] 350 BC ప్రాంతంలో గ్రీకుల యొక్క మస్సీలియా (మార్సిల్లే) ద్వారా నీస్ (నైసియా) నగరం కనుగొనబడింది, అలాగే ఈ నగరం పేరైన Νικαία ("నైకాయ్") అనేది పొరుగున ఉన్న లిగురియాన్స్‌ (నైక్ అంటే విజయానికి సంబంధించిన గ్రీకు దేవత పేరు)పై సాధించిన విజయానికి గుర్తుగా వచ్చింది. అటుపై త్వరలోనే ఇది లిగురియాన్ తీరంలోని రద్దీ నౌకాశ్రయాల్లో ఒకటిగా ఎదిగింది; అయితే సెమెనీలమ్ యొక్క రోమన్ పట్టణంలో దీనికి ఒక ముఖ్యమైన ప్రత్యర్థి ఉండేది, లంబార్డ్ దాడుల వరకు కూడా ఇది ప్రత్యేక నగరంగా ఉంటూ వచ్చింది. ఈ దాడుల కారణంగా ధ్వంసమైన సెమెనీలమ్, నైస్‌లోని ఒక జిల్లా అయిన సీమియేజ్ వద్ద కొలువై ఉంది.

ప్రారంభ అభివృద్ధిసవరించు

 
సెయింట్ ఫ్రాన్కాయిస్ టవర్.
 
గారిబాల్డీ స్మారకస్థూపం, ప్లేస్ గారిబాల్డీ

7వ శతాబ్దంలో నీస్ జెనొయిస్ లీగ్‌లో చేరింది, లిగూరియా యొక్క పట్టణాల ద్వారా ఈ లీగ్ ఏర్పాటైంది. 729లో ఈ నగరం సరాసెన్‌లు‌ని ఓడించింది; అయితే 859లో మరియు 880లో సరాసెన్‌లు ఈ నగరాన్ని దోచుకోవడంతో పాటు తగలబెట్టడం ద్వారా దాదాపు 10వ శతాబ్దం వరకు ఈ చుట్టుపక్కలి దేశానికి మాస్టర్లుగా నిలిచారు.

మధ్యయుగ కాలంలో నీస్ యుద్ధాల్లోను మరియు ఇటలీ చరిత్రలోనూ భాగస్వామ్యం వహించింది. పిసాకు మిత్రరాజ్యంగా ఉండడంతో ఇది జెనీవాకు శత్రువుగా మారింది, ఫ్రాన్స్ రాజు మరియు చక్రవర్తి ఇద్దరూ కూడా దీన్ని వశపర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు; అయితే, అంతకు ముందు ఇది తన మున్సిపల్ స్వేచ్ఛలును చక్కగా నిర్వర్తించింది. మరోవైపు 13వ మరియు 14వ శతాబ్దాల్లో ఈ నగరం ఒకసారి కంటే ఎక్కువ సంఖ్యలో కౌంట్స్ ఆఫ్ ప్రొవియన్స్ చేతుల్లో పడినప్పటికీ, చివరకు జెనీవాకు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ స్వతంత్రంగా నిలవగలిగింది.

నీస్ మరియు సవోయ్సవరించు

1388లో కౌంట్స్ ఆఫ్ సవోయ్ యొక్క రక్షణ కింద ఈ నగరంలో కమ్యునే (పరిపాలన సంబంధిత చిన్న ప్రాంతాలుగా విభజన) చోటు చేసుకుంది. మొత్తంమీద 1860 వరకు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సవోయ్ చరిత్రలో నీస్ కూడా భాగస్వామ్యం వహించింది.

నేడు నీస్‌ యొక్క నావికా సంబంధిత బలం బార్బరీ పెరైటీలును సమర్థంగా ఎదుర్కొనగలిగే స్థాయికి చేరింది; రక్షణ సంబంధిత అంశాలను భారీగా విస్తరించడంతో పాటు నగరానికి దారితీసే రోడ్లను అభివృద్ధిపర్చడం జరిగింది. మరోవైపు 1561లో లాటిన్‌ను పరిపాలన సంబంధిత భాషగా ఉపయోగించడాన్ని సవోయ్ డ్యూక్ అయిన ఎమ్యూనేల్ ఫిలిబెర్ట్ తొలగించడంతో పాటు నీస్‌లో ప్రభుత్వ సంబంధిత అధికార భాషగా ఇటాలియన్ భాషకు స్థానం కల్పించాడు.

ఫ్రాన్సీస్ I మరియు ఛార్లెస్ V మధ్య యుద్ధం సంభవించిన సమయంలో పెద్ద సంఖ్యలో సైన్యాలు ప్రొవియన్స్‌లోకి చొచ్చుకు రావడంతో అతిపెద్ద వినాశనం సంభవించింది; అంటురోగం మరియు కరువు లాంటివి అనేక ఏళ్లపాటు ఈ నగరంలో తిష్టవేశాయి. ఇలాంటి తరుణంలో దగ్గర్లోని పట్టణమైన విల్లెనెయువ్-లౌబెట్ వేదికగా 1538లో పోప్ పాల్ III మధ్యవర్తిత్వంతో పదేళ్ల సంధికి ఆ ఇద్దరు రాజులు సిద్ధమయ్యారు.[11]

 
1543లో ఫ్రాంకో-ఒట్టోమన్ ఓడల సమూహంతో పరివేష్టితమైన నీస్

1543లో, నీస్ ముట్టడిలో భాగంగా ఫ్రాన్సిస్ I మరియు బార్బరోస్సా హైరెడ్డిన్ పాషాల యునైటెడ్ ఫ్రాన్కో-ఒట్టోమ్యాన్ దళాల ద్వారా నీస్ దాడికి గురైంది; ఈ దాడిని స్థానికులు సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ, ఘోరమైన బాంబులదాడి కారణంగా నీస్‌ ప్రజలు చివరకు లొంగిపోక తప్పలేదు, ఈ పరిణామంతో బార్బరోస్సా ఈ నగరాన్ని దౌర్జన్యంగా దోచుకోవడంతో పాటు 2,500 మందిని బంధీలుగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. ఇక 1550 మరియు 1580ల్లోనూ మరోసారి అంటువ్యాధి చోటు చేసుకుంది.

 
స్పాట్ ఉపగ్రహం నుంచి నీస్

1600లో గ్యూస్ యొక్క డ్యూస్ ద్వారా నీస్ పాక్షికంగా వశపర్చుకోబడింది. దీంతోపాటు నీస్‌లోని రేవులన్నింటినీ అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు వాణిజ్యానికి పూర్తి స్వచ్ఛ (1626) ఇస్తున్నట్టుగా ప్రకటించబడింది, నగరానికి సంబంధించిన వాణిజ్యం అతిపెద్ద ఉద్దీపనగా నిలవడంతో పాటు ఉన్నత కుటుంబాలు వాణిజ్యం సంస్థల్లో పాలుపంచుకున్నాయి.

నికోలస్ కాటిన్యాట్ ద్వారా 1691లో నీస్ ఆక్రమణకు గురికావడంతో పాటు 1696లో ఈ నగరం సవోయ్‌కి సొంతమైంది; అయితే, 1705లో మరోసారి ఫ్రెంచ్ ద్వారా ముట్టడికి గురికావడంతో పాటు ఆ తర్వాతి సంవత్సరంలో ఈ నగరానికి సంబంధించిన దుర్గము మరియు రక్షణ గోడ లాంటివి ధ్వసం చేయబడ్డాయి.

ఇక 1713లో చోటు చేసుకున్న అట్రెక్ట్ ఒప్పందంతో మరోసారి ఈ నగరం సవోయ్ డ్యూక్ చేతికి చేరింది, అదేసమయంలో ఆయన సిసిలీకి సైతం రాజుగా గుర్తించబడ్డారు. ఇలా ప్రశాంతంగా గడచిన ఈ సంవత్సరాల్లో "కొత్త నగరం" నిర్మాణానికి నోచుకుంది. 1744 నుండి పీస్ ఆఫ్ ఎయిక్స్-లా-చపెలే (1748) వరకు ఫ్రెంచ్ మరియు స్పెయిన్‌యార్డ్‌లు మళ్లీ స్వాధీనంలోకి వచ్చాయి. మరోవైపు 1718లో సిసిలీపై తన సార్వభౌమత్వాన్ని సార్డినియా రాజ్యానికి మార్పిడి చేసిన రాజు 1775లో కమ్యునేకు సంబంధించి మిగిలి ఉన్న అన్ని పురాతన స్వేచ్ఛలను ధ్వంసం చేశాడు. దీనితర్వాత 1792లో మొదటి ఫ్రెంచ్ రిపబ్లిక్ సైన్యాలు విజయం సాధించడంతో 1814 వరకు నీస్ దేశం ఫ్రెంచ్‌లో ఒక భాగంగా ఉండిపోయింది; అయితే దీనితర్వాత మళ్లీ ఈ ప్రాంతం సార్డీనియా-పీడ్‌మోండ్ రాజ్యం ఆధీనంలోకి చేరింది.

అటుపై ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా జరిగిన సెకండ్ ఇటాలియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లో నీస్ సాయం చేసినందుకుగాను 1860లో సార్డీనియా రాజు మరియు నెపోలియన్ IIIల మధ్య ఏర్పడిన ఒక ఒప్పందం ప్రకారం, ఈ దేశం మరోసారి ఫ్రెంచ్‌ స్వాధీనంలోకి చేరింది, ఈ యుద్ధం ఫలితంగా పీడ్‌మోంట్-సార్డీనియాలతో లంబార్డీ ఏకీకృతమైంది. ఈ అప్పగింతను మొత్తం 30,700 మంది ఓటర్లలో దాదాపు 25,000పైగా ఓటర్లు ఆమోదించారు. అదేవిధమైన సాధనం ద్వారా సవోయ్ సైతం ఫ్రెంచ్ పాలన కిందకు బదిలీ అయ్యింది.

 
1624లో నీస్, అప్పట్లో ఇది నిజ్జాగా పిలవబడేది

అయితే నీస్‌లో జన్మించిన గూసెపే గారిబాల్డి మాత్రం ఫ్రాన్స్‌కు జరిగిన ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకించడంతో పాటు (ఈ ఒప్పందం "సార్వత్రిక" వోటింగ్ ప్రక్రియలో జరగలేదని మరియు ఫ్రెంచ్ ద్వారా ఈ ఓటింగ్ ప్రక్రియ రిగ్గింగ్ చేయబడిందని అతను వాదించాడు) 1866లో నీస్‌ని ఇటలీలో ఏకీకృతం చేయాలని కోరుతూ "గారిబాల్‌డిని" ద్వారా నగరంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మరోవైపు ఇటాలియన్ ఇర్రెడెన్టిస్ట్‌లు భావన ప్రకారం, వారి ప్రధాన జాతీయవాద అభ్యర్థనల్లో నీస్ కూడా ఒకటిగా ఉండడంతో పాటు 1942/3లో ప్రపంచయుద్ధం II సమయంలో ఈ నగరం ఇటలీ ద్వారా ఆక్రమించుకోబడడంతో పాటు వారిచే పరిపాలించబడింది.

