నేపాల్‌లో హిందూమతం

హిందూమతం నేపాల్ లోని ప్రధాన, అతిపెద్ద మతం.[1] 2007లో దేశం తనను తాను లౌకిక దేశంగా ప్రకటించుకుంది;[2][3][4] ఇప్పటికీ, భారతీయ మతాలకు "నేపాల్ రాజ్యాంగం దేశమంతటా ఈ పురాతన మత రక్షణ కోసం పిలుపునిచ్చింది" వంటి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చింది.[5] 2011 జనాభా లెక్కల ప్రకారం, నేపాల్‌లో హిందువుల జనాభా దాదాపు 2,15,51,492 అని అంచనా వేసారు. ఇది దేశ జనాభాలో 81.34%. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా హిందువుల అత్యధిక శాతం.[6] నేపాల్ జాతీయ క్యాలెండరైన విక్రమ్ సంవత్, ఒక సౌరమాన హిందూ క్యాలెండరు. దీన్ని మతపరమైన క్యాలెండర్‌గా ఉత్తర భారతదేశంలో విస్తృతంగా అనుసరిస్తారు. ఇది హిందూ కాల యూనిట్లపై ఆధారపడి ఉంటుంది.[7] దేశంలో రాచరికాన్ని రద్దు చేసాక, 2008 వరకు నేపాల్ ప్రపంచంలోని చివరి హిందూ దేశంగా ఉంది.[8]

నేపాలీ హిందువులు
(top) నేపాలీ బ్రాహ్మణుడు, (కింద) హిందూ భక్తురాలు.
మొత్తం జనాభా
2,15,51,492 (2011)
(81.3% of the country's population)Increase
వ్యవస్థాపకుడు
గోపాల వంశ పాలకులు
Regions with significant populations
నేపాల్ అంతటా
మతాలు
హిందూమతం
గ్రంథాలు
భగవద్గీత, వేదాలు
భాషలు
సంస్కృతం (పవిత్ర)
నేపాలీ, భోజ్‌పురి, మైథిలి, తరు భాష
స్వస్తిక

భౌగోళికంగా మత సమూహాల వ్యాప్తిని చూస్తే హిందువుల ప్రాబల్యం వెల్లడవుతుంది. ప్రతి ప్రాంతంలోని జనాభాలో కనీసం 90% మంది హిందువులు ఉన్నారు. [9] నేపాల్‌లోని జాతి సమూహాలలో, బహున్, ఛెత్రి, మాధేషి, నెవారి, ఠాకూరి ప్రజలు హిందూమతంచే ఎక్కువగా ప్రభావితమయ్యారు.[10]

చరిత్ర మార్చు

చరిత్రపూర్వ కాలంలో "నే" అనే హిందూ ఋషి ఖాట్మండు లోయలో స్థిరపడ్డాడని, "నేపాల్" అనే పదానికి అర్థం, నే ఋషి "రక్షించిన ప్రదేశం" (సంస్కృతంలో "పాలా") అని చరిత్రకారులు, స్థానిక సంప్రదాయాలూ చెబుతున్నాయి. అతను బాగ్మతి, బిష్ణుమతి నదుల సంగమం అయిన టేకు వద్ద మతపరమైన వేడుకలను నిర్వహించాడు. పురాణాల ప్రకారం, అతను ఒక ధర్మబద్ధమైన గోవుల కాపరిని పాలకుడిగా ఎంచుకున్నాడు. అతడే గోపాల రాజవంశంలోని అనేక మంది రాజులకు ఆద్యుడు. ఈ పాలకులు నేపాల్‌ను 500 సంవత్సరాలకు పైగా పాలించినట్లు చెబుతారు. అతను ఎంచుకున్న గోపాల రాజవంశపు మొదటి రాజు భుక్తమన్‌. గోపాల వంశం 621 సంవత్సరాలు పాలించింది. ఈ వంశానికి చివరి రాజు యక్ష గుప్తుడు.

స్కంద పురాణం ప్రకారం, హిమాలయాల్లో "నే" లేదా "నేముని" అనే ఋషి నివసించేవాడు. పశుపతి పురాణం, అతన్ని సాధువుగాను రక్షకుడిగానూ పేర్కొంది. అతను బాగమతి, కేశవతి నదుల వద్ద తపస్సు చేశాడని, అక్కడ తన సిద్ధాంతాలను బోధించాడనీ చెబుతుంది.

18వ శతాబ్దం మధ్యలో, పృథ్వీ నారాయణ్ షా అనే గూర్ఖా రాజు, చుట్టుపక్కల రాజ్యాలను గెలిచి ప్రస్తుత రూపంలో ఉన్న నేపాల్‌ రాజ్యాన్ని ఏర్పరచేందుకు సంకల్పించాడు. సరిహద్దు పర్వత రాజ్యాలు తటస్థంగా ఉండేళా ఒప్పించి తన దండయాత్రను ప్రారంభించాడు. అనేక రక్తపాత యుద్ధాలు, ముట్టడుల తర్వాత, ముఖ్యంగా కీర్తిపూర్ యుద్ధం తరువాత, అతను 1769లో ఖాట్మండు లోయను జయించగలిగాడు.

ఆధునిక చరిత్ర మార్చు

1951లో రాణా పాలనను పడగొట్టిన తరువాత , రాజు త్రిభువన్ నేపాల్ సరిహద్దులను తెరిచాడు. నేపాల్ అభివృద్ధికి సహాయం చేయమని బాహ్య ప్రపంచానికి విజ్ఞప్తి చేశాడు. [11] తర్వాత, అతను నేపాలీలకు, ముఖ్యంగా నేపాలీ ముస్లింలకు మత స్వేచ్ఛను ఇచ్చాడు. నేపాల్‌లో మొట్ట మొదటి చర్చి స్థాపించబడింది. [12] ఇతర మత సమూహాలను అనుమతించినప్పటికీ, నేపాల్ సమాజం పౌరులందరికీ కఠినమైన హిందూ చట్టాలను వర్తింపజేసింది. హిందూమతమే దేశ అధికారిక మతంగా ఉంది.

