పనిముట్టు (సాధనం, పరికరం, ఉపకరణం) అనేది ఏదైనా పనిని త్వరగా, సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువు. పనిముట్ల ద్వారా వ్యక్తి యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మానవుడు ఆదిమానవుడి దశ నుంచే రాతి ఉపకరణాలను ఉపయోగించడం మొదలు పెట్టాడు, తరువాత కలపతో, ఎముకలతో, లోహంతో పరికరాలు తయారు చేసుకొని వాటిని ఉపయోగించడం మొదలు పెట్టాడు. మానవ పరిణామం యొక్క చరిత్ర సాధనాల గుర్తింపుతో ప్రారంభమవుతుంది, సాధనాలను ఉపయోగించుకొనే సామర్థ్యం పైనే మానవుని అభివృద్ధి ఆధారపడి వుంది. సాధనాలను తయారు చేయడానికి సాధనాలు ఉపయోగపడతాయి. మానవులు మాత్రమే పరికరాలను ఉపయోగిస్తారని, పరికరాలను ఉపయోగించడం వలన మానవుడు చాలా అభివృద్ధి చెందాడని ఒక నమ్మకం. కానీ కొన్ని పక్షులు, కోతులు కూడా సాధారణ ఉపకరణాలను ఉపయోగిస్తాయి. పారిశ్రామిక విప్లవం సమయంలో యంత్ర పరికరాల కారణంగా కొత్త సాధనాల ఉత్పత్తి అకస్మాత్తుగా పెరిగింది.

వ్యవసాయ పరికరాల ప్రదర్శన

పనిముట్లను ఉపయోగించే కొలది వాటి సామర్థ్యం పెరుగవచ్చు లేదా తగ్గవచ్చు. ఉదాహరణకు బ్లేడ్ సామర్థ్యం ఉపయోగించే కొద్ది తగ్గుతుంది. ఎందుకంటే బ్లేడు తయారు చేసినప్పుడే అత్యధిక పదునుతో చేయబడుతుంది, ఉపయోగించిన కొలది పదును తగ్గి మొద్దుబారి పని సామర్థ్యం తగ్గుతుంది. చలగపార కొత్తది మొద్దుగా ఉంటుంది, దానిని నేలను త్రవ్వడానికి ఉపయోగించినప్పుడు దాని అంచులు రాపిడి గురై పదును పెరిగి దాని పని సామర్థ్యం పెరుగుతుంది.

సాధారణ యంత్రాలను ప్రాథమిక సాధనాలు అని పిలుస్తారు. సుత్తి ఒక సాధనం, అదేవిధంగా, టెలిఫోన్ కూడా ఒక సాధనం.

పనిముట్లను తరచుగా వాడకపోయినట్లయితే అవి పాడవుతాయి, ఇనుప పనిముట్లకు చిలుము పట్టి పాడవుతాయి, కలప పనిముట్లు చెదలు పట్టి పాడవుతాయి.

ఇనుప పనిముట్లను కొంత కాలం పాటు పక్కన ఉంచవలసి వస్తే వాటికి నూనెలు వ్రాసి భద్రపరుస్తారు, అందువలన అవి తొందరగా పాడుకావు. కత్తెర, కత్తి, చాకు, కత్తిపీట వంటి సాధనాలు మొద్దుబారినప్పుడు వాటికి పదును పెట్టి వాడుకోవాలి, అప్పుడు అవి బాగా పనిచేస్తాయి.

నిర్మాణ సాధనాలుసవరించు

చలగపార, గడ్డపార, తాపీ, బద్ధ మొదలగున్నవి.

వ్యవసాయ పనిముట్లుసవరించు

చలగపార, దోకురుపార, గడ్డపార, నాగలి, కత్తి మొదలగున్నవి.

మెకానిక్ ఉపకరణాలుసవరించు

సుత్తి. స్కూడ్రైవర్, స్పానర్ మొదలగున్నవి.

ఆఫీసు ఉపకరణాలుసవరించు

పెన్ను, పెన్సిల్, రబ్బరు (ఏరేజర్‌), షార్ప్‌నర్‌, గమ్‌ ట్యూబ్‌, స్టాఫ్లర్‌ మొదలగున్నవి.

ఇంటిలో సాధారణంగా ఉపయోగించే ఉపకరణాలుసవరించు

కత్తెర, బ్లేడు, పిన్నీసు, పక్కపిన్నీసు, దబర, గరిట, స్పూను, కత్తి, చాకు, కత్తిపీట మొదలగున్నవి.