ఫ్రెంచ్ నీస్సవరించు

1861 నుండి నీస్ నగరం ఫ్రెంచ్‌లో భాగంగా కొనసాగుతోంది.

20వ శతాబ్దం ఆధునిక రవాణా ఆగమనాన్ని చవిచూసింది. 1900లో ట్రామ్‌వే డే నీస్ దాని స్ట్రీట్‌కార్ల కోసం విద్యుదీకరించడంతో పాటు, దాని నెట్‌వర్క్‌ని మెన్‌టన్ మొదలుకుని కాగ్నెస్-సుర్-మెర్ వరకు డిపార్ట్‌మెంట్ మొత్తానికి విస్తరించింది. అటుపై 1930ల్లో మొత్తం ప్రాంతానికి సంబంధించిన రవాణా నెట్‌వర్క్‌కు అధనపు బస్ కనెక్షన్లని జోడించడం జరిగింది.

1932లో సర్క్యూట్ నీస్ పేరుతో ఫార్ములా లిబ్రే (ఫార్ములా రేస్‌కు పూర్వం)లో అంతర్జాతీయ కార్ రేసులకు నీస్ నగరం ఆతిథ్యమిచ్చింది. జార్డిన్ ఆల్బెర్ట్‌ Iకు దక్షిణాన ఉన్న వాటర్‌ఫ్రంట్‌తో పాటుగా ఈ సర్క్యూట్ ప్రారంభమవుతుంది, అటుపై ఇది మళ్లీ తూర్పుగా వచ్చేందుకు ఉద్దేశించిన హోటల్ నెగ్రెస్కో వద్ద ఉండే హెయిర్‌పిన్ టర్న్‌ను అనుసరించి వచ్చే ప్రొమెనడే డెస్ ఆంగ్లైస్‌తోపాటుగా పశ్చిమ దిశగా సాగడంతో పాటుగా క్వాయ్ డెస్ ఎటాట్స్-యునిస్ మీదుగా బీచ్‌తో పాటుగా మరోసారి తూర్పు దిశగా సాగేముందు జార్డిన్ ఆల్బెర్ట్ I చుట్టూ తిరుగుతుంది. 1932లో, లూయిస్ చిరోన్ బుగట్టీ T51ను అధిరోహించడం ద్వారా నీస్ గ్రాండ్ ఫ్రిక్స్‌ను గెలిచాడు, చిరోస్‌కి వెనుక కేవలం 3.4 సెకండ్ల తేడాతో రైమండ్ సోమెర్ ఆల్ఫా రోమియో మోన్జా ద్వారా రెండవ స్థానం దక్కించుకోగా, బుగట్టి T51నే ఉపయోగించిన రెనే డ్రైఫస్ మూడో స్థానాన్ని సాధించాడు. 1933లో, ఈ రేస్‌ను మసెరటి 8C సాయంతో టాజియో నువోలారీ గెల్చుకోగా, బుగట్టీ సాయంతో రేనే డ్రైఫస్ మరియు ఆల్ఫా రోమియో మోన్జా సాయంతో గై మోల్‌లు తర్వాతి స్థానాలను ఆక్రమించారు. 1934లో, ఈ రేస్‌ను మరోసారి కూడా ఒక ఇటాలియన్ గెల్చుకోవడం విశేషం, ఆల్ఫా రోమియో టిపో B సాయంతో ఈ రేస్‌ను గెల్చిన అతను మరెవరో కాదు ఈ సీజన్‌లో అత్యుత్తమ డ్రైవర్‌గా నిల్చిన అచిల్లే వర్జీనే ఈ రేస్‌లో విజేతగా నిలిచాడు. నీస్‌లో గ్రాండ్ ఫ్రిక్స్‌కు సంబంధించిన చివరి సీజన్ 1935లో చోటు చేసుకుంది, ఈ సమయంలో ఆల్ఫా రోమియో టిపో B తన టాజియో నువోలారి సాయంతో ఈ రేస్‌లో విజేతగా నిలవగా లూయిస్ చిరోన్ రెండోస్థానంలోను, మరియు రెనే డ్రైఫస్ మూడోస్థానంలోను రేస్‌ని ముగించారు.

1939 సెప్టెంబరులో యుద్ధం చోటుచేసుకోవడంతో గూడుచెదిరిన అనేకమంది విదేశీయులకు నీస్ ఒక శరాణార్థి శిబిరంగా మారిపోయింది, ప్రత్యేకించి యూదుల వలస మరియు నాజీల బదిలీ లాంటివి తూర్పు ఐరోపా వైపు స్వేచ్ఛగా జరిగిపోయాయి. ఇక నీస్ నుంచి అనేకమంది అటు తర్వాతి ఆశ్రయం కోసం ఫ్రెంచ్ కాలనీలు, మొరాకో మరియు ఉత్తర మరియు దక్షిణ అమెరికాలకు సాగిపోయారు. జూలై 1940 మరియు విచీ రెజిమీ స్థాపన తర్వాత, యాంటీసెమెటిక్ ఆక్రమణల కారణంగా మాకుమ్మడి దేశ నిష్రమణలు ఊపందుకున్నాయి, జూలై 1941తో ప్రారంభించి 1942 వరకు ఇది కొనసాగింది. 1942 ఆగస్టు 26న విదేశీయులైన 655 మంది యూదులను లావల్ ప్రభుత్వం చుట్టుముట్టడంతో పాటుగా అవువేర్ జైళ్లలో నిర్భందించింది. అలా నిర్భందానికి గురైన వారిలో 560 మందిని 1942 ఆగస్టు 31న డ్రాన్సీ ఇంటర్నెమెంట్ క్యాంప్‌కు తరలించారు. అయితే యూదు బ్యాంకర్ ఏంజెలో డొనాటీ మరియు కాపుచిన్ మతాధికారి పెరే మ్యారీ-బెనోయిట్‌ల చర్యల పుణ్యమా అని స్థానిక అధికారులు యూదుల విచీ చట్టాల వ్యతిరేక దరఖాస్తులను అడ్డుకున్నారు.[12]

ఈ నేపథ్యంలో 1940 సెప్టెంబరులో కొత్త పాలనను ”నిరోధించిన” వారుగా లైసీ డే నీస్ (ప్రస్తుతం లైసీ మాస్సెనా)‌కు చెందిన హై స్కూల్ సీనియర్స్ నిలిచారు, అయితే అటుపై 1944లో వారు అరెస్టు కావడంతో పాటుగా క్యాస్టల్లేన్ వద్ద విచారించబడ్డారు. మరోవైపు మొట్టమొదటి బహిరంగ ప్రదర్శనలనేవి 1942 జూలై 14లో చోటు చేసుకున్నాయి, ఈ సమయంలో అనేక వందలమంది నిరసనకారులు అవెన్యూ డీ లా విక్టరీ మరియు ప్లేస్ మాస్సెనాతో సహా వివిధ వీధుల్లోకి చేరి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవంబరు 1942 మరియు ఇటాలియన్ దళాలు ఈ నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత, తాజాగా వచ్చిన వలసదారుల్లో చాలామంది ఇటాలియన్ వంశావళికి చెందినవారనే రూపంలో ఒక రకమైన అనిశ్చితి ప్రజల మధ్య చోటు చేసుకుంది. అయినప్పటికీ, జర్మన్ సేనలు విచీ ఫ్రాన్స్‌ని చేపట్టిన సమయంలో 1943లో ఇటాలియన్ లొంగుబాటు తర్వాత ఈ నిరోధకత్వం అనేది తారాస్థాయికి చేరుకుంది. అదేసమయంలో ఆందోళనలు చేపట్టిన అనేకమందిని స్థానిక గెస్టాపో మరియు ఫ్రెంచ్ మిలిసే ద్వారా హింసకు మరియు శిక్షకు గురికావడంతో డిసెంబరు 1943 మరియు జూలై 1944 మధ్య ప్రతీకార దాడులు చోటు చేసుకున్నాయి. దీంతోపాటు మిత్రపక్షాలు ప్రొవియెన్స్‌లో దిగేందుకు వీలుగా అమెరికా వాయుదళం నీస్‌పై బాంబుల వర్షం కురిపించింది (ఈ దాడి కారణంగా 1000 మంది మరణించడం లేదా గాయపడడం జరగడంతో పాటు 5600 మంది ప్రజలు నిరాశ్రయులైనారు) మరియు 1944 వేసవిలో తీవ్రమైన కరువు సైతం ఈ నగరాన్ని చుట్టుముట్టింది. చివరగా అమెరికన్ పారాట్రూపర్లు 1944 ఆగస్టు 30న నగరంలో ప్రవేశించడంతో పాటు నీస్‌కు విముక్తి లభించింది. ఈ యుద్ధానికి సంబంధించిన పరిణామాలు చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి, ప్రజల సంఖ్య 15% మేర తగ్గడంతో పాటు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది.

అటుపై 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో పునర్వైభవానికి చేరుకున్న నీస్ ఆర్థిక పురోగతిని చవిచూసింది, ప్రధానంగా పర్యాటకం మరియు నిర్మాణాల ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ సమయంలో నగరం విషయంలో ఇద్దరు వ్యక్తుల ప్రభావం చూపారు: 33ఏళ్ల జీన్ మెడెసిన్ మేయర్‌గా 1928 నుంచి 1943 వరకు అలాగే 1947 మొదలు 1965 వరకు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేయగా, అటుపై ఆయన కుమారుడు జాక్యూస్ 1966 మొదలు 1990 వరకు మేయర్‌గా తనదైన ప్రభావం చూపారు. వీరిద్దరి నాయకత్వంలో, నీస్ నగరం అసాధారణమైన రీతిలో పట్టణీకరణను సంతరించుకోవడంతో పాటు కొత్త నిర్మాణాలు (సమావేశ కేంద్రం, థియేటర్లు, కొత్త ప్రభుత్వ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలు మొదలుగునవి) రూపం సంతరించుకున్నాయి. పైడ్స్-నోయిర్స్ ఆగమనం, 1962 స్వాతంత్ర్యం తర్వాత అల్జీరియా నుంచి శరణార్థుల రాక లాంటి అంశాలు సైతం నగరం అభివృద్ధి విషయంలో తమదైన పాత్ర పోషించడంతో పాటు ఇక్కడి జనాభా మరియు సంప్రదాయ అభిప్రాయాలను కొంతవరకు మార్పు చేయడంలోనూ సహకరించాయి. 1980ల చివరినాటికి, ఈ నగర ప్రభుత్వానికి సంబంధించి రాజకీయ అవినీతి వెలుగు చూడడంతో పాటు చివరకు జాక్యూస్ మెడెసిన్‌కు వ్యతిరేకంగా అధికారిక ఆరోపణలు చోటుచేసుకోవడంతో 1990లో ఆయన తప్పనిసరిగా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. అటుపై 1993లో ఆయన ఉరుగ్వేలో అరెస్టు చేయబడడంతో పాటు అప్పగింత ద్వారా 1994లో ఆయన ఫ్రాన్స్‌కు తీసుకురాబడడమే కాకుండా అవినీతి మరియు నేరాల్లో భాగస్వామ్యం లాంటి అనేక నేరారోపణల్లో భాగంగా విచారించబడి చివరకు జైలుకు పంపబడ్డారు.

