పచ్చని సంసారం (1993 సినిమా)


పచ్చని సంసారం 1993 జనవరి 9న విడుదలైన తెలుగు సినిమా. పామెక్స్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం కింద జి.హరిబాబు నటించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. కృష్ణ, ఆమని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

పచ్చని సంసారం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.భరద్వాజ్
తారాగణం కృష్ణ,
ఆమని
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ పామెక్స్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కృష్ణ,
  • ఆమని,
  • నిరోష,
  • రాజ్ కుమార్,
  • కోట శ్రీనివాసరావు,
  • బాబు మోహన్,
  • సుధాకర్,
  • రామరాజు,
  • చంద్రకాంత్

సాంకేతిక వర్గం మార్చు

దర్శకత్వం: తమ్మారెడ్డి భరత్వాజ

నిర్మాత: జి. హరి బాబు;

రచయిత: తమ్మారెడ్డి భరత్వాజ;

సినిమాటోగ్రాఫర్: శరత్;

స్వరకర్త: విద్యాసాగర్ (సంగీత దర్శకుడు);

సాహిత్యం: భువన చంద్ర, మల్లెమాల

కళాదర్శకులు: కొండపనేని రామలింగేశ్వరరావు

కథ మార్చు

సూపర్ స్టార్ కృష్ణ తన సవతి సోదరులకు విద్యాబుద్ధులు నేర్పించే త్యాగం చేసే హీరోగా నటించాడు, కానీ వారిచే వదిలివేయబడతాడు. అతని సవతి సోదరులు తమ తప్పును గుర్తించి తిరిగి కలుస్తుండగా, అతను ఒక ఊరి పొలిమేరలో ఒక ఎండిపోయిన భూమిని ఒంటరిగా సాగు చేస్తాడు. తండ్రిని చంపి కుటుంబాన్ని నాశనం చేసిన విలక్షణమైన విలన్‌గా శ్రీనివాసరావు నటించాడు.

మూలాలు మార్చు

  1. "Pachani Samsaram (1993)". Indiancine.ma. Retrieved 2022-12-18.

బాహ్య లంకెలు మార్చు