పాలకుల హైందవీకరణ మార్చు

వివిధ చారిత్రక ఆధారాల ప్రకారం, లిచ్చవీ కాలం (సా.శ. 3వ శతాబ్దం) నుండి ఖాట్మండు లోయ సామాజిక నిర్మాణంలో వర్ణ, కుల ఉనికిని ఒక అంశంగా గుర్తించినప్పటికీ, నేపాల్ లోయలో నివసించే వారిలో ఎక్కువ మందిని మైథిలీ- మూలాలున్న రాజు జయస్థితి మల్లా (1354–1395 AD) 14వ శతాబ్దంలో మొదటిసారిగా నేపాల్‌రాష్ట్రశాస్త్రంలో వ్రాతపూర్వక కోడ్‌గా క్రోడీకరించారు . [13] జయస్థితి మల్లా, భారతీయ మైదానాల నుండి ఆహ్వానించిన ఐదుగురు కన్యాకుబ్జ, మైథిల్ బ్రాహ్మణుల సహాయంతో, లోయలోని జనాభాను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు ప్రధాన తరగతులుగా (వర్ణం ) విభజించాడు. ఇవి మనుస్మృతి వచనం, వ్యక్తి యొక్క వృత్తిపరమైన పాత్రల ఆధారంగా ప్రాచీన హిందూమతం నుండి ఉద్భవించినవే. [14] నాలుగు వర్ణాల్లో మొత్తం 64 కులాలు ఉన్నాయి. ఇందులో శూద్రకులం 36 ఉపకులాలుగా విభజించబడింది.[15]

 
పృథ్వీ నారాయణ్ షా, నేపాల్ రాజ్య స్థాపకుడు

ఖాట్మండు లోయ గుర్ఖాలీ స్వాధీనమైన తరువాత, రాజు పృథ్వీ నారాయణ్ షా క్రైస్తవ కపుచిన్ మిషనరీలను పటాన్ నుండి బహిష్కరించాడు. నేపాల్‌ను అసల్ హిందుస్థాన్ (హిందువుల నిజమైన భూమి) గా సవరించాడు. [16]గుర్ఖాలీ రాజు పృథ్వీ నారాయణ్ ఖాట్మండు లోయను స్వాధీనం చేసుకున్న తర్వాత యజ్ఞోపవీతాన్నిధరించే ఉన్నత వర్ణాలకు చెందిన హిందువులు, నేపాల్ రాజధానిలో విశేష హోదాను, కేంద్ర అధికారాన్నీ పొందారు. [17] [18] అప్పటి నుండి హిందూమతం నేపాల్ రాజ్యపు ముఖ్యమైన విధానంగా మారింది.[19]

జంగ్ బహదూర్ రాణా తన యూరోపియన్ పర్యటన తర్వాత నేపాలీ సివిల్ కోడ్ ములుకి ఐన్‌ను ప్రవేశపెట్టాడు. 1854లో దీన్ని అమలులోకి తెచ్చాడు. ఇది సాంప్రదాయ హిందూ చట్టంలో పాతుకుపోయింది. నేపాల్‌లో అనేక శతాబ్దాలుగా సామాజిక పద్ధతులను క్రోడీకరించింది.[20] చట్టంలో ప్రాయశ్చిత్తం, ఆచారం (వివిధ కులాలు, వర్గాల సంప్రదాయిక చట్టం) కూడా ఉన్నాయి. ఇది, ఖాస్ పాలకుల దృక్కోణం నుండి నేపాల్‌లోని మొత్తం హిందువులతో పాటు హిందూయేతర జనాభాను ఒకే క్రమానుగత పౌర కోడ్‌లో చేర్చే ప్రయత్నం.[21][22]

నేపాలీ సమాజం సర్వమత సామరస్యానికి, సహనానికీ ప్రసిద్ధి చెందింది. అయితే పృథ్వీ నారాయణ్ షా నేపాల్‌ను హైందవీకరణ చెయ్యడం, కుంకుమీకరణ చేయడాన్ని ఇతర మత సమాజాలపై చేసిన హింసగా భావించబడింది. ఆ తర్వాత, 1940ల వరకు, హిందూమతం తప్ప మరే ఇతర మతాలనైనా ప్రచారం చెయ్యడాన్ని నిషేధించారు. [23][24]నేపాల్ రాజ్యంలో మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ హిందూ సమాజానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి.

అప్పుడు, రాణా రాజవంశం అధికారం లోకి వచ్చింది. ఈ వంశం ప్రధానంగా క్షత్రియ హిందువులది. రాణా వంశం పాలనలో ఉన్నప్పటికీ, నేపాల్‌లో పెద్దగా హైందవీకరణ జరగలేదు, అయితే అప్పటికీ కఠినమైన హిందూ చట్టమే అమల్లో ఉంది. [25] రాణా పాలకులు రాజ్యంలో గిరిజన హిందువుల కాషాయీకరణపై దృష్టి సారించారు. ప్రధానంగా యోధ తరగతి గూర్ఖాలపై దృష్టి సారించారు. [26] రాణా రాజవంశం కాలంలో అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను నిర్మించారు. నేపాల్లో వైదిక సంస్కృతిని అమలు చేసారు.[27]

హిందూ ప్రతీకగా నేపాల్ మార్చు

ధ్వజం అనేది హిందూ దేవాలయాల పైన ఉండే జెండా.[28] విష్ణువు నేపాలీ ప్రజలను సమీకృతం చేసి, సూర్యచంద్రుల చిహ్నాలతో ధ్వజాన్ని నెలకొల్పాడని భావిస్తున్నారు.[29] ఆ ధ్వజాన్ని శివుడు విష్ణువుకు ఇవ్వగా, రాక్షసులతో పోరాడటానికి ఆ జెండాను విష్ణువు ఇంద్రుడికి అప్పగించాడు అని హిందూ పురాణంలో వ్రాయబడింది.[30]

  • దషైన్
  • తిహార్
  • జనై పూర్ణిమ, రక్షా బంధన్, కుంబేశ్వర్ మేళా పటాన్
  • శ్రీ కృష్ణ జన్మాష్టమి
  • మాఘ సంక్రాంతి
  • శ్రీ పంచమి
  • మహా శివరాత్రి
  • ఫాగు పూర్ణిమ (హోలీ)
  • మతతీర్థ ఔన్సీ (నేపాలీ సమానమైన మదర్స్ డే)
  • గోకర్ణ ఔన్సీ (పితృ దినోత్సవంకి సమానమైన నేపాలీ)
  • బుద్ధ జయంతి (నేపాల్‌లో హిందువులు, బౌద్ధుల మధ్య గొప్ప సామరస్యం ఉన్నందున హిందూ ప్రజలు కూడా జరుపుకుంటారు)
  • ఘంటా కర్ణ చతుర్దశి
  • గైజాత్ర
  • తీజ్
  • యెన్యా|ఇంద్రజాత్ర (ఖాట్మండులో)
  • ఛత్
  • ఘోడే జాత్రా
  • శ్రీరామ నవమి
  • వివాహ పంచమి
  • బాగ్ జాత్రా
  • భైరవ కుమారి జాతర
  • చైతే దశైన్
  • గౌర పర్వ
  • గున్లా
  • గురు పూర్ణిమ
  • రాతో మచ్చేంద్రనాథ్ జాతర
  • మణి రిమ్డు
  • మాతా-యా
  • నీల్ బరాహి ప్యాఖాన్
  • రథయాత్ర
  • తము ధీ
  • తాన్సేన్ జాత్రా
  • తయా మచా
  • యోమారి పున్హి

