పల్మనరీ ఫైబ్రోసిస్
పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది రోగి ఊపిరితిత్తులు కాలక్రమేణా మచ్చలు (స్కార్స్) అయ్యే పరిస్థితి. శ్వాస ఆడకపోవడం, పొడి దగ్గు, అలసట, బరువు తగ్గడం, గోరు కొట్టుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.[1] పల్మనరీ హైపర్ టెన్షన్, శ్వాస వైఫల్యం, న్యుమోథొరాక్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చు.[2]
పల్మనరీ ఫైబ్రోసిస్ | |
---|---|
ఇతర పేర్లు | మధ్యంతర ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ |
వైద్య ఇమేజింగ్, ఊపిరితిత్తుల కణజాల పరీక్ష (బయాప్సీ) ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, ఛాతీ ఎక్స్ కిరణాల పటం | |
ప్రత్యేకత | శ్వాసకోస వ్యాధులు |
లక్షణాలు | శ్వాస ఆడకపోవడం, పొడి దగ్గు, అలసట, బరువు తగ్గడం, గోరు కొట్టుకుపోవడం |
సంక్లిష్టతలు | పల్మనరీ హైపర్ టెన్షన్, శ్వాస వైఫల్యం, న్యుమోథొరాక్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్ |
కారణాలు | పర్యావరణ కాలుష్యం, కొన్ని రకాల మందులు, బంధన కణజాల వ్యాధులు, అంటువ్యాధులు, మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధులు |
ప్రమాద కారకములు | పల్మనరీ హైపర్ టెన్షన్, శ్వాస వైఫల్యం, న్యుమోథొరాక్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్ |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలు, వైద్య ఇమేజింగ్, ఊపిరితిత్తుల కణజాల పరీక్ష (బయాప్సీ) ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు |
చికిత్స | ఆక్సిజన్ చికిత్స, ఊపిరితిత్తుల పునరావాసం, ఊపిరితిత్తుల మార్పిడి |
ఔషధం | పిర్ఫెనిడోన్, నింటెడానిబ్ |
తరుచుదనము | 5 మిలియన్ల మంది ప్రజలు |
మరణాలు | ఆయుఃప్రమాణం సాధారణంగా ఐదు సంవత్సరాల లోపే |
కారణాలు
మార్చుఈ పరిస్థితికి కారణాలు పర్యావరణ కాలుష్యం, కొన్ని రకాల మందులు, బంధన కణజాల వ్యాధులు, అంటువ్యాధులు, మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధులు వంటివి. చాలా సాధారణంగా ఏది తెలియని కారణం వల్ల ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐ.పి.ఎఫ్) అనే మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి ఏర్పడుతుంది. [1][3] రోగనిర్ధారణ సాధారణంగా లక్షణాలు, ఎక్స్ కిరణాల పటం, వైద్య ఇమేజింగ్, ఊపిరితిత్తుల కణజాల పరీక్ష (బయాప్సీ), ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు ఆధారంగా ఉండవచ్చు.[1]
సాధారణంగా దీనికి చికిత్స లేదు . చికిత్స అనేది రోగ లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఆక్సిజన్ చికిత్స, ఊపిరితిత్తుల పునరావాసం ఉండవచ్చు.[1][4] మచ్చలు మరింత తీవ్రతరం కావడాన్ని తగ్గించడానికి కొన్ని మందులను ఉపయోగించవచ్చు.[4] ఊపిరితిత్తుల మార్పిడి అప్పుడప్పుడు ఎంపిక సాధ్యం కావచ్చు .[3] ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధికి ప్రభావితమయ్యారు.[5] ఈ వ్యాధిగ్రస్తుల ఆయుఃప్రమాణం సాధారణంగా ఐదు సంవత్సరాల లోపే ఉంటుంది .[3]
సూచనలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "Pulmonary Fibrosis". medlineplus.gov. Archived from the original on 5 July 2016. Retrieved 20 December 2019.
- ↑ "Pulmonary fibrosis - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2014. Retrieved 20 December 2019.
- ↑ 3.0 3.1 3.2 "Pulmonary Fibrosis". MedicineNet, Inc. Archived from the original on 19 July 2014. Retrieved 26 July 2014.
- ↑ 4.0 4.1 "Pulmonary fibrosis - Diagnosis and treatment - Mayo Clinic". www.mayoclinic.org. Archived from the original on 4 July 2014. Retrieved 20 December 2019.
- ↑ "American Thoracic Society - General Information about Pulmonary Fibrosis". www.thoracic.org. Archived from the original on 20 December 2019. Retrieved 20 December 2019.