పండిట్ జస్రాజ్

భారతీయ సాంప్రదాయ గాయకుడు

పండిట్ జస్రాజ్ (జ: జనవరి 28, 1930), హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.

పండిట్ జస్రాజ్
Pandit Jasraj 2007.jpg
వ్యక్తిగత సమాచారం
మూలంHissar, హర్యానా, భారతదేశం
రంగంHindustani classical music,
Mewati Gharana
వృత్తిClassical Vocalist
క్రియాశీల కాలం1945 - present
వెబ్‌సైటుOfficial site

బాల్యంసవరించు

జస్రాజ్ హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో మేవాతి ఘరానాకు చెందిన కుటుంబంలో జన్మించాడు. తండ్రి పండిట్ మోతీరామ్‌జీ శాస్త్రీయ సంగీత కళాకారుడు. జస్రాజ్ తన నాలుగేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు.

సంగీత ప్రస్థానంసవరించు

జస్రాజ్ తొలి సంగీత గురువులు తండ్రి పండిట్ మోతీరామ్, అన్న పండిట్ మణిరామ్‌జీ లు. తరువాత జస్రాజ్ మహరాజా జయవంత్ సింగ్‌జీ వఘేలా వద్ద శిష్యరికం చేశాడు. జస్రాజ్ తన చిన్నప్పుడు ప్రఖ్యాత గజల్ గాయని, బేగం అక్తర్ శ్రావ్యమైన గొంతు విని ఎంతో ప్రభావితుడై, బడికి ఎగనామం పెట్టి ఒక చిన్న హోటల్‌లో వినిపించే ఆమె పాటలను రోజంతా వినేవాడు. 1960 లో, జస్రాజ్ ఒకసారి హాస్పిటల్‌లో ఉన్న బడే గులాం అలీఖాన్ను కలిసినప్పుడు, ఆయన జస్రాజ్‌ను తన శిష్యుడిగా ఉండమన్నాడు. కాని తను ఇదివరకే పండిట్ మోతీరామ్ శిష్యుడినని, జస్రాజ్‌ ఆయనను తిరస్కరించాడు. అన్న మణిరామ్‌జీ జస్రాజ్‌ను, తబలా సహకారం కోసం తన వెంట తీసికెళ్ళేవాడు. ఆ కాలంలో సారంగి వాద్యకారుల మాదిరే, తబలా వాద్యకారులను జనం చిన్నచూపు చూసేవారు. దాంతో జస్రాజ్ అసంతృప్తిపొంది, తబలాకు స్వస్తి చెప్పి, గాత్రం నేర్చుకొన్నాడు. జస్రాజ్ ఒక ప్రత్యేక వినూత్న పద్ధతిని జుగల్‌బందిలో ప్రవేశపెట్టాడు. అందులో పురాతన మూర్ఛనల పై అధారపడిన ఒక శైలిలో, గాయని, గాయకుడు తమ వేర్వేరు రాగాలను ఒకేసారి ఆలపిస్తారు.

పేరెన్నికగన్న శిష్యులుసవరించు

సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్‌నాథ్ లు. బాలివుడ్ గాయని సాధనా సర్గమ్ జస్రాజ్ శిష్యురాలే. తన తండ్రి జ్ఞాపకార్థం, జస్రాజ్ ప్రతి సంవత్సరం, పండిట్ మోతీరామ్, పండిట్ మణిరామ్‌ సంగీత్ సమారోహ్ను హైదరాబాద్‌లో గత 30 ఏళ్ళుగా నిర్వహిస్తున్నాడు.

పురస్కారాలుసవరించు

ఇంటర్నేషనల్ ఏస్ట్రనామికల్ యూనియన్, శుక్ర, గురు గ్రహాలకు మధ్య ప్రాంతంలో కనుగొన్న గ్రహశకలానికి పండిట్ జస్రాజ్ పేరిట "పండిట్‌జస్రాజ్" అని పేరు పెట్టింది.[1]

ఆల్బంలుసవరించు

 • బైజూ బావ్రా ( 2008 )
 • ఉపాసన ( 2007 )
 • తపస్య వాల్యూమ్. 1 ( 2005 )
 • దర్బార్ ( 2003 )
 • మహేశ్వర మంత్ర ( 2002 )
 • సౌల్ ఫుడ్ ( 2005 )
 • జస్రాజ్, పండిట్ - వాల్యూమ్. 2 - హవేలీ సంగీత్
 • ఇన్స్పిరేషన్ ( 2000 0
 • రాగాలు - త్రివేణి, ముల్తానీ
 • రాగాలు - బిహడ, గౌడగిరి మల్హార్
 • వర్షిప్ బై మ్యూజిక్ / లైవ్ స్టుగ్గార్ట్' 88
 • ఆర్నమెంటల్ వాయిస్

బయటి లింకులుసవరించు

 • [1] పండిట్ జస్రాజ్ వీడియో ఇంటర్‌వ్యూ
 • [2] పండిట్ జస్రాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్, న్యూయార్క్
 • [3] పూర్వి రాగ - వీడియో
 • [4] జస్రాజ్‌తో ముఖాముఖి
 • [5] మేరో మన్ మోహియా

వనరులుసవరించు

 • 1. [6] ఎక్స్‌ప్రెస్స్ ఇండియా - వార్తలు
 • 2. [7] జస్రాజ్‌పై మోహన్ నడ్‌కర్ణి వ్యాసం
 • 3.[8] హిందూ దినపత్రికలో హైదరాబాద్‌లో సంగీత్ సమారోహ్ గురించి వార్త -

మూలాలుసవరించు

 1. "గ్రహశకలాలకు మన పేర్లు". www.andhrajyothy.com. 2019-10-03. Archived from the original on 2019-10-03. Retrieved 2019-10-03.