ఆధునిక నేపాల్‌లో హిందూమతం ప్రభావం మార్చు

నేపాల్‌లో హిందూ, బౌద్ధ సంప్రదాయాలు రెండూ సహస్రాబ్దాల క్రితం నాటివి. [31] లుంబినిలో బుద్ధుడు జన్మించాడు. ఖాట్మండులోని పశుపతినాథ్ దేవాలయం హిందువుల పురాతన, ప్రసిద్ధ శివాలయం. నేపాల్‌లో అనేక ఇతర దేవాలయాలు, బౌద్ధ విహారాలూ ఉన్నాయి. అలాగే ఇతర మత సమూహాలకూ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. సాంప్రదాయికంగా, నేపాల్ తాత్విక ఆలోచనలు హిందూ, బౌద్ధ తాత్విక నీతి, సంప్రదాయాలలో పాతుకుపోయాయి. కాశ్మీరీ శైవం, నైంగ్మా స్కూల్ ఆఫ్ టిబెటన్ బౌద్ధమతం, భక్తపూర్ కర్మాచార్యుల రచనలు, తాంత్రిక సంప్రదాయాల అంశాలను కలిగి ఉన్న జంతు బలుల అభ్యాసంతో సహా నేపాల్‌లో తాంత్రిక సంప్రదాయాలు లోతుగా పాతుకుపోయాయి. నీటి గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు, బాతులు - ఈ ఐదు రకాల జంతువులనూ - మగవాటిని మాత్రమే - బలి కోసం ఆమోదయోగ్యమైనవిగా పరిగణిస్తారు. ఆవులు చాలా పవిత్రమైన జంతువులు, బలి ఇవ్వడానికి ఎప్పుడూ ఆమోదయోగ్యంగా పరిగణించబడవు.[32][33][34][35] నేపాల్, హిందూమతానికి చెందిన అనేక పురాతన ప్రదేశాలకు నిలయంగా ఉంది. అనేక హిందూ తీర్థయాత్రలకు పర్యాటక కేంద్రంగా ఉంది.[36][37]

హిందూ దేవాలయాలు మార్చు

 
రాత్రి వేళ పశుపతినాథ్ ఆలయం

2007కి ముందు, నేపాల్ హిందూ దేశంగా ఉన్నప్పుడు, పశుపతినాథ్ ఆలయాన్ని "నేపాల్ దేవాలయం"గా పరిగణించేవారు.[38] పశుపతినాథ్ ఆలయం నేపాల్ హిందువులకు అత్యంత పవిత్రమైన ఆలయంగా పరిగణించబడుతుంది. [39]

నేపాల్‌లో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి క్రింద ఇవ్వబడ్డాయి:

  • బడిమాలిక ఆలయం
  • సిద్ధికాళి ఆలయం
  • చంగు నారాయణ్
  • సూర్యవినాయక దేవాలయం
  • డోలేశ్వర్ మహాదేవ ఆలయం
  • మైస్థాన్ మందిర్
  • పాదుకాస్థాన్
  • చింతాంగ్ దేవి ఆలయం
  • జానకీ మందిర్
  • సంకత్ మోచన్ మందిర్
  • కోటేశ్వర్ మహాదేవ్
  • పశుపతినాథ్ ఆలయం
  • స్వయంభూనాథ్
  • అశోక్ బినాయక్ ఆలయం
  • భైరబ్స్థాన్ ఆలయం

ఇతర మతాలతో సంబంధాలు మార్చు

హిందూమతం, బౌద్ధమతం మార్చు

సాంప్రదాయకంగా హిందూ, బౌద్ధ విశ్వాసాల మధ్య పోలికలు చాలా కలుస్తాయి.[40] 1981 జనాభా గణనలో హిందువులుగా పరిగణించబడే చాలా మంది వ్యక్తులను, కొన్ని భావాలలో బౌద్ధులు అని అంటారు. చిరకాలంగా హిందువులు బౌద్ధ దేవాలయాలలోను, బౌద్ధులు హిందూ దేవాలయాలలోనూ పూజలు చేస్తున్నారు. [41]దీనికి కారణం హిందూమతం, బౌద్ధమతం రెంటికీ ఉమ్మడి మూలాలు ఉండడమే. చరిత్రలో ఎక్కువ భాగం వాటిని వేర్వేరు మతాలుగా చూడలేదు, ఒకే మత సంప్రదాయంలోని ప్రత్యర్థి ధోరణులు గానే చూసారు.[42][43] ఇటువంటి ద్వంద్వ విశ్వాస అభ్యాసాల కారణంగా (లేదా పరస్పర గౌరవం), హిందువులు, బౌద్ధుల మధ్య భేదాలు చాలా సూక్ష్మంగాను, అధ్యయనపరంగానూ మాత్రమే ఉంటాయి; హిందువులు, బౌద్ధులు గత సహస్రాబ్దాలుగా ఎటువంటి మత ఘర్షణలకు పాల్పడలేదు.[44][45] ఇరుమతాల వారూ ప్రవేశించి పూజించగలిగే దేవాలయాలు అనేకం ఉన్నాయి.[46][47]'

హిందూమతం, ఇస్లాం మార్చు

చారిత్రికంగా, నేపాల్‌లో హిందువులు, ముస్లింల మధ్య పెద్దగా విభేదాలు లేకపోయినా [48] 20వ శతాబ్దంలో మత మార్పిడులు జరగడం, వాటికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు చెయ్యడం కారణంగా రెండు వర్గాల మధ్య కొన్ని వివాదాలు జరిగాయి.[49] భారతదేశంలో హిందుత్వ పెరుగుదల ఫలితంగా నేపాల్‌లో స్థానిక హిందువులు, బౌద్ధులలో ఇస్లామోఫోబియా పెరుగుతోందని వాదనలు ఉన్నాయి.[50][51] అయితే, సామాజిక స్థాయిలో ఇది ఎటువంటి ప్రభావం చూపలేదని తెలుస్తోంది. నేపాల్‌ను హిందూ రాష్ట్రంగా మార్చాలనే ముస్లింలు డిమాండు చెయ్యడమే దీనికి నిరూపణ.[52] తమ మతానికి మరొకరి వల్ల ముప్పు లేదని, దశాబ్దాలుగా తాము సోదర భావంతో ఉన్నామని భావించడమే దీనికి కారణం. ఈ రెండు మతాల వారూ క్రైస్తవ మత విస్తరణను ఒక ఉమ్మడి సమస్యగా చూస్తారు.[48][53]

తత్ఫలితంగా, నేపాల్‌ను తిరిగి హిందూ రాజ్యంగా ప్రకటించాలనే నిరసనలు వచ్చిన సమయంలో, అనేక మంది ముస్లింలు దానికి మద్దతు ఇచ్చారు.[53][54]