1979 అక్టోబరు 16న, సముద్రం అడుగున సంభవించిన భూప్రకంపణ కారణంగా నీస్ పశ్చిమ తీరంలో సునామీ సంభవించడంతో 23 మంది మృతిచెందారు.

ఇక ఫిబ్రవరి 2001లో, ప్రస్తుత నీస్ ఒప్పందం, యూరోపియన్ యూనియన్ నిబంధనలను సవరించడంపై చర్చించడం కోసం మరియు సంతకాలు చేయడం కోసం యూరోపియన్ నేతలు నీస్‌లో కొలువుదీరారు.

2003లో, స్థానిక చీప్ ప్రాసిక్యూటర్ ఎరిక్ డీ మోంట్‌గోల్ఫియర్ ఆరోపణల ప్రకారం, స్థానిక ప్రముఖులతో ముడిపడిన జ్యూడీషియల్ కేసులు కొన్ని అనుమానాస్పద రీతిలో స్థానిక న్యాయ వ్యవస్థ ద్వారా తప్పించబడ్డాయి, అనేకమందిని విచారించిన లేదా తీర్పునిచ్చిన మాసోనిక్ లాడ్జీల ద్వారా ఇవి అనారోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నట్టుగా ఆయన అనుమానించారు. అయితే అటు తర్వాత వెలువడిన ఒక వివాదాస్పద అధికారిక నివేదిక ప్రకారం, మోంట్‌గోల్ఫియర్ అనధికారిక నిందారోపణలు కలిగి ఉన్నట్టు పేర్కొంది.

సైనికుల కోట్సవరించు

 
నీస్ యొక్క కౌంటీ ఆయుధాలు

కోట్ ఆఫ్ ఆర్మ్ నీస్ అనేది మొదటిసారిగా 1430 ప్రాంతంలో రాయబడిన రెగ్యులేషన్స్ ఆఫ్ ఎమడెస్ VIII సంబంధించిన ఒక పత్రంలో కనిపించింది.[13] ఇందులో భాగంగా తెల్లటి వెనుకభాగం కలిగిన ఎర్రటి గద్ద గుర్తుతో నీస్ సంకేతించబడింది, ఈ గద్ద మూడు కొండలపై నిల్చి ఉంటుంది, ఫ్రెంచ్ హెరాల్డిక్ భాషలో "d'argent à une aigle de gueule posée sur trois coupeaux" అని దీని గురించి వర్ణించబడింది.[13] అటుపై కాలంలో సైన్యాల విషయంలో చిన్నపాటి మార్పులు చోటుచేసుకున్నాయి : కోట్‌లోని గద్ద మరింత అందంగా మారడంతో పాటు ప్రస్తుతం ఇది నీస్ దేశంకు సంబంధించిన కిరీటాన్ని నెత్తిన 'ధరించింది', అలాగే దాని కాళ్ల కింద ఉండే మూడు కొండలు ఇప్పుడు అందమైన సముద్రంచే ఆవరించబడింది.[13]

కోట్‌పై గద్ద స్థానం వహించడం, సామ్రాజ్య చిహ్నం, లాంటివి ఈ సైన్యాలు హౌస్ ఆఫ్ సవోయ్ యొక్క అధికారానికి సంబంధించినవనే విషయాన్ని చాటి చెబుతాయి.గద్ద నిల్చుని ఉండే మూడు కొండలనేవి సవోయ్‌కు ఒక ఉదాహరణ మరియు చిత్రణగా నిలవడంతో పాటు నీస్ చుట్టూ ఉండే దేశంపై తన ఆధిపత్య స్థాపనను సూచిస్తుంది.[13] ఇక తెలుపు మరియు ఎరుపుల కలయిక (ధవళ మరియు ఎర్రటి వర్ణాలు) అనేది సవోయ్ పతాక రంగులకు ప్రతినిధులుగా నిలుస్తాయి.[13] అలాగే గద్ద కాళ్ల కింద ఉండే మూడు కొండలనేవి భౌగోళిక వాస్తవికతతో సంబంధం లేకుండా ప్రాదేశిక గౌరవానికి ప్రతీకలుగా ఉంటాయి.[13]

పరిపాలనసవరించు

ప్రొవియన్స్-ఆల్పెస్-కోట్ డి'అజుర్ రీజియన్‌లో కేంద్రీకృతమైన నీస్ నగరం ఒక కమ్యునే మరియు ఆల్ఫెస్-మ్యారిటైమ్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రీఫెక్చర్ (పరిపాలన రాజధాని)గా ఉంటోంది. అయితే ఫ్రాన్స్‌లో అతిపెద్ద నగరంగా ఉంటోన్న ఇది ఒక ప్రాంతీయ రాజధాని కాదు; బాగా పెద్దదైన మార్సీల్లే అనేది దీని ప్రాంతీయ రాజధాని. నీస్‌కు ప్రస్తుతం మేయర్‌గా ఉన్న క్రిస్టియన్ ఎస్టెరోసి 2008లో ఈ పదవికి ఎన్నికయ్యారు. యూనియన్ ఫర్ ఏ పాపులర్ మూవ్‌మెంట్‌లో ఈయన సభ్యుడు, ఫ్రెంచ్ అధ్యక్షుడైన నికోలస్ సర్కోజీ ఈ పార్టీకి మద్దతిస్తున్నారు.

శీతోష్ణస్థితిసవరించు

నీస్ నగరం మధ్యధరా శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది: దాదాపు ఏడాది పొడవునా నగరంలో తక్కువస్థాయి ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుంటాయి; వర్షపాతం సైతం బాగా తక్కువగానే ఉండడంతో పాటు ఏడాదిలో బాగా చీకటిగా ఉండే (సెప్టెంబరు నుంచి మార్చి వరకు) నెలల్లో ఇది సాంద్రీకరించబడుతుంది.

వేసవికాలంలో వేడిగా, పొడిగా మరియు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం అనేది అరుదుగా మాత్రమే ఉండడంతో పాటు ప్రత్యేకించి జూలై నెలలో మాత్రం ఒకటి లేదా రెండు రోజుల పాటు కొలవదగిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలనేవి అరుదుగా 20 °C (68 °F) కంటే తక్కువకు చేరడంతో పాటు తరచూ 30 °C (86 °F) స్థాయికి చేరుతుంటాయి. బాగా వేడిగా ఉండే జూలై మరియు ఆగస్టు నెలల్లో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 27 °C (81 °F) వరకు ఉంటుంది. నీస్‌కు సంబంధించి పూర్తిస్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత అయిన 37.7 °C (99.9 °F) అనేది 2006 ఆగస్టు 1న నమోదైంది.

నీస్‌లో శరత్కాలమనేది సాధారణంగా సెప్టెంబరులో ఆహ్లాదకరంగా ప్రారంభం కావడంతో పాటు అటుపై అది మరింత మబ్బులు పట్టిన వాతావరణం మరియు వర్షంతోను అక్టోబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 20 °C (68 °F) మించి నమోదుకావడంతో పాటు ఈ పరిస్థితి నవంబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో రోజులు అత్యంత చల్లగా ప్రారంభం కావడంతో పాటు ఉష్ణోగ్రతలు 17 °C (63 °F) వరకు నమోదవుతుంటాయి.

ఇక నీస్‌లో చలికాలాల సమయంలో పగటి సమయాలు కొంచెం చలి చలిగా (11 to 17 °C (52 to 63 °F)) ఉండడంతో పాటు, చల్లటి రాత్రులు (4 to 9 °C (39 to 48 °F)) మరియు వివిధ రకాల వాతావరణ పరిస్థితులు చోటు చేసుకుంటాయి. రోజులనేవి ఆహ్లాదకరంగా మరియు పొడిగా లేదా తేమగా మరియు వర్షంతోనూ ఉండవచ్చు. మంచు అనేది అసాధారణ ఘటనగా మాత్రమే ఉండడంతో పాటు హిమపాతం అనేది అత్యంత అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటాయి, అందుకే అరుదుగా మాత్రమే సంభవించే హిమపాతాలను స్థానికులు ఒక ప్రత్యేక ఘటనగా గుర్తించుకోవడం జరుగుతుంటుంది. జనవరిలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత అనేది దాదాపు 5 °C (41 °F) వరకు నమోదవుతుంటాయి.

వసంత రుతువు కొద్దిపాటి చలితో మరియు వర్షంతో మార్చి చివర్లో ప్రారంభమవుతుంది, అదేసమయంలో ఇది జూన్ నాటికి వేడిగాను మరియు ఆహ్లాదకరంగా మారుతుంది.

