నోబెల్ బహుమతి పొందిన స్త్రీలు
1901 నుంచి నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు. నేటివరకు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి 867 అవార్డులు ఇచ్చారు. మొత్తం అవార్డుల్లో మహిళలకు లభించినవి 46 మాత్రమే. 1964లో బ్రిటీష్ కెమిస్ట్ డొర్తి క్రోఫూట్ హాడ్కిన్ కెమిస్ట్రీలో నోబెల్‌ను పొందిన తర్వాత 50 ఏళ్లకు మలాలా ఎంపికైంది.[1]
నోబెల్ బహుమతులు
మార్చునోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఏర్పాటు చేశారు. 1833 అక్టోబరు 21లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జన్మించారు. ఆయన 355 ఆవిష్కరణలు చేశారు. అందులో అత్యంత ప్రధానమైంది డైనమైట్. నోబెల్ 1895లో రాసిన వీలునామా ప్రకారం ఈ బహుమతులను ఇస్తున్నారు. మానవాళి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఐదు రంగాల్లో బహుమతులు ఇవ్వాలని వీలునామాలో రాసి 1896 డిసెంబరు 10లో నోబెల్ మరణించారు. ఆయన పేర్కొన్న ఐదు విభాగాలు భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం లేదా ఫిజియాలజీ, సాహిత్యం, శాంతి.
నోబెల్ బహుమతులను తొలిసారి 1901లో ప్రదానం చేశారు. వీటిని ప్రతి ఏటా ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు 10న బహూకరిస్తారు. స్వీడన్ కేంద్ర బ్యాంక్ ‘స్వెర్జిస్ రిక్స్ బ్యాంక్’ 1968లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆర్థిక శాస్త్రంలో బహుమతిని ఏర్పాటు చేసింది. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరు విభాగా ల్లో నోబెల్ బహుమతులను ఇస్తున్నారు.
ఇప్పటివరకు 46 మంది మహిళలకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ (1903). మదర్ థెరిసా (1979), ఆంగ్‌సాన్ సూకీ (1991), షిరీన్ ఎబాదీ (2003), వంగరి మతాయ్ (2004), ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ (2011) వంటి వారు నోబెల్ బహుమతిని పొందారు.[2]
పట్టిక
మార్చుమూలాలు
మార్చు- సాధారణ
- "Women Nobel Laureates". Nobel Foundation. Retrieved 2009-10-13.
- ప్రత్యేక
- ↑ మహిళలకు అరుదుగా నోబెల్ బహుమతులు[permanent dead link]
- ↑ నోబెల్ బహుమతిని సాధించిన మొదటి మహిళ?
- ↑ "The Nobel Prize in Literature 2013" (PDF). Nobel Foundation. Archived from the original (PDF) on 2013-10-12. Retrieved 2013-10-10.
- ↑ "Nobel Peace Prize 1982". Nobel Foundation. Retrieved 2008-10-16.
- ↑ "Nobel Peace Prize 1991". Nobel Foundation. Retrieved 2008-10-16.
- ↑ "Nobel Prize in Chemistry 2009". Nobel Foundation. Retrieved 2009-10-07.
- ↑ "The Nobel Prize in Literature 2013" (PDF). Nobel Foundation. Archived from the original (PDF) on 2013-10-12. Retrieved 2013-10-10.
- ↑ "Nobel Prize in Literature 2004". Nobel Foundation. Retrieved 2008-10-16.
- ↑ "Nobel Peace Prize 1946". Nobel Foundation. Retrieved 2008-10-16.
- ↑ "Nobel Prize in Physiology or Medicine 2009". Nobel Foundation. Retrieved 2009-10-05.
- ↑ "Nobel Prize in Economics 2009". Nobel Foundation. Retrieved 2009-10-12.
- ↑ "The Nobel Peace Prize 2011". Nobel Foundation. Retrieved 2011-10-07.
- ↑ "The Nobel Prize in Chemistry 1935". Nobel Foundation. Retrieved 2008-10-16.
ఇతర లింకులు
మార్చు- Nobel Prize Awarded Women page Archived 2013-10-21 at the Wayback Machine on the Nobel Foundation site
- Alan Asaid (26 September 2009). "Så ratade Akademien kvinnorna" [How the Academy Rejected the Women]. SvD (in Swedish).
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)