హిందూమతం, క్రైస్తవం మార్చు

నేపాల్‌లో, హిందువులు, క్రైస్తవుల మధ్య సంబంధాలు చాలా తరచుగా వివాదాస్పదంగా ఉంటాయి. [55] నేపాల్‌లో క్రైస్తవ మత వ్యాప్తి ఒక వివాదాస్పద అంశం. నేపాలీ క్రైస్తవులకు, స్థానిక హిందువులు ముస్లింలకూ మధ్య చెదురుమదురు హింసా ఘటనలు జరిగాయి. వాళ్ళు సామాజిక బహిష్కరణకు గురయ్యారు.[56][57] క్రైస్తవ మిషనరీలు మతం మార్చుకోవడానికి పేద మెటీరియల్ ప్రోత్సాహకాలను అందజేస్తారని నేపాలీ మీడియాలోను, రాజకీయ చర్చలలోనూ ఆరోపణలున్నాయి. దీనికి అవసరమైన రుజువులు కూడా ఉన్నాయి. అయితే ఈ రుజువులను పెద్దగా పట్టించుకోలేదు.[58] క్రైస్తవ పాస్టర్లు, మిషనరీలు పేదలను, చదువుకోని హిందువులనూ మతం మార్చడంతో నేపాల్‌లోని హిందువులు, క్రైస్తవుల మధ్య వివాదాలు బాగా పెరిగాయి.[58][59] నేపాల్‌లోని క్రైస్తవులకు హిందువులకూ మధ్య భూమి తదితర సాంస్కృతిక వివాదాల కారణంగా తరచుగా ఘర్షణలు జరిగాయి. [60] కాథలిక్ చర్చి ఆఫ్ నేపాల్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చర్చిలలో ఒకటి. దీని కారణంగా నేపాల్ హిందువుల జనాభా తగ్గుతూ రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.[61] రెండు వర్గాల మధ్య పలు గొడవలు చోటు చేసుకున్నాయి. నేపాల్‌లో హిందూ జాతీయవాదం పెరగడం నేపాల్‌లోని సనాతనేతర మతాలకు ముప్పుగా పరిగణిస్తున్నారు. పాశ్చాత్య దేశాలు క్రైస్తవ మతాన్ని రక్షించగలిగినపుడు, సనాతన మతాలను రక్షించుకునే స్వేచ్ఛ నేపాలీలకు కూడా ఉంటుందని ఇక్కడి ప్రజల ఏకైక సామెత. క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులపై ఇతర గిరిజనులు దాడులు జరపడం, చర్చిలను ధ్వంసం చేయడం, మతమార్పిడిపై నిషేధం సంభవిస్తున్నాయి.[62] ప్రత్యేకంగా, భూకంపం, వరదలు, కొండచరియలు విరిగిపడిన తర్వాత ప్రజలు కష్టపడుతున్నప్పుడు మతమార్పిడి వెల్లివిరుస్తుంది. క్రైస్తవ మిషనరీలు ఈ స్థితిలో లాభాలను పొందడం తరచూ కనిపిస్తూంటుంది.[58][63] నేపాల్ హిందువుల ఆర్థిక స్థితిని, కులాన్నీ వాడుకుని మతం మార్చి, మిషనరీలు లాభపడడాన్ని కచ్చితంగా అంగీకరించలేరు. 2017లో ఈ విధంగా ఒక బిల్లును ఆమోదించింది.[29][64]

జనాభా వివరాలు మార్చు

చారిత్రికంగా జనాభా మార్చు

శాతం వారీగా, చారిత్రకంగా మార్పు మార్చు

సంవత్సరం శాతం పెంచు
1952/54 88.87% -
1961 87.69% -1.18%
1971 89.39% +1.70%
1981 89.50% +0.11%
1991 86.51% -2.99%
2001 80.62% -5.89%
2011 81.34% +0.72%

వృద్ధి రేటు మార్చు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
195273,18,392—    
196182,54,403+12.8%
19711,03,30,009+25.1%
19811,34,45,787+30.2%
19911,59,96,653+19.0%
20011,83,30,121+14.6%
20112,15,51,492+17.6%

1952లో, నేపాల్‌లో హిందువుల జనాభా 88.87%తో 73,18,392.[65] నేపాల్ 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో హిందువుల శాతం 1952లో 88.87% నుండి 81.34%కి దాదాపు 7% తగ్గింది. హిందూ జనాభా జనాభా నిరంతరం క్షీణతను ఎదుర్కొంటోంది. దీనికి ప్రధాన కారణం నేపాలీ హిందువులలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండడం.[66] యునైటెడ్ కింగ్‌డమ్, హాంకాంగ్, ఇండియా, ఒమన్‌లలో నేపాలీల ప్రవాసులు పెరగడం కూడా ఒక కారణం.[67][68][69]

జాతి వారీగా హిందూ జనాభా మార్చు

ఈ గణాంకాలు 2011 నేపాల్ జనాభా లెక్కల ఆధారంగా రూపొందించబడ్డాయి.[65] NEG అనేది కొత్తగా జాబితా చేయబడిన జాతి సమూహాన్ని సూచిస్తుంది. 2001 నేపాల్ జనాభా లెక్కల్లో ఇవి అందుబాటులో లేవు.

కులం హిందువుల్లో మార్పు శాతం

(2001-2022)