Climate data for Nice
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 12.9 13.4 14.9 16.5 20.1 23.6 26.6 27.2 24.3 20.6 16.3 13.8 19.1
Daily mean °C (°F) 9.1 9.65 11.25 13.1 16.8 20.15 23.15 23.6 20.65 16.9 12.55 10.0 15.5
Average low °C (°F) 5.3 5.9 7.6 9.7 13.5 16.7 19.7 20.0 17.0 13.2 8.8 6.2 11.9
Precipitation cm (inches) 8.51 5.97 6.09 6.92 4.94 3.83 1.54 2.39 7.56 14.39 9.43 8.76 80.33
Avg. precipitation days 6.5 5.5 5.2 7.2 5.4 4.0 2.0 2.9 4.4 7.3 6.6 6.0 63
Mean monthly sunshine hours 148.8 156.6 201.5 228.0 269.7 297.0 341.0 306.9 240.0 204.6 156.0 151.9 2702
Source: World Meteorological Organization (UN),[14] Hong Kong Observatory[15] for data of sunshine hours

వృక్షసంపద మరియు భౌగోళిక స్థితిసవరించు

నీస్ యొక్క సహజసిద్ధ వృక్ష సంపద మధ్యదరా భూస్థితి నుంచి ప్రత్యేకంగా ఉంటుంది, విశాల పత్రాలు కలిగిన సతతహరిత పొదలు నీస్‌లో విస్తారంగా కనిపిస్తాయి. వృక్షాలనేవి నీస్ నగరం వ్యాప్తంగా చెల్లాచెదురుగా కనిపించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవి దట్టమైన అరణ్యాల రూపంలో దర్శనమిస్తాయి. హాల్మ్ ఓక్, స్టోన్ పైన్ మరియు ఆర్బుటస్ లాంటి సతతహరితాలతో పాటు అతిపెద్ద స్థానిక వృక్ష జాతులు ఇందులో భాగంగా ఉంటాయి. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రవేశపెట్టబడిన వృక్ష జాతులు ఇక్కడి పార్కులు మరియు గార్డెన్లలో పెరుగుతున్నాయి. పాం వృక్షాలు, యూకలిప్టస్ మరియు నిమ్మ ఫలాలు లాంటి వృక్ష జాతులు నైస్‌కు ఉపోష్ణమండల గుర్తింపును కల్పిస్తాయి. అయితే, ప్రపంచవ్యాప్త ఉష్ణ మండల ప్రాంతాల్లో బాగా సుపరిచితమైన వృక్ష జాతులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి; హార్స్ చెస్ట్‌నట్, లిండెన్‌లతో సహా నార్వే స్ప్రూస్ లాంటి జాతులు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

భౌగోళికంగా నీస్ రెండు అతిపెద్ద అఖాతాలను కలిగి ఉంది. విల్లేఫ్రెంచ్-సర్-మెర్ అనేది ఒక చుట్టబడిన అగాధంపై కొలవుదీరి ఉండగా, నగరానికి సంబంధించిన ప్రధాన భూభాగమంతా ఓల్ట్ పోర్ట్ సటీ మరియు ఏరోపోర్ట్ డీ కోట్ డీఅజూర్ అని పిలవబడే పూర్తిగా వంపు కలిగిన అగాధం మధ్య భాగంలో కొలువుదీరి ఉంది. చక్కగా పైకిలేచిన కొండల్లోకి విస్తరించిన సముద్రతీరం నుంచి ఈ నగరం విస్తరించింది, దీని తర్వాత నగరానికి సంబంధించిన మరో హద్దుగా చుట్టూ పర్వతాల మయమైన ప్రదేశం కన్పిస్తుంది, లిగురియన్ ఆల్ప్స్‌ శ్రేణి యొక్క దక్షిణ మరియు పశ్చిమ సామీప్యానికి ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి.

ఆర్థిక వ్యవస్థసవరించు

 
పురాతన పట్టణ దృశ్యం

చంబర్ డీ కామర్స్ ఎట్ డి'ఇండస్ట్రీ నీస్ కోట్ డీ'అజుర్‌లో నీస్ సభ్యత్వం కలిగి ఉంది. నీస్ - కోట్ డీ'అజుర్ ఎయిర్‌పోర్ట్ మరియు కేన్స్ - మండెలియు ఎయిర్‌పోర్ట్‌లను ఈ నగరం నిర్వహిస్తుంది, వీటితోపాటు పోర్ట్ ఆఫ్ నీస్‌నూ నిర్వహిస్తోంది.

ఫ్రాన్స్‌లో జాతీయ ఆసక్తి యొక్క రెండో మార్కెట్‌ నీస్ సొంతం, అలాగే దేశానికి చెందిన మొదటి పోర్ట్ సిమెంట్ తయారీదారుగా కూడా ఉంటోంది. దీంతోపాటు పెద్ద సంఖ్యలో మ్యూజియాలు మరియు హోటళ్లను కూడా ఈ నగరం కలిగి ఉంది.

కోట్ డీ'అజుర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ టీమ్ కోట్ డీ'అజుర్ సాయంతో ఫ్రాన్స్ మరియు విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులకు ప్రయోజనం సమకూరుతోంది.

ఇక పర్యాటకుల విషయానికి వస్తే, ప్యారీస్ తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రెండో ఫ్రెంచ్ నగరం ఇది, అదేసమయంలో ఎక్కువ దూరాలకు క్లిష్టమైన భౌగోళిక ప్రయాణం (ఆల్ప్ పర్వతాలు కొంతవరకు ఆక్రమించి ఉండడం వల్ల) కారణంగా ఈ నగరం ఫ్రాన్స్‌లోనే అత్యంత జనరద్దీ కలిగిన రెండో ఎయిర్‌ఫోర్ట్‌కు (2005లో దాదాపు 10,000,000 ప్రయాణీకుల సంఖ్యతో) సొంతదారుగా ఉంటోంది.

అలాగే నీస్‌లో ఒక కాన్ఫరెన్స్ కేంద్రం కూడా ఉంది: పలైస్ డెస్ కాంగ్రెస్ ఆక్రోపోలిస్ పేరుతో ఇది సుపరిచితమైంది. అలాగే ఎల్'ఎరేనాస్, నీస్ ది ప్లెయిన్, నీస్ మెరిడియా, సెయింట్ ఐసిడోర్, మరియు ది నార్తరన్ ఫోరంతో సహా ఈ నగరంలో అనేక వ్యాపార పార్కులు కూడా ఉన్నాయి.

వీటికితోడు, నైస్‌టాయిల్, నీస్ TNL, నైస్ లింగోస్టైర్, నార్తరన్ ఫోరమ్, సెయింట్-ఐసిడోర్, ది ట్రినిటీ (చుట్టూ అహుచన్ హైపర్‌మార్కెట్ కలిగి ఉంది) మరియు సెయింట్-లౌరెంట్-డు-వార్లోని Cap3000 లాంటి అనేక షాపింగ్ కేంద్రాలను కూడా ఈ నగరం కలిగి ఉంది.

సోఫియా యాంటీపోలిస్ అనేది ఒక టెక్నాలజీ పార్క్, ఇది యాంటీబెస్ యొక్క వాయువ్యంలో కొలువై ఉంది. ఈ పార్క్‌లో ఎక్కువ భాగం వల్బోన్ కమ్యునే పరిథిలో వ్యాపించి ఉంది. 1970 మరియు 1984 మధ్య కాలంలో స్థాపితమైన ఈ పార్క్‌లో ప్రధానంగా కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మకాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాలకు సంబంధించిన కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. W3C యొక్క ప్రధాన కేంద్రంతో సహా అనేక హైయ్యర్ లెర్నింగ్ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ పార్క్ స్థాపకులైన ఫ్రెంచ్ సెనేటర్ పియర్ లాఫిట్టే భార్య సోఫియే గిల్క్‌మ్యాన్-టుమార్కిన్ పేరు మీదుగా ఈ పార్క్‌కు నామకరణం చేయబడింది, అదేసమయంలో సందర్భోచితంగా సోఫియా అంటే జ్ఞానానికి అధిదేవత అనే అర్థం కూడా ఉండడం విశేషం. అలాగే యాంటిపోలిస్ నుంచి వచ్చిన ఈ పార్క్‌ పేరులోని రెండో అర్థభాగం సైతం యాంటిబీస్ యొక్క పురాతన గ్రీక్ పేరుకు సంబంధించింది.

రవాణాసవరించు

ఓడరేవుసవరించు

 
నీస్ ఓడరేవు

పోర్ట్ ఆఫ్ నీస్ అనేది లింపియా పోర్ట్‌గా సుపరిచితం. లింపియా ప్రవాహం కారణంగా ఈ పేరు వచ్చింది, మెర్షీ జోన్‌లో ఈ ప్రవాహం చిన్నపాటి తటాకాన్ని ఏర్పరచడంతో పాటు 1745లో అక్కడ ఓడరేవు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నేడు ఇది నీస్ యొక్క ప్రాథమిక హార్బర్ వ్యవస్థాపక ప్రదేశంగా ఉంటోంది - అలాగే కర్రాస్ జిల్లాలోనూ ఒక చిన్న పోర్ట్ వాడుకలో ఉంది.

ఈ పోర్ట్ ఫ్రాన్స్‌లోని మొట్టమొదటి సిమెంట్ తయారీదారుగా కూడా ఉంటోంది, వ్యాలీ ఆఫ్ పైలాన్ యొక్క రోలర్స్ యొక్క ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లతో సంబంధం కలిగి ఉన్న కారణంగా పోర్ట్‌కు ఈ ఘనత దక్కింది.

చేపల వేట కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఇక్కడ మత్య్యకారుల సంఖ్య 10 కంటే తక్కువగానే ఉంటోంది. కోర్సికాకు సమీపంలోని కాంటినెంటల్ ఫ్రాన్స్‌కు నీస్ నగరం కేంద్రంగా ఉంటోంది, NGV (నావిరేస్ ఏ గ్రాండే విటెస్ ) లేదా హై-స్పీడ్ క్రాఫ్ట్‌ల రాకతో ఈ ద్వీపానికి రవాణా సౌకర్యం ఏర్పడింది. రెండు కంపెనీలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి: ఇందులో ఒకటైన SNCM అనేది పాక్షికంగా ప్రభుత్వ రంగ సంస్థ కాగా, కోర్సికా ఫెర్రీస్ - సార్డీనియా ఫెర్రీస్ అనేది మాత్రం పూర్తిగా ప్రైవేటు కంపెనీగా ఉంటోంది. పోర్ట్‌కు ముందు భాగంలో కొలువైన కారణంగా, ప్లేస్ కాస్సినీ అనేది ప్లేస్ ఆఫ్ కోర్సికాగా పేరు మార్చుకుంది.

నీస్ కోట్ డీ'అజుర్ ఎయిర్‌పోర్ట్సవరించు

నీస్ కోట్ డీ'అజుర్ ఎయిర్‌పోర్ట్ (ఫ్రెంచి: Aéroport Nice Côte d'Azur) (IATA: NCEICAO: LFMN) అనేది నీస్‌లోని ఒక ఎయిర్‌పోర్ట్, ఆల్పెస్-మేరిటైమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్రాన్స్‌లో భాగంగా ఉంటోంది. ప్యారీస్‌లోని చార్లెస్ డీ గౌలే ఎయిర్‌పోర్ట్ మరియు ఓర్లీ ఎయిర్‌పోర్ట్‌ల తర్వాత ఫ్రాన్స్‌లోనే ఇది మూడో ముఖ్యమైన విమానాశ్రయం. ఎల్'ఎరేనాస్ సమీపంలోని ప్రొమెనడే డెస్ యాంగ్లస్‌పై ఉన్న ఈ విమానాశ్రయం రెండు టెర్మినల్స్‌ని కలిగి ఉంది. ఈ విమానాశ్రయం మొనాకోకు అత్యంత సామీప్యంలో ఉన్న కారణంగా, దానికి సంబంధించిన సిటీ-స్టేట్స్ ఎయిర్‌పోర్ట్‌గా కూడా సేవలందిస్తోంది, నగరానికి మరియు ఎయిర్‌పోర్ట్‌కు మధ్య హెలిక్యాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది.

చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు కోట్ డీ'అజుర్ ఇండస్ట్రీ ద్వారా ఇది నిర్వహించబడుతోంది.[clarification needed] దీని డైరెక్టర్ అయిన హెర్వే డీ ప్లేస్, కోట్ డీ'అజుర్ ఎయిర్‌పోర్ట్‌లకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు, కెన్నెస్ - మ్యాన్డెలీయు ఎయిర్‌పోర్ట్ కూడా ఇందులో భాగంగా ఉంటోంది. 2009లో 9,830,987 మంది ప్రయాణీకులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు.[16]

రైలు రవాణాసవరించు

నీస్-విల్లే అనేది ఇక్కడి ప్రధాన రైల్వే స్టేషన్. హై స్పీడ్ TGV రైలు ప్యారీస్ మరియు నీస్‌ల మధ్య దూరాన్ని 6 గంటల కంటే తక్కువ సమయంలో చేరుకుంటుంది, అదేసమయంలో మార్సియిల్లేను కేవలం 2.5 గంటల్లోనే చేరుకుంటుంది. అదేసమయంలో ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియం, మరియు రష్యాలతో నీస్ అంతర్జాతీయ సంబంధాలను కూడా కలిగి ఉంది.[17]

రోడ్డు మార్గంసవరించు

A8 ఆటోరూట్ మరియు రూట్ నేషనేల్ 7 అనేది నీస్ ఆగ్లోమెరేషన్ ద్వారా ప్రయాణించడం ద్వారా మార్సియిల్లేను ఇటలీతో కలుపుతుంది.

ప్రధాన దృశ్యాలుసవరించు

 
నీస్ వద్ద సముద్ర దృశ్యం, ఆల్ప్స్-మ్యారీటైమ్స్ విభాగం యొక్క రాజధాని
 
నెగ్రెస్కో హోటల్

ప్రొమినేడ్ డెస్ యాంగ్లస్ ("ప్రొమినేడ్ ఆఫ్ ది ఇంగ్లీష్") అనేది నీస్‌లోని మధ్యదరా సమద్ర అగాథమైన బే డెస్ ఏంజెస్‌తో పాటు ఉన్న ఒక సెలిబ్రేటెడ్ ప్రొమినేడ్‌గా ఉంటోంది. నీస్ పట్టణీకరణ చెందడానికి ముందు, నీస్‌ వద్ద ఉండే తీరం పెద్ద సంఖ్యలో గుళకరాళ్లతో నిండిన ఇసుక మైదానంగా ఉండేది. అదేసమయంలో మొదటగా ఇక్కడ ఏర్పడిన జనావాసాలు సైతం సముద్రానికి బాగా దూరంగా ఎత్తైన ప్రదేశాల్లోనే ఏర్పడ్డాయి.

18వ శతాబ్దం రెండో అర్ధభాగంతో ప్రారంభించి అనేకమంది ధనిక అంగ్లేయులు నీస్ తీరంలో ఉండే ప్రకృతి దృశ్యాన్ని తిలకిస్తూ తమ చలికాలాన్ని ఇక్కడ గడపడం ప్రారంభించారు. ఉత్తరాన తీవ్రమైన చలికాలం నెలకొన్న సమయంలో అక్కడున్న యాచకులు నీస్‌లోకి వలసవస్తారు, కొంతమంది ధనిక ఆంగ్లేయులు వారికోసం ఉపయోగకర ప్రాజెక్ట్‌ని ప్రతిపాదించడమే అందుకు కారణం: సముద్రం వెంబడి ఒక నడకదారి (చెమిన్ డీ ప్రొమెనేడ్ ) నిర్మాణం చేపట్టడమే ఆ ప్రతిపాదన.

నీస్ నగరం ఆహ్లాదకరమైన ప్రొమెనేడ్ దృశ్యంతో జతచేరడమనేది పని అవకాశాన్ని బాగా ఎక్కువ చేసింది. ఈ ప్రొమెనేడ్‌ను మొదట్లో కామిన్ డీ యాంగ్లెస్ (ది ఇంగ్లీష్ వే) అని నికోయిస్ ద్వారా స్థానిక భాష అయిన నిస్సార్ట్‌లో సంబోధించడం జరిగింది. అయితే 1860లో ఫ్రాన్స్‌తో నీస్ జతచేరిన తర్వాత ఈ పేరును లా ప్రొమెనేడ్ డెస్ యాంగ్లీస్ అని మార్చడం జరిగింది, అంతకుముందు నిస్సార్ట్ భాషలో ఉన్న పేరును ఫ్రెంచ్ భాషలోకి అనువదించడం ద్వారా ఈ మార్పు చేయడం జరిగింది.

ప్రొమెనేడ్‌పై డెస్ యాంగ్లీస్‍‌పై ఉండే హోటల్ నెగ్రెస్కో పేరును అటుపై (1868–1920) హెన్రీ నెగ్రెస్కోగా మార్చడం జరిగింది, ప్యాలెస్ హోటల్‌ను కలిగి ఉండే దీన్ని 1912లో నిర్మించారు. ఆ సమయంలో ఉండే నిబంధనలను పరిగణలోకి తీసుకుని 1913లో మొదటగా నెగ్రెస్కోను ప్రారంభించిన సమయంలో దాని ముందరి భాగాన్ని మధ్యదరా సమద్రానికి అభిముఖంగా ఉండేలా ఏర్పాటు చేశారు.

ఇక ప్రొమెనేడ్ డెస్ యాంగ్లీస్‌తో పాటుగా పక్కనే వెళ్లే మరో చిన్ని వీధి సైతం ముఖ్యమైనదే, నేస్ యొక్క దిగువపట్టణం వైపుగా ఇది దారితీస్తుంది, ఇది ప్లేస్ మస్సేనా వద్ద ప్రారంభమై, 4 బ్లాకుల మీదుగా విమానాశ్రయం వైపుకు సాగిపోయే ఈ మార్గం ప్రొమెనేడ్‌కు సమాంతరంగా సాగుతుంది. ఈ భాగంలో ఉండే నగరాన్ని "జోన్ పియటన్", లేద్ "పెడెస్ట్రెయిన్ జోన్" అని పిలుస్తుంటారు. ఇక్కడ కార్ల ప్రవేశాన్ని నిషేధించడం వల్ల ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ పర్యాటకుల కోసం అనేక రెస్టారెంట్లు కొలువుదీరి ఉన్నాయి, ఇవన్నీ కూడా నికోయిస్ వంటకాలకు మరియు వివిధ రకాల విదేశీ రుచులకు పెట్టింది పేరుగా వర్థిల్లుతున్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో కెఫేలు కూడా దర్శనమిస్తాయి, ఇక్కడ కూర్చుని ఎస్‌ప్లెస్సో లేదా వివిధ రకాల ప్రత్యేక కాఫీలైన గెలాటీ మరియు డెసెర్ట్‌లను ఎంచుకుని ఆస్వాదించవచ్చు, అలాగే నడుస్తూ నగర అందాలను వీక్షించవచ్చు. వీటితోపాటు దుస్తులు, షూలు మరియు జ్ఞాపక చిహ్నాలను విక్రయించే చిన్నపాటి దుకాణాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.

నగరంలోని ఇతర కూడళ్లు:

 • చాటౌ
 • మౌన్‌మెంట్ ఆక్స్ మార్ట్స్
 • ది పోర్ట్
 • కోర్స్ సలేయా
 • జర్డిన్ బొకే డీ లా విల్లే డీ నీస్ (బొటానికల్ గార్డెన్)
 • మ్యూస్ మస్సెనా
 • మార్చే ఆక్స్ ఫ్లీయర్స్
 • ఓల్డ్ నీస్
 • గ్రాండ్ హోటల్ ఇంపీరియల్
 • ఫోర్ట్ డూ మాంట్ ఆల్బన్

కూడళ్లుసవరించు

ప్లేస్ మెస్సెనాసవరించు

 
ప్లేస్ మస్సేనా దృశ్యం

ప్లేస్ మస్సెనా అనేది ఈ నగరంలోని ప్రధాన కూడలి. పైలాన్ నది ప్రవహించడం వల్ల, పురాతన నగరానికి మరియు కొత్త నగరానికి మధ్య ప్రయాణానికి పాంట్-నెఫ్ మాత్రమే వీలు కల్పిస్తుంది. కాబట్టే ఈ కూడలిని 1824లో రెండు భాగాలు (ఉత్తర మరియు దక్షిణ)గా విభజించారు. 1979లో మస్సెనా క్యాసినోను కూలగొట్టడంతో, ప్లేస్ మస్సెనా అనేది మరింత విశాలంగా మరియు తక్కువ రద్దీ కలిగిన ప్రదేశంగా మారింది, ప్రస్తుతం ఈ మార్గానికి ఇరువైపులా ఇటాలియన్ వాస్తుకళతో కూడిన ఎర్రటి భవనాలు కొలువుదీరి కనిపిస్తాయి.

ఇటీవల ట్రామ్‌లైన్‌ను పునఃనిర్మించిన కారణంగా ఈ కూడలిలో పాదచారులకు ప్రాధాన్యం తగ్గడంతో పాటు ఒక నిజమైన మధ్యదరా సముద్ర కూడలిగా దీని హోదా మళ్లీ పునఃస్థాపితమైనట్టైంది. ప్రస్తుతం పాం వృక్షాలు మరియు స్టోన్ ఫైన్ చెట్లు లాంటివి ఈ మార్గం వెంబడి కొలువుదీరాయి, గతంలో చాలా ఏళ్లపాటు ఉంటూ వచ్చిన దీర్ఘచతురస్త్రాకార గుండ్రటి విశ్రాంతి ప్రదేశాలకు బదులుగా ఇవి ఏర్పాటయ్యాయి. దాని నిర్మాణాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్లేస్ మస్సేనా అనేది ఎల్లప్పుడూ గొప్పగొప్ప ప్రజా కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. సంగీత విభావరులు మరియు ప్రత్యేకించి వేసవి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరిలో జరిగే కోర్సో కార్నవాలెస్కూ (కార్నివాల్ పెరేడ్) లాంటి వాటికోసం దీన్ని ఉపయోగించడంతో పాటు, జూలై 14న జరిగే సైనిక ఊరేగింపు (బాస్టిల్ డే) లేదా ఇతర సంప్రదాయ వేడుకలు మరియు విందులకు ఇది ఉపయోగపడుతోంది.

