పద్మావతి బందోపాధ్యాయ

పద్మావతి బందోపాధ్యాయ ( జననం. నవంబరు 4 1944) భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళగా చరిత్రలో నిలిచారు. (ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ పునీతా అరోరా మొదటివారు)

పద్మావతి బందోపాధ్యాయ
Padma bandopadyaya.jpg
పద్మావతి బందోపాధ్యాయ
జననం(1944-11-04)1944 నవంబరు 4
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
రాజభక్తిభారత దేశము

కెరీర్సవరించు

పద్మావతి బందోపాధ్యాయ 1944 లో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జన్మించారు. ఆమె న్యూఢిల్లీలో పెరిగారు.అచట కిరోరీ మాల్ కాలేజీలో విద్యనభ్యసించారు.ఆమె 1968 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. ఆమె ఎస్.ఎన్.బంధోపాధ్యాయను వివాహమాడారు. ఆయన కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసరుగా ఉండేవారు. ఆమెకు "ఇండో-పాకిస్థాన్ యుద్ధం-1971" చేసిన కృషికి "విశిష్ట సేవా మెడల్" లభించింది.ఆమె జీవితంలో భారత దేశంలో ఫెలో ఆఫ్ ద ఎయిరోస్పేస్ మెడికల్ సొసైటీకి ఎంపికైన మొదటి మహిళగా చిలిచారు. దక్షిణ ధ్రువంలో వైజ్ఞానిక పరిశోధనలు చెసిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచారు. 1978 లో డిఫెన్స్ సర్వీసు స్టాఫ్ కాలేజీ కోర్సును పూర్తి చేసిన మొదటి మహిళా అధికారి ఆమె. ఆమె విమాన ప్రధాన కార్యాలయంలో డైరక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్ గా పనిచేశారు.2002 లో ఎయిర్ వైస్ మార్షల్ (రెండు నక్షత్రాల ర్యాంకు) పదోన్నతి పొందిన మొదటి మహిళ ఆమె. బందోపాధ్యాయ ఏవియేషన్ మెడిసన్ స్పెషలిస్టు, న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యురాలు.[1][2]

మూలాలుసవరించు

  1. IANS (1 October 2004). "Indian Air force gets first woman air marshal". Times of India. Archived from the original on 27 మే 2006. Retrieved 8 April 2010. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. Joshi, Payal (2 October 2004). "India's Pride - Padmavathy Bandhopadhyay First woman Air Marshal". India Star. Archived from the original on 31 జనవరి 2010. Retrieved 8 April 2010. {{cite web}}: Check date values in: |archive-date= (help)

ఇతర లింకులుసవరించు