జాతి హిందువులు

2001

హిందువులు 2011 హిందువులు 2021
% Pop. % Pop.
ఛెత్రి/క్షేత్రి −0.23% ఖాస్ 99.48% 99.25% 43,98,053
బ్రాహ్మిన్ (కొండ) /బహున్ −0.12% ఖాస్ 99.68% 99.56% 32,26,903
మగర్ +4.36% సినో/టిబెటన్ 74.60% 78.96% 18,87,733
తరు −3.67% ఆదివాసి 97.63% 93.96% 17,37,470
తమంగ్ +1.19% సినో/టిబెటన్ 7.69% 8.88% 15,39,830
న్యూవార్ +3.25% సైనో/టిబెటన్, ఇండిక్ ఆర్యన్ 84.13% 87.38% 13,21,933
ముసల్మాన్ −2.19% ముస్లిం 2.19% 0.00% 11,64,255
కామి −0.34% ఖాస్ 96.69% 96.35% 12,58,554
యాదవ్ −0.09% తెరై 99.78% 99.69% 10,54,458
రాయ్ +2.53% సినో/టిబెటన్ 25.00% 27.53% 6,20,004
గురుంగ్ +3.43% సినో/టిబెటన్ 28.75% 32.18% 5,22,641
దమై/ధోలి −1.22% ఖాస్ 97.81% 96.59% 4,72,862
లింబు +3.02% సినో/టిబెటన్ 11.32% 14.34% 3,87,300
ఠాకూరి −0.09% ఖాస్ 99.40% 99.31% 4,25,623
సర్కి −2.44% ఖాస్ 97.90% 95.46% 3,74,816
తెలి 0.39% తెరై 99.19% 99.58% 3,69,688
చామర్ 0.70% ఖాస్ 98.85% 99.55% 3,35,893
కొయిరి −0.06% తెరై 99.77% 99.71% 3,06,393
కూర్మి 0.00% తెరై 99.84% 99.84% 2,31,129
సన్యాసి −0.16% ఖాస్ 99.21% 99.05% 2,27,822
ధనుక్ −0.15% తెరై 99.75% 99.60% 2,19,808
ముసహర్ +0.58% ఖాస్ 98.52% 99.10% 2,34,490
దుసాధ్ +0.20% ఖాస్ 99.47% 99.67% 2,08,910
షెర్పా −6.26% సినో/టిబెటన్ 6.26% 0.00% 1,12,946
సోనార్ +1.29% తెరై 98.20% 99.49% 64,335
కేవాట్ +0.17% తెరై 99.58% 99.75% 1,53,772
బ్రాహ్మణ్ (తెరై) −0.05% తెరై 99.58% 99.53% 1,34,106
కత్బనియన్ +0.36% తెరై 99.32% 99.68% 1,38,637
ఘర్తీ/భుజేల్ +1.10% సినో/టిబెటన్ 96.50% 97.60% 1,18,650
మల్లాహ +0.63% తెరై 99.13% 99.76% 1,73,261
కల్వార్ +0.08% తెరై 99.69% 99.77% 1,28,232
కుమల్ −0.17% సినో/టిబెటన్ 98.42% 98.25% 1,21,196
హజం/ఠాకూర్ +0.07% తెరై/తక్కువ 99.59% 99.66% 1,17,758
కను −0.16% తెరై 99.89% 99.73% 1,25,184
రాజబంసి +13.75% ఆదివాసి 85.15% 98.90% 1,15,242
సునువార్ +12.79% సినో/టిబెటన్ 79.50% 92.29% 55,712
సుధీ −0.18% తెరై 99.67% 99.49% 93,115
లోహర్ −0.24% తెరై 99.78% 99.54% 101,421
తత్మా −0.29% ఖాస్ 99.79% 99.50% 104,865
ఖత్వే +0.15% ఖాస్ 99.45% 99.60% 100,921
ధోబి +0.27% ఖాస్ 99.45% 99.72% 109,079
మాఝీ +0.31% సినో/టిబెటన్ 81.67% 81.98% 83,727
నునియా +0.48% తెరై 99.34% 99.82% 70,540
కుమ్హర్ +0.39% తెరై 99.19% 99.58% 62,399
దానువార్ −15.60% సినో/టిబెటన్ 99.26% 83.66% 84,115
చెపాంగ్ −5.73% సినో/టిబెటన్ 70.23% 64.50% 68,399
హలువాయి +0.25% తెరై 99.38% 99.63% 83,869
రాజ్‌పుత్ +0.29% తెరై 99.32% 99.61% 41,972
కాయస్థ +0.74% తెరై 98.88% 99.62% 44,304
బాధయీ +0.07% తెరై 99.52% 99.59% 28,932
మార్వాడి −1.53% ఇతర 94.88% 93.35% 51,443
సంతల్ −6.07% ఆదివాసి 83.06% 76.99% 51,735
ఝంగడ్ −11.29% ఆదివాసి 92.79% 81.50% 37,424
బంటార్/సర్దార్ +1.31% ఖాస్ 97.85% 99.16% 55,104
బరేయీ −0.10% తెరై 99.90% 99.80% 80,597
కహర్ −0.39% తెరై 99.88% 99.49% 53,159
గంగై −11.13% ఆదివాసి 98.44% 87.31% 36,988
లోధ్ −1.39% తెరై 99.82% 98.43% 32,837
రాజ్‌భర్ +0.25% తెరై 99.41% 99.66% 9,542
తమి −11.81% సినో/టిబెటన్ 55.74% 43.93% 28,671
ధీమాల్ −1.30% ఆదివాసి 57.41% 56.11% 26,298
భోటే −37.90% సినో/టిబెటన్ 37.90% 0.00% 13,397
బిన్ −0.10% తెరై/తక్కువ 99.88% 99.78% 75,195
గదేరి −0.03% తెరై 99.70% 99.67% 26,375
నురాంగ్ −98.54% సినో/టిబెటన్ 98.54% 0.00% 278
యక్కా −2.67% సినో/టిబెటన్ 14.17% 11.50% 24,336
దారై −2.95% సినో/టిబెటన్ 97.89% 94.94% 16,789
తాజ్‌పురియా +13.05% ఆదివాసి 64.15% 77.20% 19,213
తకాలి −3.21% సినో/టిబెటన్ 33.83% 30.62% 13,215
చిడిమార్ −0.17% ఆదివాసి 99.29% 99.12% 1,254
పహారి +12.28% సినో/టిబెటన్ 78.90% 91.18% 13,615
మాలి −0.11% తెరై 99.78% 99.67% 14,995
బంగాలీ +2.05% ఇతర 97.02% 99.07% 26,582
చంత్యాల్ +64.25% సినో/టిబెటన్ 30.78% 95.03% 11,810
డమ్ −0.05% ఖాస్ 99.24% 99.19% 13,268
కమర్ +1.89% తెరై 98.00% 99.89% 1,787
బోటే −10.53% సినో/టిబెటన్ 98.57% 88.04% 10,397
బ్రహ్మూ +7.55% సినో/టిబెటన్ 72.04% 79.59% 8,140
గెయిన్ −2.72% ఖాస్ 97.01% 94.29% 6,791
జిరెల్ +6.82% సినో/టిబెటన్ 10.55% 17.37% 5,774
దురా +80.43% సినో/టిబెటన్ 18.94% 99.37% 5,394
బడి −2.88% ఖాస్ 98.83% 95.95% 38,603
మెచే −4.69% ఆదివాసి 80.28% 75.59% 4,867
లెప్చా +1.93% సినో/టిబెటన్ 7.62% 9.55% 3,445
హల్ఖోర్ −0.01% ఖాస్ 99.34% 99.33% 4,003
పంజాబీ +10.36% ఇతర 80.68% 91.04% 7,176
కిసాన్ −0.85% ఆదివాసి 95.62% 94.77% 1,739
రాజీ +9.69% సినో/టిబెటన్ 88.33% 98.02% 4,235
బ్యాంగ్సీ −98.05% సినో/టిబెటన్ 98.05% 0.00% 3,895
హయు −22.67% సినో/టిబెటన్ 70.29% 47.62% 2,925
కొచే −3.14% ఆదివాసి 97.76% 94.62% 1,635
ధునియా +6.38% తెరై 93.10% 99.48% 14,846
వాలుంగ్ −82.40% సినో/టిబెటన్ 82.40% 0.00% 1,249
ముండా +18.12% ఆదివాసి 78.94% 97.06% 2,350
రౌటే +13.00% సినో/టిబెటన్ 83.28% 96.28% 618
యెల్మో −1.55% సినో/టిబెటన్ 1.55% 0.00% 10,752
పాథర్‌కట్ట −5.95% ఆదివాసి 99.82% 93.87% 3,182
కుసుంద −14.78% సినో/టిబెటన్ 97.56% 82.78% 273
లోమి NEG సినో/టిబెటన్ NEG 0.00% 1,614
కలార్ NEG ఖాస్ NEG 99.26% 1,077
నాటువా NEG దళితుడు NEG 99.74% 3,062
దండి NEG ఖాస్ NEG 100.00% 1,982
ధంకర్ NEG ఖాస్ NEG 99.59% 2,681
కులంగ్ NEG సినో/టిబెటన్ NEG 2.27% 28,613
ఘలే NEG సినో/టిబెటన్ NEG 35.96% 22,881
ఖావాస్ NEG సినో/టిబెటన్ NEG 87.61% 18,513
రాజ్‌ధోబ్ NEG తెరై NEG 99.78% 13,422
కోరి NEG ఖాస్ NEG 99.98% 12,276
నాచిరింగ్ NEG సినో/టిబెటన్ NEG 3.17% 7,154
యంఫు NEG సినో/టిబెటన్ NEG 7.05% 6,933
చామ్లింగ్ NEG సినో/టిబెటన్ NEG 28.70% 6,668
ఆత్పరియా NEG సినో/టిబెటన్ NEG 5.86% 5,977
సర్బారియా NEG ఖాస్ NEG 99.55% 4,906
బంటబా NEG సినో/టిబెటన్ NEG 42.66% 4,604
డోల్పో NEG సినో/టిబెటన్ NEG 0.00% 4,107
అమత్ NEG తెరై NEG 99.11% 3,830
తులుంగ్ NEG సినో/టిబెటన్ NEG 17.45% 3,535
మేవాహంగ్ NEG సినో/టిబెటన్ NEG 10.23% 3,100
బాహింగ్ NEG సినో/టిబెటన్ NEG 14.73% 3,096
లోపా NEG సినో/టిబెటన్ NEG 0.27% 2,624
దేవ్ NEG తెరై NEG 99.44% 2,147
సంగ్‌పాంగ్ NEG సినో/టిబెటన్ NEG 25.34% 1,681
ఖాలింగ్ NEG సినో/టిబెటన్ NEG 20.88% 1,571
టాప్‌కెగోలా NEG సినో/టిబెటన్ NEG 0.00% 1,523
లోహరుంగ్ NEG సినో/టిబెటన్ NEG 10.15% 1,153
ఖాస్ ఓత్ +0.02% ఖాస్ 97.84% 97.86% 155,354
జనజాతి ఓత్ NEG సినో/టిబెటన్ NEG 70.36% 1,228
తెరై ఓత్ +8.47% తెరై 90.44% 98.91% 103,811
నిర్వచించబడలేదు NEG ఇతర NEG 70.32% 15,277
విదేశీయుడు NEG ఇతర NEG 67.22% 6,651
మొత్తం +0.72%' అన్నీ 80.62%' 81.34% 2,64,94,504