ప్రొమెనేడ్ డెస్ యాంగ్లీస్, పురాతన నగరం, టౌన్ సెంటర్, మరియు ఆల్బెర్ట్ ఐ గార్డెన్ (జర్డిన్ ఆల్బెర్ట్ ఐయిర్ )ల నుంచి కేవలం రెండు నిమిషాల నడకతో ప్లేస్ మస్సేనా చేరవచ్చు. నగరంలోని అనేక ప్రధాన మార్గాలకు మరియు దీనికి మధ్య పెద్ద సంఖ్యలో కూడళ్లు ఉన్నాయి: అవెన్యూ జీన్ మెడెసిన్, అవెన్యూ ఫెలిక్స్ ఫ్యూర్, బౌల్‌వర్డ్ జీన్ జౌరీస్, అవెన్యూ డీ వెర్డన్ మరియు ర్యూ గియోఫెర్డో లాంటివి ఈ కోవలోకే వస్తాయి.

ప్లేస్ గారిబాల్డిసవరించు

 
ప్లేస్ గారిబాల్డీ, నీస్ ట్రామ్‌వే ప్రారంభమైన నాటినుంచి పాదచారుల మార్గం

ప్లేస్ గారిబాల్డి సైతం వాస్తుకళ మరియ చరిత్రకు సంకేతంగా నిలుస్తోంది. ఇటాలియన్ ఏకీకరణకు కారకుడైన గియుసెపే గారిబాల్డి (పీడ్‌మోంట్-సార్డీనియా రాజ్యంలో భాగం కావడానికి ముందు, నెపోలియోనిక్ సామ్రాజ్యంలో నీస్ ఒక భాగంగా ఉన్న సమయంలో 1807లో నైస్‌ నగరంలో జన్మించాడు) పేరు మీదుగా దీనికి నామకరణం జరిగింది. 18వ శతాబ్దం చివర్లో నిర్మితమైన ఈ కూడలి నగరానికి ప్రవేశ మార్గంగాను మరియు టురిన్‌కు దారితీసే రోడ్డుకు ముగింపుగాను సేవలందిస్తోంది. 1780 మరియు 1870 మధ్య కాలంలో ఈ కూడలి అనేకపేర్లు (ప్లాకా పైరౌలియేరా, ప్లేస్ డీ లా రిపబ్లిక్, ప్లేస్ నెపోలియన్, ప్లేస్ డి'ఆర్మ్స్, ప్లేస్ సెయింట్-అగస్టీన్, పియాజ్జా విట్టోరియో) వాడుకలో ఉన్నప్పటికీ, చివరకు 1870 సెప్టెంబరులో ప్లేస్ గారిబాల్డి పేరును స్థిరం చేశారు.

నీస్‌ను ఇటలీతో ఏకీకరణ చేసేందుకు అత్యంత కఠినంగా ప్రయత్నించిన గారిబాల్డి విగ్రహం ఈ కూడలి మధ్య భాగంలో కొలువుదీరి ఉంటుంది. ఈ కూడలిలో దాదాపు ఎక్కువ భాగాన్ని పాదచారులకే కేటాయించే దిశగా ట్రామ్‌వేని నిర్మించడం కోసం ఇటీవల ఈ ప్రాంతాన్ని పునఃనిర్మించారు, టురిన్ నమూనాతో ఈ వరుసలో వాస్తునిర్మాణం చేపట్టారు, టురిన్ అనేది హౌస్ ఆఫ్ సవోయ్ రాజ్య వ్యాప్తంగా పట్టణ పునఃసృష్టి నియమావళిని అనుసరిస్తుంది.

ఇది వియూక్స్ నీస్ (పురాతన పట్టణం) మరియు టౌన్ సెంటర్ మధ్య ఏర్పడిన నాలుగు రోడ్ల కూడలిగా ఉంటుంది. నీస్‌కు చెందిన తూర్పు ప్రాంత జిల్లాలైన పోర్ట్ లింపియా (లింపియా హార్బర్), మరియు TNL వాణిజ్య కేంద్రాలకు ప్లేస్ గారిబాల్డీ చాలా దగ్గరగా ఉంటుంది. అనేక ముఖ్యమైన వీధులకు ఈ కూడలి ఒక కేంద్రం: బౌలివార్డ్ జీన్-జౌరెస్, అవెన్యూ డీ లా రిపబ్లిక్, ర్యూ క్యాసిని మరియు ర్యూ క్యాథరిన్-సెగురేన్ లాంటివి ఈ కోవలోకే వస్తాయి.

ప్లేస్ రోసెట్టిసవరించు

 
క్యాథ్రడేల్ సెయింట్ రెపరేట్

పూర్తిగా పరివేష్టితమైన మరియు పాదచారుల కోసం ఉద్దేశించిన ఈ కూడలి పురాతన పట్టణం నడిబొడ్డున కొలువై ఉంది. ఎరుపు మరియు పసుపు జేగురు రంగులోని ప్రత్యేకమైన భవనాలు ఈ కూడలి చుట్టూ నిర్మితమై ఉంటాయి, క్యాథడ్రేల్ సెయింట్-రెపరేట్ మరియు కేంద్ర భాగంలో ఫౌంటేన్ లాంటి వాటిని కలిగిన ప్లేస్ రోసెట్టి పురాతన పట్టణంలో తప్పక చూడాల్సిన ప్రదేశం. పగటిపూట ఈ ప్రదేశం వ్యాప్తంగా సంప్రదాయ రెస్టారెంట్లకు సంబంధించిన టెర్రస్‌లు మరియు అత్యుత్తమ ఐస్‌క్రీం తయారీ సంస్థలు ఆక్రమించుకుని ఉంటాయి. ఇక రాత్రి సమయంలో ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది, పర్యాటకులు మరియు యువత ఈ కూడలికి పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో పాటు వారి సంగీత విభావరి కార్యక్రమాలతో ఈ చిన్ని కూడలిలోని గోడలు ప్రతిధ్వనించడం మొదలవుతుంది. ఈ కూడలిలో రాత్రిపూట చోటు చేసుకునే కాంతి ఒక అద్భుత దృశ్యాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది.

ప్లేస్ రోసెట్టి అనేది పురాతన పట్టణంలో కేంద్రస్థానంలో ఉంటుంది, జీసస్, రోసెట్టి, మాస్కోయ్‌నాట్ మరియు పాంట్-వియూక్స్ (పురాతన వంతెన) లాంటివి ఇక్కడి వీధులు.

కోర్స్ సలేయాసవరించు

 
సలేయ కోర్స్ (2007)

కోర్స్ సలేయా అనేది క్యాయ్ డెస్ ఎటాట్స్-యునిస్‌కు సమాంతరంగా కొలువై ఉంది. గతంలో ఈ ప్రాంతం ఉన్నత తరగతుల వారి నివాసంగా ఉండేది. ఇక్కడ ప్రతిరోజూ పూల మార్కెట్ నిర్వహించబడడం వల్ల ఇది అత్యంత సంప్రదాయ కూడలిగా ఉంటోంది. కోర్స్ సలేయా సైతం పలైస్ డెస్ రాయిస్ సర్డెస్ (సార్డీనియా రాజుల సౌధం)పై తెరుచుకుంటుంది. ప్రస్తుతం కోర్ట్ అనేది చాలావరకు వినోద ప్రదేశంగా ఉంటోంది. విలక్షణమైన నికోయిస్ వంటకాలను అందించే చక్కని రెస్టారెంట్లు, మార్కెట్లు మరియు అనేక పబ్‌లు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. నీస్‌లోని అత్యంత చూడచక్కని ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ప్లేస్ డూ పలైస్సవరించు

 
రుస్కా ప్యాలేస్ యొక్క ప్లేస్ డు పలైస్ దృశ్యం

దీని పేరు సూచించినట్టుగానే, ప్లేస్ డూ పలైస్ అనేది నీస్ యొక్క పలైస్ డే జస్టీస్ (లా కోర్ట్స్)లో కొలువై ఉంది. ఈ కూడలిపై పలైస్ రస్కా ఉంది, ఇది సైతం జస్టీస్ డిపార్ట్‌మెంట్ (ట్రిబ్యునల్ డే గ్రనేడ్ ఇన్‌స్టాన్స్ హోమ్)కు సొంతమైనదే.

సిటీ క్లాక్‌ని కలిగి ఉండడం వల్ల ఈ కూడాలి సైతం గుర్తించదగినదే. ప్రస్తతరోజుల్లో, ప్లేస్ డూ పలైస్ పగలు మరియు రాత్రి సైతం సజీవంగా ఉంటోంది. ఈ కూడలి ప్రత్యేకించి యువతచే ప్రశంసించబడుతోంది, పలైస్ డే జస్టీస్‌కు దారితీసే మెట్లపై తరచూ ఆల్కహాల్ సహిత పానీయాలతో తూళుతూ కనిపించే యువతకు ఇక్కడ కొదవలేదు. ఈ ప్రదేశంలో భారీపరిమానంలో ఉండే ఓపెన్-ఎయిర్ బార్ లేనప్పటికీ, సంగీత కచేరీలు, సినిమాలు మరియు వివిధ కార్యక్రమాలు తరచూ జరుగుతుంటాయి.

కౌర్ సలేయా మరియు ప్లేస్ మస్సేనా ల మధ్య ఇది హాఫ్‌వే కలిగి ఉంది.

మతంపరంగాసవరించు

దస్త్రం:La Cathedrale Orthodoxe Russe Saint-Nicolas.jpg
రష్యన్ ఆర్థోడక్స్ క్యాథెడ్రల్, నీస్
 • సెయింట్-రెపరేట్ క్యాథడ్రల్, 17వ శతాబ్దం
 • సెయింట్-జాక్‌క్యూస్ చర్చ్, 17వ శతాబ్దం
 • రష్యన్ ఆర్థోడక్స్ క్యాథడ్రల్, నీస్
 • నాట్రే-డేమ్ డి నీస్
 • సెయింట్ జేన్ డి'ఆర్క్ చర్చ్, 20వ శతాబ్దం

క్రీడలు మరియు వినోదంసవరించు

 • స్టేడ్ డు రే
 • స్టేడ్ ఛార్లెస్-ఎహర్‌మాన్
 • పలైస్ నైకాయియా
 • నీస్ జాజ్ ఫెస్టివల్

జనాభాసవరించు

INSEE అంచనాల ప్రకారం, 2005 జనవరి 1 నాటికి నీస్‌లో నివసిస్తున్న జనాభా మొత్తం347,900. జనాభాపరంగా నీస్ అనేది ఫ్రాన్స్‌లోని ప్యారీస్, మార్‌సెయిల్స్, లయన్ మరియు టులూస్‌ల తర్వాత ఐదో అతిపెద్ద నగరంగా ఉంటోంది. INSEE వివరాల ప్రాకారం, నీస్ మహానగరమనేది 888,784 నివాసులను (ఫ్రాన్స్ ఐదవ అత్యంత ఆదరణ కలిగిన నగరం) కలిగి ఉండడంతో పాటు దాని పట్టణ ప్రాంతంలో 933,080 నివాసులను కలిగి ఉంది, తద్వారా ఇది ఫ్రాన్స్‌లో ఆరవ అతిపెద్ద నగరంగా నిలుస్తోంది.

