పల్లెల్లో న్యాయవ్యవస్థ

పల్లెల్లో న్యాయ వ్వవస్త:....

ఆ రోజుల్లో పల్లెల్లో న్యాయ పరమైన విషయాలను వారి కుల పెద్దలు విచారించి తగు నిర్ణయం తీసుకునేవారు. కులపెద్దలే న్యామ మూర్తులు, వారి తీర్పే అంతిమం. కోర్టులు, పోలీసుల ప్రసక్తే వుండేది కాదు. కుల పెద్దలే పెద్దమనుషులు. ఒక వేళ ఎవరైనా పెద్ద మనుషుల మాటను కాదంటే వారికి విదించే శిక్ష ఏమంటే..... వారింటికి చాకలిని మంగలిని నిలిపి వేయడం. అటు వంటి సందర్భంలో చాకలిని, మంగలిని పిలిపించి వారితో పలాన వారికి శిక్ష వేశాము... వారి ఇంటికి 'పనికి' వెళ్ల కూడదు. అని తమ నిర్ణయం చెప్పేవారు. చాకలి, మంగలి పెద్ద మనుషుల మాటలను తప్పకుండా పాటించే వారు. అది నిందితులకు పెద్ద అవమానం. వ్వవహారాన్ని అంత దూరం రానిచ్చే వారు కాదు. మిగతా వూరి పెద్దలు నిందితులను ఒప్పించి రాజీ కుదిర్చే వారు. అంతటితో ఆ వ్యవహారం ముగిసేది. ఇంతకన్నా పెద్ద శిక్ష మరొకటి వుండేది. అది నిందితుడు మాట వినక పోతే సాంఘిక బహిష్కరణ చేసె వారు. అంటే నిందితునితో గాని, వారి ఇంటి వారితో గాని ఆ ఊరు వారెవ్వరు మాట్లాడ కూడదు. వ్యవసాయ పనుల్లో వారికెవ్వరికి సహాయం చేయ కూడదు. వారి సహాయము తీసు కోకూడదు. పండగ సందర్భాలలో దేవుని ముందు పొంగలి పెట్టెటప్పుడు అందరితో బాటు వారిని పొంగలి పెట్టనిచ్చేవారు కారు. సాధారణంగా గంగమ్మ వద్ద గంగపండగ నాడు, పసల పండగ నాడు కాటమ రాజు దగ్గర వూరి వారందరు సామూహికంగా పొంగలి పెట్టే వారు. శిక్ష పడిన వారిని ఇటువంటి పొంగళ్లను పెట్ట నిచ్చె వారు కాదు. ఇలా వుండేవి ఆనాటి శిక్షలు. ఆ పెద్దమనుషుల తీర్పులి కూడా నిష్పత్తి పాతంగా వుండేవి.సర్వ జనాదరణ పొందేవి. రాను రాను ఈ వ్వవస్తలో చాల తొందరగా మార్పు జరిగింది. స్వార్థపరులైన కొందరు కుల పెద్దలు, లేదా వూరి పెద్ద మనుషులు తమ స్వార్థానికి అనుకూలంగా తీర్పు చెప్పి ఆదాయం గడించేవారు వచ్చారు. వారి ఆగడాలు మించి పోవడంతో ప్రజలలో వారి పై ఏహ్యభావం కలిగి వారివద్దకు పోవడం గాని, తీర్పు చెప్పమని కాని అడిగేవారు లేకుండా పోయారు. అలాంటి వారు మెల మెల్లగా రాజకీయాల వైపు మొగ్గు చూపి అలా స్థిర పడి పోయారు. ఆ విధంగా రాజకీయాలు కలుషితం ఐపోయాయి. ఈనాడు సరైన కుల పెద్దలులేరు, అరా కొరా అక్కడక్కడా వున్న వారి మాట వినే పరిస్థితి లేదు. ఆపడానికి చాకలి గాని మంగలి గాని లేరు. ప్రస్తుతం పల్లెల్లోని ప్రజలు కూడా చాకలి, మంగలి లేకుండానె కాలం వెళ్ల బుచ్చు తున్నారు. ఎవరి బట్టలను వారె ఉతుక్కుంటున్నారు. వారికి అనుకూలంగా.... అన్నట్లు డిటర్జెంట్లు, సర్పులు ఎక్కువగా వచ్చాయి. అదియును గాక మురికి తొందరగా వదిలిపోయె టెర్లిన్, టెరికాటన్, నైలాన్ వంటి సింతటిక్ బట్టలు ఎక్కువయ్యాయి. గతంలో పల్లె ప్రజలు తమ గడ్డాన్ని కూడా తాము గీసుకునె దానికి తెలిసేది కాదు. దానికి తగిన సామాగ్రి వుండేది కాదు. కాలం మారింది. రేజరు, బ్లేడ్లు పల్లెలకొచ్చాయి. యువతరం వాటిని బాగానె వాడు కుంటున్నారు. మంగలిని మరిచి పోయారు. కాని పెద్ద వారికే ఆ పని కొంత ఇబ్బందిగా ఉంది. కాని చాకలి, మంగలికి పల్లెల్లో అత్యంత ప్రముఖమైన సామాజిక బాధ్యతలున్నాయి. అవి ముఖ్యంగా పెళ్ళి, చావు వంటి సందర్భాలలో వారి అవసరం తప్పని సరి. ఎలాగోలా వారిని బతిమాలి, బామాలి నెట్టుకొస్తున్నారు. బహిష్కరించడానికి ఎవ్వరు పొంగళ్లు పెట్టడమే లేదు. అంచేత. .. ఏదైనా వ్యవహారం ముదిరితే పోలీసులు, కేసులు, కోర్టులల్లో తేలాల్సిందె.

ఇవి కూడా చూడండిసవరించు