నెహ్రూ జంతుప్రదర్శనశాల
(నెహ్రూ జంతు ప్రదర్శనశాల నుండి దారిమార్పు చెందింది)
నెహ్రూ జంతుప్రదర్శనశాల (హైదరాబాద్ జూ లేదా జూ పార్క్ అని కూడా పిలుస్తారు) అనేది తెలంగాణలోని హైదరాబాద్ లోని మీర్ ఆలమ్ చెరువు సమీపంలో ఉన్న జంతుప్రదర్శనశాల. దీనిని అక్టోబరు 6, 1963లో ప్రధానమంత్రి నెహ్రూ పేరుమీద స్థాపించారు. ఇది తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్నది. ఇది 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండి, ఇంచుమించు 1,500 జాతుల జంతువులు, పక్షులు మొదలైన వాటిని రక్షిస్తున్నది. [1]
![]() నెహ్రూ జంతుప్రదర్శనశాల | |
ప్రారంభించిన తేదీ | 12 అక్టోబర్ 1963 |
---|---|
ప్రదేశము | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
Coordinates | 17°21′04″N 78°26′59″E / 17.35111°N 78.44972°ECoordinates: 17°21′04″N 78°26′59″E / 17.35111°N 78.44972°E |
విస్తీర్ణము | 380 acres (153.8 ha) |
జంతువుల సంఖ్య | 1100 |
Number of species | 100 |
Memberships | సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా |
వెబ్‌సైటు | hyderabadzoo |
ప్రవేశ రుసుముసవరించు
2021, అక్టోబర్ 1-వ తేదీ మొదలు ధరలు సవరించబడినవి. వాటి వివరములు
- పెద్దలకు: వార రోజులలో రూ.60, వారాంతములలో రూ.75
- పిన్నలకు: వార రోజులలో రూ.40, వారాంతములలో రూ.50
- బొమ్మ రైలు టిక్కెట్: అన్ని రోజులలో పెద్దలకు రూ.40, పిన్నలకు రూ.20
- సఫారీ పార్క్: సి.ఎన్.జి బస్సులోనైతే పెద్దలకు రూ.75, పిన్నలకు రూ.40, ఏ.సీ. బస్సులైతే పెద్దలకైనా, పిన్నలకైనా రూ.120
- జంతు ప్రదర్శన శాలయందు వ్యక్తిగత కార్లకు అనుమతి లేదు. బ్యాటరీతో నడిచే వాహనములు అద్దెకు లభించును.
- పది మంది కూర్చొనగలిగే బ్యాటరీ వాహనము, రెండు గంటలపాటు, అద్దె రూ.2500/-
- పదునాలుగు మంది కూర్చొనగలిగే బ్యాటరీ వాహనము, రెండు గంటలపాటు, అద్దె రూ.3000/-
- ఇవే బ్యాటరీ వాహనములను హాప్-ఆన్-హాప్-ఆఫ్ (కావలసిన చోటు ఎక్కడం, కావలసిన చోటు దిగడం) టిక్కెట్ పెద్దలకు వార దినాలలో రూ.85, వారాంతములలో రూ.100, పిన్నలకు వార దినములలో రూ.50, వారాంతములలో రూ.60
- కెమేరా: స్టిల్ కెమేరా అనుమతి రుసుము: రూ.120, వీడియో కెమేరా అనుమతి రుసుము రూ.600
చరిత్రసవరించు
నెహ్రూ జంతుప్రదర్శనశాల 26 అక్టోబర్ 1959న శంకుస్థాపన చేయబడినది, 6 అక్టోబర్ 1963 నుంచి ప్రజల సందర్శనకు తెరవబడింది. ఈ ఉద్యానవనాన్ని తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ నడుపుతోంది. దీనికి భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు.[1]
ఛాయాచిత్రాలుసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "Nehru Zoological Park Hyderabad | Zoo Hyderabad | Hyderabad Zoo". www.wiki.meramaal.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-09-18. Retrieved 2021-10-06.
బయటి లంకెలుసవరించు
- అధికారిక వెబ్‌సైటు
- కేంద్ర జంతు సంరక్షణశాఖ అధికారిక వెబ్‌సైటు
Wikimedia Commons has media related to Nehru Zoological Park.