19వ శతాబ్దం రెండో అర్థభాగంలో ఈ నగరం పెద్ద జనాభా పెరుగుదలను నమోదు చేసింది, ప్రధానంగా ఫ్రెంచ్ వలసల కారణంగా ఈ సమయంలో నగర జనాభా రెట్టింపు కంటే ఎక్కువైంది. 20వ శతాబ్దం ప్రారంభంలో కంట్రీ ఆఫ్ నీస్ నుంచి అంతర్గత వలసల కారణంగా ఈ జనాభా పెరుగుదల అనేది మరింత ఉదృతమైంది.[ఉల్లేఖన అవసరం]

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఈ నగరంలో జనాభా పెరుగుదల ఊపందుకుంది. ఈ పెరుగుదలకు సైతం వలసలే ముఖ్యకారణంగా నిలిచాయి. హోటల్ పరిశ్రమ మరియు నిర్మాణ పరిశ్రమ లాంటివి 1920లలో పూర్తిస్థాయి బలాన్ని ప్రదర్శించాయి, ఈ విధంగా ప్రపంచాన్ని మరింత మరింతగా ఆకర్షించడం ద్వారా త్వరలోనే నీస్ ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన నగరంగా ఉద్భవించింది. 1921లో ఫ్రాన్స్‌లో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన పదకొండవ నగరంగా నిలిచిన నీస్, అటుపై 1931లో ఎనిమిద నగరంగాను, 1946లో ఆరవ నగరంగాను ర్యాంకు సాధించింది; అటుపిమ్మట ఫ్రెంచ్ పౌరులతో సహా అల్జీరియా నుంచి అరవై వేలమంది నైస్‌కు తరలిరావడంతో ఈ నగరం ప్రస్తుత జనాభా గణాంకాలకు చేరుకుంది.[ఉల్లేఖన అవసరం]

1970ల నుంచి ఇక్కడి నివాసుల సంఖ్యలో గుర్తించదగ్గ మార్పు చోటు చేసుకోలేదు; జనాభాలో చోటుచేసుకున్న సహజసిద్ధ ప్రతికూల వృద్ధి ద్వారా నైస్‌కు పెద్ద సంఖ్యలో వచ్చిన వలసలకు పరిహారం చెల్లించినట్టైంది. నైస్‌లో వయసుమళ్లిన జనాభాకు కొదవలేదు.[ఉల్లేఖన అవసరం]

ప్రస్తుతం నగరానికి సంబంధించిన జనాభా మరొకసారి పెరుగుదలబాట పట్టింది, వాతావరణానికి ప్రాధాన్యమివ్వడమే ఇందుకు కారణం.[ఉల్లేఖన అవసరం] 2008లో 360,000 పౌరులను కలిగిన నీస్ నగరం, 2012 నాటికి 370,000 జనాభాను కలిగి ఉండనుంది.[ఉల్లేఖన అవసరం]

నీస్ అబ్జర్వేటరీసవరించు

 
బిస్‌చోఫెషీమ్ గుమ్మటం దృశ్యం, నీస్ అబ్జర్వేటరీలో ఇదొక ప్రధాన గుమ్మటం

అబ్జర్వేటైర్ డి నీస్ (నీస్ అబ్జర్వేటరీ) అనేది సమిత్ ఆఫ్ మౌంట్ గ్రాస్‌పై నెలకొని ఉంది. బ్యాంకర్ ర్యాపియల్ బిస్కోఫ్‌షీమ్ ద్వారా 1879లో ఈ అబ్జర్వేటరీ (నక్షత్ర వేధశాల) ప్రారంభమైంది. ఛార్లెస్ గార్నియర్ ఈ నిర్మాణానికి ఊపిరిపోయగా, గస్టేవ్ ఐఫెల్ ప్రధాన గుమ్మటానికి రూపకల్పన చేశారు.

76-సెం.మీ (30-అంగుళాల) రెఫ్రాక్టర్ టెలిస్కోప్ అనేది ఇక్కడ 1888లో ఇక్కడ పనిచేయడం ప్రారంభించింది, ఆసమయంలో ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెలిస్కోప్‌గా నమోదైంది. ఏడాదిపాటు ఇది పనిచేసిన తర్వాత, 36-అంగుళాల (91-సెం.మీ) రెఫ్రాక్టర్‌ను శాంటా క్రూజ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భాగమైన లైక్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేశారు..

అయితే, ఒక శాస్త్రీయ సంస్థగా నీస్ అబ్జర్వేటరీ ఎక్కువకాలం ఉనికి నిలవలేదు. అబ్జర్వేటైర్ డి లా కోట్ డి'అజుర్‌ను ఏర్పాటు చేయడం కోసం 1988లో దీన్ని CERGAలో విలీనం చేశారు.

సంస్కృతిసవరించు

ప్రపంచంలోని పురాతన మానవ నివాసాల కేంద్రాల్లో నీస్ కూడా ఒకటి. లోయర్ పాలియోలిథిక్ కాలానికి చెందిన టెర్రా-అమాట అనే ఒక పురావస్తుశాస్త్ర ప్రదేశం నీస్ సమీపంలో కొలువై ఉంది. పురాతనకాలంలో గ్రీకుల ద్వారా నీస్ స్థాపితమైంది. దానికి గుర్తుగా నీస్‌కు సమీపంలో సెమెనెలమ్ అనే ఒక స్వతంత్ర రోమన్ నగరం ఉనికిలో ఉంది, సిమియేజ్ హిల్ అనేది ఇక్కడ ఉంది. ఇది సంపదతో నిండిన ఒక పురావస్తు ప్రదేశం, ఇక్కడ కేవలం ఒక చిన్నభాగంలో మాత్రమే తవ్వకాలు జరపడం జరిగింది. ఇలా తవ్వకాలు జరిపిన ప్రదేశంలో వేడినీటి స్నాన ఘట్టాలు, క్రీడా క్షేత్రాలు మరియు రోమన్ రోడ్ లాంటివి వెలుగుచూశాయి.

రెండవ శతాబ్దం AD నుండి, చాగల్, మాటిస్సే, నికీ డి సెయింట్ ఫల్లే, మరియు ఆర్మన్ లాంటి అనేకమంది చిత్రకారులను ఈ నగర కాంతి ఆకర్షించింది, అలాగే వివిధ దేశాలకు చెందిన కళానిపుణులు మరియు మేధావులైన బెర్లియోజ్, నీట్జెస్, రోసినీ మొదలుగు వారిని సైతం ఈ నగరం ఆకర్షించింది.

మరోవైపు అన్ని అంశాలకు సంబంధించిన మ్యూజియాలు నీస్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి: మ్యూసీ చాగల్, మ్యూసీ మటిస్సే (సీమియేజ్ క్రీడాక్షేత్రాలు కలిగిన రోమన్ శిథిలాలు), మ్యూసీ డెస్ బియాక్స్-ఆర్ట్స్ జూల్స్ చెరెట్, నైవే ఆర్ట్స్ మ్యూజియం, మ్యూసీ టెర్రా-అమాట, ఏసియన్ ఆర్ట్ మ్యూజియం, మోడరన్ ఆర్ట్ మ్యూజియం మరియు బాగా సుపరిచితమైన ఎకోల్ ఆఫ్ నీస్ ”) లాంటి వాటికి ప్రాధాన్యమిచ్చే సమకాలీన ఆర్ట్, నేచురల్ హిస్టరీ మ్యూజియం, మ్యూసీ మస్సేనా, నావల్ మ్యూజియం మరియు గ్యాలరీ డెస్ పాంచెట్స్ లాంటివి ఇక్కడున్నాయి.

మరోవైపు విహారయాత్ర రిసార్ట్‌గా సేవలందిస్తున్న నీస్, ఏడాది పూర్తిగా అనేక ఉత్సవాలకు ఆతిథ్యమిస్తుంటుంది, కార్నవాల్ డి నీస్ మరియు నీస్ జాజ్ ఫెస్టివల్ లాంటివి ఇందులో ముఖ్యమైనవి.

అద్వితీయమైన చరిత్ర కారణంగా నీస్ నగరం ఒక విశిష్టమైన సంస్కృతిని కలిగి ఉంది. స్థానిక భాష అయిన నికార్డ్ (నిస్సార్ట్) అనేది ఒక ఆక్సిటన్ మాండళీకం (అయితే కొందరు ఇటాలియన్ పరిశోధకులు మాత్రం ఇది ఒక లిగురియన్ మాండళీకం అని వాదిస్తుంటారు). గుర్తించబడిన సంఖ్యలో ప్రజలు ఈ భాషను నేటికీ మాట్లాడుతున్నారు. పటిష్టమైన ఇటాలియన్ మరియు (తక్కువ విస్తీర్ణం) కోర్సికాన్ ప్రభావాల కారణంగా ఈ ప్రాంతంలోని ఇతర మాండలీకాల కంటే ఈ మాండలీకం సజీవంగా ఉండేందుకు మరింత అవకాశం కల్పిస్తున్నాయి.

గతంలో, ఇటలీ నుంచి వచ్చే వలసదారులు (వీరు నీస్ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచారు), మాత్రమే కాకుండా స్పానీష్ మరియు పోర్చుగీస్ వలసదారులను కూడా నీస్ స్వాగతించింది. అయినప్పటికీ, గడచిన కొన్ని దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్త దేశాల నుంచి వచ్చే వలసదారులకు కూడా నీస్ ద్వారాలు తెరిచింది, ప్రత్యేకించి మాజీ ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికన్ కాలనీలు, అలాగే ఆగ్నేయాసియాల నుంచి వచ్చేవారికి నీస్ ప్రధాన వేదికగా మారింది. ప్రత్యేకించి జానపద సంగీతం మరియు నృత్యాల్లో సంప్రదాయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఫారన్డోల్ అనేది ఇక్కడ విశేష ఆదరణ కలిగిన నృత్యంగా వర్థిల్లుతోంది.