2001, 2011 జనాభా లెక్కల ప్రకారం, హిందువుల శాతం 80.62% నుండి 81.34%కి 0.72% పెరిగింది. అయితే, మొత్తం ట్రెండ్ చాలా వరకు ప్రతికూలంగానే ఉంది. చైనా/టిబెటన్లు మినహా అన్ని ప్రధాన జాతి సమూహంలో హిందువుల శాతం క్షీణించింది. ఇది థారు వంటి కొన్ని ఆదివాసీ సమూహాలలో చాలా తీవ్రంగా ఉంది. చైనా/టిబెటన్లలో, హిందువుల శాతం 2.37% పెరిగి 49.74% నుండి 52.11%కి పెరిగింది.

జిల్లాల వారిగా జనాభా మార్చు

క్ర.సం ప్రావిన్స్ మొత్తం జనాభా హిందూ జనాభా హిందూ %
1. ప్రావిన్స్ నం. 1 45,34,943 30,21,632 66.63%
2. ప్రావిన్స్ నం. 2 54,04,145 45,80,012 84.75%
3. బాగ్మతి ప్రావిన్స్ 55,29,452 39,69,040 71.78%
4. గండకి ప్రావిన్స్ 24,03,757 19,92,474 82.89%
5. లుంబినీ ప్రావిన్స్ 44,99,272 39,98,053 88.86%
6. కర్నాలీ ప్రావిన్స్ 15,70,418 14,97,236 95.34%
7. సుదుర్పశ్చిం ప్రావిన్స్ 25,52,517 24,81,812 97.23%
మొత్తం 2,64,94,504 2,15,51,492 81.34%
జిల్లా హిందువులు %
2011[70] 2021
బైతాడి 99.93%
కలికోట్ 99.79%
బజాంగ్ 99.74%
అచ్చం 99.43%
దోతి 99.04%
జాజర్‌కోట్ 98.96%
దడెల్ధురా 98.88%
దార్చులా 98.88%
బాజురా 98.68%
జుమ్లా 97.89%
సల్యాన్ 97.71%
దైలేఖ్ 97.40%
అర్ఘఖాంచి 97.03%
గుల్మీ 96.78%
ప్యుతాన్ 96.61%
రుకుమ్ 96.51%
డాంగ్ 96.46%
కాంచన్‌పూర్ 95.09%
కైలాలీ 94.91%
బర్దియా 94.17%
సుర్ఖేత్ 91.86%
ముగు 91.64%
పాల్ప 90.52%
స్యాంగ్జా 90.21%
సిరహా 90.19%
పర్బత్ 89.48%
ధనస్సు 89.35%
బాగ్లుంగ్ 89.27%
నవల్పరాసి 88.18%
భక్తపూర్ 87.85%
మ్యాగ్డి 87.16%
తనాహు 86.51%
రూపాందేహి 86.24%
సప్తరి 85.73%
సరలాహి 85.56%
రోల్పా 85.17%
మహోత్తరి 84.24%
పర్సా 83.10%
కాస్కి 82.33%
బారా 81.73%
హుమ్లా 81.62%
చిత్వాన్ 81.40%
కపిలబస్తు 80.62%
మొరాంగ్ 80.27%
ఖాట్మండు 80.01%
ఝాపా 79.88%
బ్యాంకే 78.42%
రౌతహత్ 77.77%
గూర్ఖా 75.15%
లలిత్‌పూర్ 73.53%
సున్సారి 73.28%
ఉదయపూర్ 72.57%
ధాడింగ్ 72.42%
రామేచాప్ 71.93%
ఓఖల్ధుంగా 70.76%
డోల్పా 70.15%
డోలాఖా 67.80%
సింధులి 64.47%
లామ్‌జంగ్ 63.98%
కవ్రేపాలంచోక్ 62.57%
సింధుపాల్‌చోక్ 58.98%
ఖోటాంగ్ 58.78%
నువాకోట్ 57.77%
భోజ్‌పూర్ 53.33%
టెర్హతుమ్ 52.17%
ధంకుత 49.17%
మక్వాన్‌పూర్ 48.26%
ఇలం 44.49%
శంఖువసభ 42.73%
సోలుఖుంబు 40.21%
మనంగ్ 39.19%
ముస్తాంగ్ 37.47%
తాప్లెజంగ్ 35.90%
పంచతార్ 34.31%
రాసువా 25.38%

