పాండిచ్చేరి విశ్వవిద్యాలయం
పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కలదు. భారతదేశంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని బంగాళా ఖాతానికి ఆనుకొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది చెన్నై నుండి 168 kms దూరంలో కలదు. మాహే, కారైకల్, యానాం ,లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు కలిపి మొత్తం 93అనుబంధ కళాశాలలు, కమ్యూనిటీ కళాశాలలు కలవు. పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాల[2](PEC) దీనికి ఆనుకొని ఉంది, అది దీనికి అనుబంధంగా నడుస్తున్నది. పాండిచ్చేరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ [3](PIMS) దీని నియంత్రణ లో నడుస్తున్నది. క్యాంపస్ లో విద్యార్ధులు మొత్తం 6315 మంది, అనుబంధ కళాశాలలు, దూరవిద్యా ద్వారా కలిపి 72,671 విద్యార్ధులు 2018 లెక్కల ప్రకారం చదువుతున్నారు [4]
Université de Pondichéry | |
నినాదం | ఫ్రెంచి: Vers la Lumière |
---|---|
ఆంగ్లంలో నినాదం | From Darkness, towards the Light! |
రకం | Public |
స్థాపితం | 1985 |
ఛాన్సలర్ | వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి |
వైస్ ఛాన్సలర్ | గుర్మీత్ సింగ్ [1] |
స్థానం | కాలాపేట, పుదుచ్చేరి, భారతదేశం |
అనుబంధాలు | UGC |
జాలగూడు | www.pondiuni.edu.in |
విశిష్ఠతలు
మార్చుజె ఏ కె తరీన్ వైస్ చాన్సలర్గా ఉన్న కాలంలో యూజిసి XI ప్లాన్ నిధుల ద్వారా విశ్వవిద్యాలయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. యూజిసి XI ప్లాన్ నిధుల ద్వారా ఆడవారికి, వికలాంగులకు ఉచిత హాస్టల్ సౌకర్యం, విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా,సిల్వర్ జూబిలీ క్యాంపస్, వికలాంగులకు వెసులుబాటు కల్పించే విధంగా అన్నీ భవనాల్లో ర్యాంపుల నిర్మాణం జరిగాయి. ఈ సౌకర్యాలకు గాను 2012లో రాష్ట్రపతి నుండి ఉత్తమ విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.
గ్రంధాలయం
మార్చుగ్రంధాలయం పేరును ఆనంద రంగపిళ్లై గా నామకరణం చేశారు. ఇక్కడ ఏ.సి. సౌకర్యం, పుస్తకాలు తీస్కోడానికి ఆర్ ఎఫ్ ఐ డి., సౌకర్యం , పుస్తకాలను శోధించదానికి ప్రత్యేక సదుపాయం కలదు. దీనికి అనుబంధంగా రీడింగ్ హాల్ భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించి 2016 లో ఆవిష్కరించారు. ఈ రీడింగ్ హాల్ లో అంధుల సౌకర్యార్ధం బ్రైలి లిపిలో చదువుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం కలదు. ఇక్కడ ఒక డిబేట్ రూమ్, చిన్న థియేటర్ కూడా ఉన్నాయి.
సౌకర్యాలు
మార్చుఆడిటోరియం, జిమ్, క్యాంటీన్, బ్యాంక్ [1], పోస్ట్ ఆఫీసు, ఎ టి యం, డే కేర్ సెంటర్
హాస్టల్ సౌకర్యం
మార్చుపురుషులు
మార్చు- సుబ్రమణ్యభారతి హాస్టల్ (పరిశోధక విద్యార్థులకు)
- పవెండర్ భారాతిదాసన్ హాస్టల్
- సి వి రామన్
- ఠాగోర్
- కాళిదాస్
- కబీర్ దాస్
- కణ్ణదాసన్
- సర్వేపల్లి రాధాకృష్ణన్
- మౌలానా అబుల్ కలాం ఆజాద్ హాస్టల్
- కంబన్
- అబ్దుల్ కలాం
- ఇలంగో ఆడిగళ్
స్త్రీలు
మార్చు- యమునా
- కావేరీ
- సరస్వతి
- గంగా
- కల్పనా చావ్లా
- మేడమ్ క్యూరీ
- న్యూ గర్ల్స్ టవర్
విదేశీ విద్యార్ధుల కొరకు ప్రత్యేక హాస్టల్ కలదు. మొత్తం విద్యార్ధులు 3106 కలరు.
