గడ్డపార

(పలుగు నుండి దారిమార్పు చెందింది)

గడ్డపార (లేదా గునపం లేదా గడ్డపలుగు) అనగా ఇనుము ఉక్కు లోహాలతో తయారైన స్థూపాకారపు మనిముట్టు. దీనిని ప్రధానంగా భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ బరువును(సుమారు 5 కిలోగ్రాములు) కలిగి ఉండి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది. కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు. దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా త్రుప్పు పట్టి పాడవుతుంది. దీనిని వ్యవసాయ పనులు చేయడానికి ఉపయోగిస్తారు.

గడ్డపారల సహాయంతో పెద్ద పెద్ద రాళ్ళను పెక్కలించి ఎత్తుతున్న చిత్రం.

జాగ్రత్తలు మార్చు

దీనిని ఉపయోగించేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

సామెతలు మార్చు

  • గడ్డపారలు గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా గతి ఏమీ అన్నదిట.
  • గడ్డపారలకు పగులని బండలు, చెట్ల వేళ్ళకు చెప్పకుండా పగులుతాయి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గడ్డపార&oldid=3020852" నుండి వెలికితీశారు