నూనె శ్రీనివాసరావు సామాజిక శాస్త్రవేత్త. వీరు ప్రకాశం జిల్లా చీరాలలో 1972, 13 ఫిబ్రవరి న జన్మించాడు. ఇతని ప్రాథమికాభ్యాసం గుంటూరు జిల్లా వరగాని గ్రామంలోనూ, ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పెదనందిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలోనూ, ఇంటర్మీడియట్, బి.కాం. డిగ్రీ పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలోనూ చదివాడు. ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోషల్ వర్క్ లో ఉన్నత అభ్యాసం చేశాడు.సామాజిక సేవలో గత 16 సంవత్సరాలుగా వివిధ పథకాలలో కృషి చేస్తూ ఉన్నాడు.

పనిచేసిన కార్యక్రమాలుసవరించు

  • గ్రామీణ పరిసరాల పరిశుభ్రత, మంచినీటి సరఫరా పధకం గురించి అసిస్ట్ సేవా సంస్థలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీప గ్రామాలలో 1995 నుండి 1996 వరకు
  • మడ అడవుల సంరక్షణ గురించి యం.యస్.స్వామినాధన్ పౌండేషన్ లో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో సుమారు 70 గ్రామాలలో 1996 నుండి 2002 వరకు
  • స్వయ సహాయక సంఘాలు గురించి ఏపిమాస్ సంస్థలో హైదరాబాద్లో 2006 నుండి 2006 వరకు
  • విపత్తుల నిర్వహణ గురించి ఆఘా ఖాన్ పౌండేషన్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీప గ్రామాలలో 2007 నుండి 2009 వరకు
  • సమాచార సాంకేతిక విజ్ఞాన సేవలను గ్రామీణులకు అందించే సేవలలో భాగంగా 2009 నుండి సిడాక్ లో పనిచేసాడు
  • హైదరాబాద్ లోని కొన్ని మురికవాడలలో మహిళలు - స్వయం సహాయక సంఘాలు అనే అంశంపై పరిశోధన చేసి తమ వ్యాసాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయానికి సమర్పించాడు.
  • ప్రస్తుతం జాతీయ మహిళా సాధికారత మిషన్ లో ప్రాజెక్టు అడ్వయిజర్ (ఆంధ్రప్రదేశ్) గా పనిచేస్తున్నాడు.

ప్రజల భాగస్వామ్య మదింపు పద్థతులు, సామర్థ్య పెంపుదుల, జీవనోపాధుల పధకాలు, సమాచార సాధనాల రూపకల్పన, సమాచార హక్కు, పధక రూపకల్పన, నిర్వహణ, అమలు, పర్యవేక్షణ, పర్యాలోచన మొదలగు వాటిలో అవగాహణ ఉన్న వ్యక్తి అని అంటుంటారు. అంతేగాదు మహిళా సాధికారత పత్రికకు కొంతకాలం సారథ్యం నిర్వహించాాడు. అనేక సామాజిక అంశాలపై లఘ చిత్రాలను (గమ్యం, జీవనోపాధులు) రూపొందించాడు.