నౌపడా

ఒడిశా రాష్ట్రం నౌపడా జిల్లా ముఖ్యపట్టణం

నౌపడా, ఒడిషా రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. దీన్ని నౌపాడ అని కూడా అంటారు. ఇది నౌపడా జిల్లాకు కేంద్రం. 1993 మార్చి 27 న అవిభక్త కలాహండి జిల్లా నుండి నౌపడా జిల్లా ఏర్పాటైంది. ఇది ఒడిశా పశ్చిమ సరిహద్దులో ఉంది. జిల్లా భాషాపరంగా, సాంస్కృతికంగా ఒడిషాలో భాగం. ఇది భారతదేశంలోని అత్యంత వెనకబడ్డ జిల్లాలలో ఒకటి.

నౌపడా
నౌపాడ
—  పట్టణం  —
నౌపడా is located in Odisha
నౌపడా
నౌపడా
Location in Odisha, India
Country  India
రాష్ట్రం Odisha
జిల్లా నౌపడా
Time zone IST (UTC+5:30)
Vehicle registration OD-26

జనాభా మార్చు

నౌపడా జనాభా 6,10,382. జనాభాలో పురుషుల సంఖ్య 3,01,962, స్త్రీ జనాభా 3,08,420 మంది ఉన్నారు. జనాభాలో అక్షరాస్యుల సంఖ్య 2,99,383 అని అంచనా. అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని స్పష్టమైంది.

ఆసక్తికరమైన ప్రదేశాలు మార్చు

 
యోగేశ్వర దేవాలయం, పటోరా

నౌపడా నుండి 18 కి.మీ. దూరంలో ఉన్న పటోరా లోని యోగేశ్వర్ దేవాలయం దాని పురాతన శివలింగానికి ప్రసిద్ధి చెందింది.[1] కొత్త ఆలయ నిర్మాణానికి గుల్షన్ కుమార్ సహకరించాడు.[2]

మూలాలు మార్చు

  1. "Patora Jogeswar Temple". Odishatravels.com. 2012. Retrieved 17 May 2012. The Linga of Lord Siva (Sibalinga) is pretty old, dating back to 6th century
  2. "Tourism :: Photo Gallery". nuapada.nic.in. 2012. Archived from the original on 8 April 2012. Retrieved 17 May 2012. The help of cassette king late Gulshan Kumar is significant.
"https://te.wikipedia.org/w/index.php?title=నౌపడా&oldid=3990299" నుండి వెలికితీశారు