ప్రస్తుతం, నేపాల్ ఒక లౌకిక దేశం. నేపాల్ రాజ్యాంగం 2072 (పార్ట్ 1, ఆర్టికల్ 4) ద్వారా దీన్ని ప్రకటించారు. ఇక్కడ లౌకికవాదం అంటే 'మతపరమైన, సాంస్కృతిక స్వేచ్ఛ, అలాగే మత రక్షణతో పాటు ప్రాచీన కాలం నుండి అందజేసే సంస్కృతి (సనాతన్) ' .[71][72] నేపాల్ 2008లో కూల్చివేయక ముందు, నేపాల్ ప్రపంచంలో చిట్టచివరి హిందూ దేశం. భారతదేశం తర్వాత ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశం.[73] నేపాల్, ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా శాతం ఉన్న దేశం.[74][75] చరిత్రలో అనేక దేశాలు మైనారిటీ మతాలను విస్మరించడం, అణచివేతకు గురిచెయ్యడం జరిగినప్పటికీ, నేపాల్ సమాజంలో అన్ని మతాల మధ్య మతపరమైన సహనం, సామరస్యాం వెల్లివిరిసేది. మతపరంగా ప్రేరేపించబడిన హింసా సంఘటనలు బహు తక్కువగానే ఉన్నాయి.[52] నేపాల్ రాజ్యాంగం, ఓ వ్యక్తిని మరొక మతంలోకి మార్చే హక్కు ఎవరికీ ఇవ్వలేదు. నేపాల్, 2017 లో మరింత కఠినమైన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఆమోదించింది.[64]

