నోరిటో
నోరిటో (Norito (祝詞)) అనేవి షింటోకి సంబంధించిన ప్రార్ధనా గ్రంథాలు లేదా మంత్ర పూరిత ఆచారాలు. ఇవి సాధారణంగా ప్రత్యేక కామికి సంబంధించినవై ఉంటాయి.[1][2][3]
చరిత్ర
మార్చుమొదటి సారిగా ఈ నోరిటోలను సా.శ 712 లో కోజికి లోనూ, సా.శ 720 లో నిహోంగి లోనూ గ్రంధస్థం చేశారు.[3]
ఎంగిషికి అనేది సా.శ 927 లో సంహిత పరిచిన న్యాయస్థాన చట్టాలు, వాటి సవివర నిబంధనల సంకలనం. ఇది నోరిటోకి సంబంధించిన ఇరవై-ఏడు ప్రాతినిధ్య రూపాలను సంరక్షిస్తుంది.[4] [5]
వ్యుత్పత్తి శాస్త్రం
మార్చుఈ పదానికి సంబంధించిన అర్థాన్ని వివరించే సర్వామోదమైన సిద్ధాంతం అంటూ లేదు.[6] ఒక సిద్ధాంతం లో నోరిటో(norito) పదం నోరు(Noru) ( 宣る, 'ప్రకటించు'; క్రియలు చూ. inoru, 'ప్రార్థన' norou 'శపించు' [6] )ల నుండి గ్రహించి దానికి - టో(to) ప్రత్యయం కలిపారు.[3] ఒక వైవిధ్యమైన పదం, నొట్టో(notto), కోటో, అంటే 'పదం' తో నోరిటో (norito) కలయిక చెంది ఉద్భవించింది. [3]
ఈ పదాన్ని కంజీలో అనేక రకాలుగా వ్రాసే వీలుంది: 祝詞 (ప్రస్తుత ప్రమాణం), 詔戸言, 詔刀言 , 諄辞 కూడా ధృవీకరణ పొందాయి.[3]
నోరిటో అసలు అర్థాన్ని వివరిస్తూ ఇటీవలి రచయిత ఒకరు " సామాన్య అర్థంలో వివరించాలంటే, పదాల ద్వారా మాయాజాలం అని అర్థం. [7] అని చెప్పాడు.
స్వరూపం, విషయం
మార్చుషింటో మతం, మతపరమైన ధార్మిక విషయాలను కలిగి ఉండే నోరిటో మినహా, ఇతర ఎటువంటి రాతపూర్వక గ్రంధాలను, ప్రత్యేకించి పురాణాలు, ఇతిహాసాల నుండి ఊహించినవి రూపొందించలేదు.[8] ఈ ప్రార్థనల్లో ప్రధానంగా ఆచారపరమైన శుద్దీకరణకు ఉపయోగపడేవి, కామి ఆశీర్వాదం కోసమో, వాతావరణం అనుకూలించి వర్షం కురియటానికో, లేదా దేవతల పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసేవో ఉంటాయి. [9]
భావి తరాల సంచారాన్ని సులభతరం చేయడానికి లయబద్ధంగా పఠించే పద్య రూపమే నోరిటో . [9] సాధారణంగా కామికి ఉన్న అత్యున్నత శక్తిని గురించిన ప్రశంసలతో ఈ మంత్రం ప్రారంభమవుతుంది, కామి పట్ల తమ గౌరవ, విస్మయాలని వ్యక్తీకరిస్తూ ముగుస్తుంది. [9] నకటోమి నో హరే కుంగే లేదా శుద్దీకరణ యొక్క ఆచారాల ప్రదర్శన, ఒక ప్రక్రియలో నోరిటోను గురించి వర్ణిస్తూ, అది మానవులు తమ స్వచ్ఛతను కోల్పోయిన కామి పిల్లలుగా భావించడాన్ని సూచిస్తూ, దానిని పునరుద్ధరించడం ద్వారా వారిని తిరిగి దైవిక మూలాలకు మల్లిస్తుందని వివరించింది. [10]
చదవడం
మార్చునోరిటో ను విభిన్నమైన మాన్‌యాగానా సాంప్రదాయం లో వ్రాయటం జరిగింది. (ఇప్పటికీ అలానే వ్రాస్తున్నారు). దీంట్లో కణాలు, ప్రత్యయాలు ప్రధాన భాగపు ముఖ్య పదాల లిపి కంటే చిన్న లిపిలో వ్రాసి ఉంటాయి. [11] ఈ రాత శైలి ని సామ్రాజ్యవాద శాసనాలలో (సెన్మ్యో 宣命senmyō) ఉపయోగించారు. ఇవి షోకు నిహొంగి లోను, 8వ శతాబ్దం (నారా కాలం ) నాటి మరి ఇతర గ్రంథాలలోను నిక్షిప్తమై ఉన్నాయి, వాటిని సెన్మ్యోగాకి (senmyōgaki) అంటారు. [12]
ఇవి కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ Philippi, Donald L. (1990). Norito: A Translation of the Ancient Japanese Ritual Prayers. Princeton University Press. p. vii. ISBN 0691014892.
- ↑ "Norito". Encyclopedia Britannica.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 Motosawa, Masafumi. "Norito". Encyclopedia of Shinto. Kokugakuin University.
- ↑ Philippi (1990). p. 1.
- ↑ Kitagawa, Joseph Mitsuo (1987). On Understanding Japanese Religion. Princeton University Press. p. 67. ISBN 978-0691102290.
- ↑ 6.0 6.1 Philippi (1990). p. 2.
- ↑ Shiraishi, Mitsukuni, cited in Philippi (1990). p. 2.
- ↑ de Bary, William Theodore; Keene, Donald; Tanabe, George; Varley, Paul (2001). Sources of Japanese Tradition: From earliest times to 1600, Second Edition. New York: Columbia University Press. pp. 336. ISBN 0231121385.
- ↑ 9.0 9.1 9.2 Okuyama, Yoshiko (2015). Japanese Mythology in Film: A Semiotic Approach to Reading Japanese Film and Anime. Lanham, MD: Lexington Books. p. 87. ISBN 9780739190920.
- ↑ Picken, Stuart D. B. (2004). Sourcebook in Shinto: Selected Documents. Westport, CT: Greenwood Publishing Group. pp. 84–85. ISBN 0313264325.
- ↑ Sinor, Denis, ed. (1969). American Oriental Society, Middle West Branch, Semi-Centennial Volume: A Collection of Original Essays. Indiana University Press. pp. 242–243.
- ↑ Seeley, Christopher (1991). A History of Writing in Japan. Brill. pp. 54–55. ISBN 978-9004090811.