పల్నాటి బ్రహ్మ నాయుడు

పలనాటి బ్రహ్మనాయుడు 2003 లో వచ్చిన యాక్షన్ చిత్రం. వెంకట రమణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మేడికొండ మురళీకృష్ణ బి. గోపాల్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఇది. నందమూరి బాలకృష్ణ, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే ప్రధాన పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నమోదైంది. 2006 లో టైగర్: భవానీ పేరుతో హిందీ లోకి అనువదించారు. ఇలాంటి కథతోనే ఉన్న కన్నడ చిత్రం రాజా నరసింహను - రైలును ఆపే సన్నివేశం లేకుండా - దీనికంటే ఆరు వారాల ముందు విడుదల చేశారు.[1]

పల్నాటి బ్రహ్మనాయుడు
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
నిర్మాణం మేడికొండ వెంకట మురళీకృష్ణ
తారాగణం నందమూరి బాలకృష్ణ
ఆర్తి అగర్వాల్
సొనాలి బింద్రే
సంగీతం మణిశర్మ
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

ఎస్‌ఎస్‌ఎస్ భవానీ ప్రసాద్ (నందమూరి బాలకృష్ణ) కారంపూడిలో నివసిస్తూ ఉంటాడు. ఎన్నారైతో నిశ్చితార్థం చేసుకున్న శ్రుతి (ఆర్తి అగర్వాల్) అనే అమ్మాయి భవాని ప్రసాద్‌తో ప్రేమలో పడుతుంది. శివ నాగేశ్వరి (సోనాలి బెంద్రే) అనే మహిళ వారి పెళ్ళి మండపం లోకి ప్రవేశించి భవానీ ప్రసాద్ పై కాల్పులు జరుపుతుంది. మిగిలిన చిత్రమంతా ఈ కాల్పులు జరపడానికి కారణాల గురించి, దాని తరువాత వచ్చే పరిణామాల గురించీ చెబుతుంది.

భవానీ ప్రసాద్ (నందమూరి బాలకృష్ణ) ప్రజల మంచి కోసం పనిచేసే స్థానిక నాయకుడు. ప్రజలు ఆయనను గౌరవిస్తారు, ఆరాధిస్తారు, అతని కోసం తమ జీవితాన్నైనా వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. భవానీ ప్రసాద్ సోదరి పెళ్ళి సందర్భంగా, అతను తన సోదరి స్నేహితురాలు శ్రుతిని కలుస్తాడు. శ్రుతి, అమెరికాలో జన్మించిన భారతీయుడైన పృథ్వికి కాబోయే భార్య. పెళ్ళికి ముందు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని అతను ఆమెను కోరడంతో ఆమె అతడి నుండి విడిపోతుంది. ఈ సమయంలో, ఆమె భవానీ ప్రసాద్‌తో ప్రేమలో పడుతుంది. వారి వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరిస్తాయి. ఈ సందర్భంగా శివ నాగేశ్వరి ప్రవేశించి భవానీ ప్రసాద్‌పై కాల్పులు జరుపుతుంది.

రెండవ భాగంలో ఫ్లాష్‌బ్యాక్ ఆవిష్కరించింది. భవానీ ప్రసాద్ వద్ద పనిచేసే వ్యక్తులలో ఒకరిని (జతిన్) ప్రత్యర్థి వర్గం నాగాయలంక నరసింగ నాయుడు (జెపి రెడ్డి) కు చెందిన గూండాలు ఏ కారణమూ లేకుండా కొడతారు. అతను తన కుమార్తె శివ నాగేశ్వరికి ప్రేమలేఖలు రాశాడని భావించి, అతన్ని తుక్కు కింద కొడతారు. ఈ కారణంగా, జతిన్ శాశ్వతంగా వికలాంగుడై పోతాడు. భవానీ ప్రసాద్ నాగేశ్వరిని జతిన్ కిచ్చి పెళ్ళి జరిపిస్తానని శపథం చేస్తాడు. కాని అప్పటి నుండి కథ యు-టర్న్ తీసుకుంటుంది.

భవానీ ప్రత్యర్థులలో మరొకరు ముఖేష్ రుషి, నరసింగ నాయుడుతో చేతులు కలిపి భవానీ ఇమేజ్ దెబ్బతీసి శివ నాగేశ్వరి పెళ్ళిని ఆపాలని చూస్తాడు. ముఖేష్ రుషి కుమారుడు భవానీ సోదరితో ప్రేమలో పడ్డాడనీ, కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరించి మరొకరిని పెళ్ళి చేసుకున్నదనీ కూడా తెలుస్తుంది. ఈ అపకీర్తి సంఘటనలకు శృతి భవాని

ప్రసాద్ లను పెళ్లి చేసుకోండి అని శృతి వల చెల్లి శివ నాగేశ్వరి అంటుంది

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

పాటలుసవరించు

మణి శర్మ సంగీతం సమకూర్చిన పాటలను ADITYA మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది.

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "గుండమ్మో గుండమ్మో"  ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, కల్పన 4:57
2. "బృందావనంలో"  మల్లికార్జున్, కల్పన 5:53
3. "బందరులో"  శంకర్ మహదేవన్, కె.ఎస్.చిత్ర 5:25
4. "ఓసోసి పూలతీగ"  ఉదిత్ నారాయణ్, సుజాత 4:53
5. "పలకా బలపం"  మనో శాలినీ సింగ్ 4:45
6. "సరసాల సుందరయ్య"  కార్తిక్, రాధిక, పూర్ణిమ 5:47
మొత్తం నిడివి:
31:51

మూలాలుసవరించు

  1. http://www.vishnuvardhan.com/rajaNaraSimha.htm