పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి

పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి (జ.1915) కూచిపూడి నాట్యాచార్యుడు.

జీవిత విశేషాలు మార్చు

ఆయన మంగమ్మ, పసుమర్తి వెంకటేశ్వర్లు దంపతులకు 1915లో జన్మించాడు. ఆయన ప్రారంభంలో కూచిపూడి నాట్య శిక్షణను వారి తాతగారైన మహంకాళి చలపతి వద్ద నేర్చుకున్నాడు. ఆయన శిష్యరికంలో ఆయన లోహితాస్యుడు, ప్రహ్లాదుడు, లవుడు, కుశుడు వంటి పాత్రలలో నటించేటట్లు మలచబడ్డాడు.[1] ఆయన యేలేశ్వరపు సత్యనారాయణ, ముస్తి చిదంబర దీక్షితులు, చింతా కృష్ణమూర్తి, శ్రీరామమూర్తి లవద్ద స్త్రీ వేష ధారణ గూర్చి మెళుకువలు నేర్చుకున్నాడు. ఆయన స్త్రీ పాత్రలలో రాణించాడు. ఆయన సీత, ఉష, మోహిని, చంద్రమతి, సుభద్ర వంటి వేషధారణతో సభాసదుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన మహంకాళి వారి మేళం, వేదాంతం వారి మేళం, వేదాంతం నాట్యమండలి వంటి కూచిపూడి గ్రామంలోని సంస్థలలో పనిచేసాడు. ఆయన సర్వేపల్లి లోని వేదసభ చే సన్మానించబడ్డాడు. ఆయన 1937లో అంగలూరు లో సన్మానించబడ్డాడు. అనేక ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చాడు.

ఆయన కొంతకాలం పాటు కూచిపూడి గ్రామంలో ఉన్న నాట్యకళాశాల అయిన సిద్ధేంద్ర కళాక్షేత్రం లో పనిచేసాడు. ఆయన శిష్యులలో బొక్కా కృష్ణమూర్తి ప్రసిద్ధుడు. ఆయన ఉన్నతమైన, ఆదర్శవంఅమైన జీవితాన్ని గడిపి కూచిపూడిలో మంచి గురువుగా వెలుగొందాడు.[2]

మూలాలు మార్చు

  1. Kuchipudi, By Sunil Kothari, Avinash Pasricha
  2. "కూచిపూడి వెబ్‌సైటులో ఆయన జీవిత విశేషాలు". Archived from the original on 2016-12-07. Retrieved 2016-11-13.

ఇతర లింకులు మార్చు