మూలాలు మార్చు

  1. Meneses, Eloise (2019-07-23). "Religiously Engaged Ethnography: Reflections of a Christian Anthropologist Studying Hindus in India and Nepal". Ethnos. 86 (3): 477–491. doi:10.1080/00141844.2019.1641126. ISSN 0014-1844.
  2. "Nepal Adopts New Constitution, Becomes a Secular State: 5 Facts". NDTV.com. Retrieved 2021-05-11.
  3. Sep 14, PTI / Updated; 2015; Ist, 19:43. "Nepal to stay secular, proposal for a Hindu nation rejected - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-11. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  4. Petrova, Svetlana. "Nepal Hindu Rashtra: Time to Wrap Up Communism?" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-31. Retrieved 2021-02-11.
  5. Diwakar (2015-09-07). "EDITORIAL: Decks cleared". The Himalayan Times (in ఇంగ్లీష్). Retrieved 2021-05-11.
  6. Timilsina, Rajendra Raj (2015-12-07). "Sandhyopaasan:The Hindu Ritual as a Foundation of Vedic Education". Dhaulagiri Journal of Sociology and Anthropology (in ఇంగ్లీష్). 9: 53–88. doi:10.3126/dsaj.v9i0.14022. ISSN 1994-2672.
  7. Shanmuganathan, Thilagavathi (2014-09-01). "A pragmatic analysis of Lord Shiva's dance". International Journal of the Sociology of Language (in ఇంగ్లీష్). 2014 (229): 95–115. doi:10.1515/ijsl-2014-0019. ISSN 1613-3668.
  8. "Nepal's Royal Coup: Making a Bad Situation Worse". Crisis Group (in ఇంగ్లీష్). 2005-02-09. Retrieved 2021-02-18.
  9. Books 2019, p. 87.
  10. "Nepal – RELIGION". countrystudies.us. Retrieved 2021-02-11.
  11. Jain 2016, p. 956.
  12. Grieve 2006, p. 89.
  13. Levy 1990, p. 76.
  14. Fisher 1978, p. 487.
  15. Levine, Nancy E. (1987b). "Caste, State, and Ethnic Boundaries in Nepal". The Journal of Asian Studies (in ఇంగ్లీష్). 46 (1): 71–88. doi:10.2307/2056667. ISSN 1752-0401. JSTOR 2056667.
  16. Birkenholtz 2018, pp. 67–71; Sharma 2019, pp. 145–147.
  17. Dharam Vir 1988, p. 65.
  18. Borgström 1980, p. 11.
  19. Contributions to Nepalese studies (in ఇంగ్లీష్). Institute of Nepal and Asian Studies, Tribhuvan University. 1998. pp. 123.
  20. Stiller, L. F. (1993). Nepal: Growth of a Nation. Human Resources Development Research Center, Kathmandu.
  21. Hofer, Andras (1979). The Caste Hierarchy and the State of Nepal: A Study of the Muluki Ain of 1854. Universitatsverlag Wagner.
  22. Guneratne, Arjun (2002). Many Tongues, One People: The Making of Tharu Identity in Nepal. Cornell University Press. ISBN 9780801487286.
  23. Gellner, Pfaff-Czarnecka & Whelpton 2012, p. 118.
  24. Sharma 2019, pp. --; Tree 2014, pp. 90–93.
  25. Michaels 2004, p. Ch-Nepal.
  26. Michaels 2004, p. Ch-Nepal (34).
  27. Schlemmer, Grégoire (2018-07-23). "Enshrining Space: Shrines, Public Space and Hinduization among the Kulung of Nepal". South Asia Multidisciplinary Academic Journal (in ఇంగ్లీష్) (18). doi:10.4000/samaj.4603. ISSN 1960-6060.
  28. "The World Factbook — Central Intelligence Agency". www.cia.gov (in ఇంగ్లీష్). Archived from the original on 1 July 2017. Retrieved 24 July 2018.
  29. 29.0 29.1 The Nepalese Perspective (in ఇంగ్లీష్). Gorkhapatra Corporation. 1972.
  30. Sāyami, Dhūsvāṃ (1972). The Lotus & the Flame: An Account on Nepalese Culture (in ఇంగ్లీష్). Department of Information, Ministry of Communication, H.M.G., Nepal. p. 10.
  31. Barua 2015, p. 19.
  32. "Gadhimai: Nepal's animal sacrifice festival goes ahead despite 'ban'". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-12-03. Retrieved 2021-02-18.
  33. Sharma, Bhadra (2019-12-06). "Nepal's Animal-Sacrifice Festival Slays On. But Activists Are Having an Effect. (Published 2019)". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2021-02-18.
  34. "Animal Slaughter at Gadhimai Festival". Humane Society International (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  35. Acharya, Krishna Prasad; Wilson, R. Trevor (2020-09-01). "The animal sacrifice–public health nexus in Nepal". Journal of Public Health Policy (in ఇంగ్లీష్). 41 (3): 386–389. doi:10.1057/s41271-020-00224-3. ISSN 1745-655X. PMID 32296112.
  36. "10 Hindu Temples in Nepal you must Visit". www.touchkailash.com. Retrieved 2021-04-02.
  37. Adhikari, Deepak. "Religion pays: Temple visits by top Indian politicians are boosting tourism in Nepal". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-02.
  38. Mayhew, Bradley; Bindloss, Joe; Armington, Stan (2006). Nepal : Lonely Planet. Internet Archive. Lonely Planet. pp. 166మూస:Free access. ISBN 978-1-74059-699-2.
  39. Gittinger 2018, p. 19.
  40. Gellner, David N. (2005). "The Emergence of Conversion in a Hindu-Buddhist Polytropy: The Kathmandu Valley, Nepal, c. 1600–1995". Comparative Studies in Society and History. 47 (4): 755–780. doi:10.1017/S0010417505000344. ISSN 0010-4175. JSTOR 3879342. Archived from the original on 2021-11-26. Retrieved 2021-11-26.
  41. Birkenholtz 2018, pp. 98–105; Books 2019, pp. viii.
  42. Lewis, Todd T. (1996). "Religious Belief in a Buddhist Merchant Community, Nepal". Asian Folklore Studies. 55 (2): 237–270. doi:10.2307/1178821. ISSN 0385-2342. JSTOR 1178821.
  43. Markov, D (2016). "Hindu-Buddhist Syncretism in Medieval and Early Modern Nepal (An Obelisk (Middle of the XVIII Century) on the Restoration of Stupa Svayambhunath)". The World of the Orient (in ఉక్రెయినియన్). 2016 (4): 74–83. doi:10.15407/orientw2016.04.074. ISSN 1608-0599.
  44. Mitra, Rājendralāla; Asiatic Society (Calcutta, India) Library (1882). The Sanskrit Buddhist literature of Nepal. Cornell University Library. Calcutta, Asiatic Society of Bengal.
  45. Okada, Ferdinand E. (1957). "Ritual Brotherhood: A Cohesive Factor in Nepalese Society". Southwestern Journal of Anthropology. 13 (3): 212–222. doi:10.1086/soutjanth.13.3.3629147. ISSN 0038-4801. JSTOR 3629147.
  46. "The Culture of Nepal". Travel Channel (in ఇంగ్లీష్). Retrieved 2021-02-11.
  47. Shastri, G. C (July 1968). "Hinduism and Buddhism in Nepal" (PDF). Ancient Nepal: Journal of the Department of Archaeology. 4: 48–51. Archived from the original (PDF) on July 6, 2012.
  48. 48.0 48.1 Petraglia, Michael D.; Allchin, Bridget (2007-05-22). The Evolution and History of Human Populations in South Asia: Inter-disciplinary Studies in Archaeology, Biological Anthropology, Linguistics and Genetics (in ఇంగ్లీష్). Springer Science & Business Media. p. 6. ISBN 978-1-4020-5562-1.
  49. "Nepali Muslims and Their Struggle for Recognition". INSAMER English (in ఇంగ్లీష్). 2020-12-19. Archived from the original on 2021-01-16. Retrieved 2021-02-18.
  50. "A worrying rise in Islamophobia ever since a number of Muslim men were diagnosed with Covid-19". kathmandupost.com (in English). Retrieved 2021-02-18.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  51. "As Nepal Strives to Become More Inclusive, Are Muslims Being Left Behind?". www.worldpoliticsreview.com (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  52. 52.0 52.1 KHADKA, UPENDRA LAMICHHANE and BASANT. "Eid highlights Nepal's religious tolerance". My Republica (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
  53. 53.0 53.1 "Muslims in Nepal demand a Hindu state". The Economic Times. Retrieved 2021-02-18.
  54. Dastider, Mollica (2000). "Muslims of Nepal's Terai". Economic and Political Weekly. 35 (10): 766–769. ISSN 0012-9976. JSTOR 4408986.
  55. Maharjan 2002, pp. 1–2.
  56. "Sermon on the mountain | Nepali Times Buzz | Nepali Times". archive.nepalitimes.com. Archived from the original on 21 November 2018. Retrieved 2021-02-19.
  57. Coburn, Brot. "Preaching on high | Nation | Nepali Times". archive.nepalitimes.com. Retrieved 2021-02-19.
  58. 58.0 58.1 58.2 "They use money to promote Christianity". The Guardian (in ఇంగ్లీష్). 2017-08-15. Retrieved 2021-06-20.
  59. "Story Map Journal". www.arcgis.com. Retrieved 2021-02-19.
  60. Sharma 2019, p. 78.
  61. "Lagan Rai - Copy of SIRF Final Report.pdf". Google Docs. Retrieved 2021-03-07.
  62. "Christianity thrives in Nepal amid trials and tribulations - UCA News". ucanews.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-06.
  63. "Restructuring Spiritualism in New Life: Conversion to Christianity in Pokhara, Nepal". Janapriya Journal of Interdisciplinary Studies. Retrieved 2021-06-20.{{cite web}}: CS1 maint: url-status (link)
  64. 64.0 64.1 "Nepal: Nepal: Bill criminalises religious conversion". www.csw.org.uk. Retrieved 2021-02-18.
  65. 65.0 65.1 "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2017-09-18. Retrieved 2017-04-02.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  66. "Hindu Population Drops in Nepal - Hindu Press International - Hindu Press International - Hinduism Today Magazine". www.hinduismtoday.com. Archived from the original on 2021-05-06. Retrieved 2021-05-06.
  67. "Oman amnesty offers undocumented Nepalis chance to return home". kathmandupost.com (in English). Retrieved 2021-05-06.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  68. Subba, Tanka B. (2008). "Living the Nepali Diaspora in India: An Autobiographical Essay". Zeitschrift für Ethnologie. 133 (2): 213–232. ISSN 0044-2666. JSTOR 25843148.
  69. "Nepali Diaspora in a Globalised Era". Routledge & CRC Press (in ఇంగ్లీష్). Retrieved 2021-05-06.
  70. "ఆర్కైవ్ చేయబడిన కాపీ". Archived from the original on 2016-03-05. Retrieved 2014-01-07.
  71. "Laws of Nepal (NP029)" (PDF). Government of Nepal. Retrieved 18 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  72. "Constitution of Nepal 2072" (PDF). Government of Nepal. Archived from the original (PDF) on 2 మార్చి 2021. Retrieved 18 February 2021.
  73. "The Global Religious Landscape". Pew Research Center's Religion & Public Life Project (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-12-18. Retrieved 2021-02-18.
  74. Congress, Library of; Subcommittee, American Library Association Committee on Resources of American Libraries National Union Catalog (1971). The National Union Catalog, Pre-1956 Imprints: A Cumulative Author List Representing Library of Congress Printed Cards and Titles Reported by Other American Libraries (in ఇంగ్లీష్). Mansell. ISBN 978-0-7201-0003-7.
  75. Religion 101 (2012-11-28). "Hindu Demographics & Denominations (Part One)". Religion 101 (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 21 August 2019. Retrieved 2021-02-18.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)