వంటకాలుసవరించు

నీస్‌లో వంటకాలనేవి ప్రత్యేకించి ప్రొవియెన్స్‌కు సామీప్యంగా ఉంటాయి, అయితే లిగురియా మరియు పైమాంట్‌లకు చెందిన రుచులు కూడా అందుబాటులో ఉంటాయి, అలాగే స్థానిక పదార్థాలు (ఆలీవ్ ఆయిల్, ఆన్‌చోవిస్, పండ్లు మరియు కూరగాయలు) ఉపయోగించడమే కాకుండా, బాగా దూరంగా ఉండే ప్రాంతాలైన ప్రత్యేకించి ఉత్తర యూరప్ నుంచి వచ్చే పదార్థాలు సైతం ఇక్కడి వంటకాల్లో చోటు చేసుకుంటాయి, ఆలీవ్ ఆయిల్‌ను తీసుకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చే నౌకలు ఎండిన హడ్డాక్ లాంటి ఆహారపదార్ధాలను నింపుకుని రావడమే ఇందుకు కారణం.

నీస్ కొన్ని స్థానిక వంటకాలను కూడా కలిగి ఉంది. ఉల్లిపాయలు మరియు ఆంకోవీస్‌ (లేదా ఆంకోవే గుజ్జు)తో చేసే "పిసలైడియర్" అనే ఇక్కడి స్థానిక వంటకం పుల్లని రుచితో లభిస్తుంది. ఇక సోకా అనేది ఒక రకమైన పాన్‌కేక్, ఇది ముడిశెనగలు పొడి నుంచి తయారవుతుంది. ఫార్కిస్ నికోయిస్ అనే వంటకం కూరగాయలతో పాటుగా బ్రెడ్‌క్రూమ్జ్స్‌ సహితంగా ఉంటుంది; అలాగే సలాడ్ నికోయిస్ అనేది ఒక టమోటా సలాడ్, ఇది పచ్చ మిరియాలతో తయారయ్యే "కార్న్" రకం వంటకం, ఉడికించిన గుడ్లు, టూనా లేదా ఆంకోవీస్ మరియు ఆలీవ్‌లు ఇందులో ఉంటాయి.

స్థానికంగా లభించే మాంసం సమీపంలో ఉండే లోయల నుంచి వస్తుంది, సిస్టెరాన్ అనే గొర్రెల నుంచి ఈ మాంసం సేకరించడం జరుగుతుంది. ముల్లెట్స్, బ్రీమ్, సముద్ర అర్చిన్‌లు, మరియు ఆంకోవీస్ (ఆలివిన్స్) లాంటి స్థానిక చేపలు పెద్ద మొత్తంలో వినియోగించబడుతాయి, చేపలను ఇక్కడ పెద్ద మొత్తంలో ఉపయోగించడం ద్వారా "చేపలు సముద్రంలో పుట్టి నూనెలో మరణిస్తాయి"[ఉల్లేఖన అవసరం] అనే సామెత స్థానికంగా ప్రచారంలో ఉంది.

నికోయిస్ ప్రత్యేకతలకు కిందివి కూడా ఉదాహరణలుగా ఉన్నాయి:

 • బెనీజ్ డి ఫ్లర్స్ డి కోజెట్
 • రాటటౌల్లె
 • పికాక్ష్
 • పిస్సాలడియర్
 • పాన్-బాగ్నాట్
 • సొక్క
 • సుపె ఆ పీస్టు
 • టోర్ట్ డి పాల్లెట్స్
 • డోబ్
 • ఫాసిస్
 • సాలడ్స్ నిస్వాస్

విద్యసవరించు

 • యునివర్సిటీ అఫ్ నీస్ సోఫియా అంటిపోలిస్
 • యునివర్సిటీ పియర్స్ యట్ మారి క్యురీ
 • ఇన్స్టిట్యుట్ యురాటం
 • నికోల్ డెస్ హేట్స్ ఎటూడ్స్ కమర్షల్స్ డు నోర్డ్
 • విల్లా ఆర్సన్
 • ESRA ఫిలిం

స్కూల్

అంతర్జాతీయ సంబంధాలుసవరించు

నీస్‌తోజంటగా మారినవి:

యాక్టివ్ జంటలుసవరించు
ఇతర జంటలుసవరించు
స్నేహపూర్వక వొడంబడికసవరించు
 •   జియామెన్, చైనా
 •   నాడర్, మొరోక్కో

ప్రముఖులుసవరించు

 • మాన్సూర్ అస్సూమని - ఫుట్‌బాల్ ఆటగాడు
 • జోహన్ ఆడెల్ - ఫుట్‌బాల్ ఆటగాడు
 • థెర్రీ ఆడెల్ - ఫుట్‌బాల్ ఆటగాడు
 • సూర్య బొనాలీ - ఫిగర్ స్కేటర్
 • హ్యూగో ఎల్‌లోరిస్ - ఫుట్‌బాల్ ఆటగాడు
 • ఫ్రాంక్ మాటిన్గ్యూ - ఫుట్‌బాల్ ఆటగాడు
 • యాస్సిన్ మౌటౌవోవకిల్ - ఫుట్‌బాల్ ఆటగాడు
 • గిల్లెస్ సిమోన్ - టెన్నిస్ ఆటగాడు

వీటిని కూడా చూడండిసవరించు

 • కౌంటి అఫ్ నీస్
 • ఆల్బర్ట్ స్పాగియారీ
 • రోమన్ క్యాథలిక్ డయోసిస్ అఫ్ నీస్
 • నీస్ కార్నివాల్
 • నీస్ ముట్టడి
 • సిమేటియేర్ డు చాటెయూ
 • సిమియేజ్
 • యురోపియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ హై ఇంటర్నేషనల్ స్టడీస్
 • OGC నీస్
 • రగ్బీ నీస్ సైట్ టేజర్ యునివర్సిటీ-రేసింగ్
 • ప్యారీస్ –నీస్
 • నీస్ ఒప్పందం
 • లీ మెరిడియన్
 • నిస్సా లా బెల్ల
 • కమ్యూనెస్‌ అఫ్ ది ఆల్పెస్-మ్యారీటైమ్స్ డిపార్ట్‌మెంట్
 • 37వ G8 సమావేశం

సూచనలుసవరించు

 1. డెమోగ్రాఫియా: వరల్డ్ అర్బన్ ఏరియాస్, మార్చి 2010
 2. Ruggiero, Alain, సంపాదకుడు. (2006). Nouvelle histoire de Nice. Toulouse: Privat. pp. 17–18. ISBN 978-2708983359.
 3. Luc, Thevenon (1993). Nice, cité d'histoire, ville d'art. Nice: Serre. ISBN 978-2864101956.
 4. అలైన్ రుగీరో, op. cit., పుట. 137
 5. నీస్, ఫ్రాన్స్ ట్రావెల్. Archived 2011-04-17 at the Wayback Machine.నీస్‌కు ఘనమైన మార్గదర్శి Archived 2011-04-17 at the Wayback Machine.
 6. అన్ సేవియర్-ఫైర్ ఎట్ అన్ ఎక్విప్‌మెంట్ కంప్లీట్ ఎన్ మ్యాటియర్ డి'ఆక్యూల్ Archived 2009-02-24 at the Wayback Machine., సైట్ డి లా CANCA
 7. లెస్ చిఫ్‌రెస్ క్లెస్ డు టూరిజం ఏ నీస్, సైట్ మున్సిపల్
 8. "యూనియన్ డెస్ ఎయిరోపోర్ట్స్ ఫ్రాన్కాయిస్ - రెసుల్టాట్స్ డియాక్టివిట్ డెస్ ఎయిరోపోర్ట్స్ ఫ్రాన్కాయిస్ 2007 - ట్రాఫిక్ పాసెజెర్స్ 2007 క్లాసెమెంట్ - పుట 8" (PDF). మూలం (PDF) నుండి 2012-02-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-12. Cite web requires |website= (help)
 9. "Le Nouveau venu" (French లో). Musée de Paléontologie Humaine de Terra Amata. మూలం నుండి 2009-03-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-03-05. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
 10. A. G. Wintle; M. J: Aitken (1997). "Thermoluminescence dating of burnt flint: application to a Lower Paleolithic site, Terra Amata". Archaeometry. 19 (2): 111–130. doi:10.1111/j.1475-4754.1977.tb00189.x. మూలం నుండి 2017-06-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-12. Unknown parameter |month= ignored (help)
 11. "The Chsteau of Villeneuve-Loubet". Villeneuve-Loubet Guide and Hotels. మూలం నుండి 2014-04-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-30. Cite web requires |website= (help)
 12. లియోన్ పోలికోవ్, లా కండిషన్స్ డెస్ జుయిఫ్స్ సౌస్ ఐ'ఆక్యూపేషన్ ఇటాలియెన్ , ప్యారీస్ , CDJC, 1946 మరియు ఏంజెలో డొనటీ మరియు పెర్ మ్యారీ-బెంనోయిట్ గ్రంథసూచిక
 13. 13.0 13.1 13.2 13.3 13.4 13.5 రాల్ఫ్ స్కార్ (సంవాదం చేయబడింది), డిక్టోనైర్ హిస్టోరిక్ ఎట్ బయోగ్రాఫిక్ డు కొంటే డి నీస్ (హిస్టారికల్ అండ్ బయోగ్రాఫికల్ డిక్షనరీ అఫ్ ది కంట్రీ అఫ్ నీస్ ), నీస్, సేర్రే, 2002, ISBN 978-2864103660, పుటలు.22-23 (French లో)
 14. "Weather Information for Nice". Cite web requires |website= (help)
 15. "Climatological Information for Nice, France" Archived 2011-07-21 at the Wayback Machine. - Hong Kong Observatory
 16. నీస్ ఎయిర్ పోర్ట్ వెబ్‌సైట్ నుండి 2009 ట్రాఫిక్ వివరాలు[permanent dead link]
 17. "French Riviera train for Russia". BBC News. 23 September 2010. Retrieved 24 September 2010. Cite news requires |newspaper= (help)
 18. "Edinburgh - Twin and Partner Cities". City of Edinburgh Council. మూలం నుండి 2008-03-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-12-21. Cite web requires |website= (help)
 19. "Gdańsk Official Website: 'Miasta partnerskie'" (Polish & English లో). Urząd Miejski w Gdańsku. మూలం నుండి 2013-07-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-07-11. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
 20. "Twinning Cities". City of Thessaloniki. Retrieved 2009-07-07.
 21. "Sister Cities of Manila". City Government of Manila. మూలం నుండి 2009-08-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-02. Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నీస్&oldid=2823747" నుండి వెలికితీశారు