స్టూడెంట్ క్లబ్
మార్చుPUQS: పాండిచ్చేరి యునివర్సిటి క్విజ్ సొసైటి
REFLECTIONS: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఫిజిక్స్ విభాగం వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
స్కూల్స్, డిపార్టుమెంట్లు
మార్చుసుబ్రమణ్యభారతి స్కూల్ ఆఫ్ తమిళ భాష, సాహిత్యం
మార్చు- తమిళ భాష & సాహిత్యం
- స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
- స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
- నిర్వహణ అధ్యయనాల విభాగం
- వాణిజ్య విభాగం
- ఎకనామిక్స్ విభాగం
- పర్యాటక అధ్యయన విభాగం
- బ్యాంకింగ్ టెక్నాలజీ విభాగం
- అంతర్జాతీయ వ్యాపార విభాగం
కరైకల్ క్యాంపస్
మార్చు- నిర్వహణ విభాగం
- వాణిజ్య విభాగం
- కంప్యూటర్ సైన్స్ విభాగం
రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్
మార్చు- గణిత విభాగం
- గణాంకాల విభాగం
స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
మార్చు- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ & ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
- కోస్టల్ ఇంజనీరింగ్
- జియోలాజికల్ టెక్నాలజీ
- సెంటర్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్
స్కూల్ ఆఫ్ ఫిజికల్, కెమికల్ అండ్ అప్లైడ్ సైన్సెస్
మార్చు- భౌతిక శాస్త్ర విభాగం
- కెమిస్ట్రీ విభాగం
- ఎర్త్ సైన్సెస్ విభాగం
- అప్లైడ్ సైకాలజీ విభాగం
స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్
మార్చు- బయోకెమిస్ట్రీ & మాలిక్యులర్ బయాలజీ
- బయోటెక్నాలజీ
- ఎకాలజీ & ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
- ఓషన్ స్టడీస్ అండ్ మెరైన్ బయాలజీ (పోర్ట్ బ్లెయిర్)
- ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ
- సెంటర్ ఫర్ బయోఇన్ఫర్మేటిక్స్ (BIF)
- మైక్రోబయాలజీ విభాగం
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్
మార్చుహ్యుమానిటీస్ బ్లాక్ -2
మార్చు- ఇంగ్లీష్, తులనాత్మక సాహిత్యం
- ఫ్రెంచ్
- హిందీ
- సంస్కృత
- వేదాంతం
- శారీరక విద్య & క్రీడలు
- ఆసియా క్రిస్టియన్ స్టడీస్‌లో ఎస్కాండే చైర్
హ్యుమానిటీస్ బ్లాక్ -1
మార్చుస్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్
మార్చు- ఆంత్రోపాలజీ
- ఆర్కియాలజీ
- చరిత్ర
- రాజకీయాలు, అంతర్జాతీయ అధ్యయనాలు
- సామాజిక సేవ
- సోషియాలజీ
- సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్
- మదన్జీత్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఆసియా రీజినల్ కోఆపరేషన్ - సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ *
- సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ & కలుపుకొనిన విధానం *
- ప్రొఫెసర్ జె ఎ కె తరీన్ వైస్ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు XII ప్రణాళికలో ఈ కేంద్రాలు స్థాపించబడ్డాయి.
స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్
మార్చు- స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్
- సెంటర్ ఫర్ అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్
- స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
స్కూల్ ఆఫ్ మీడియా & కమ్యూనికేషన్
మార్చు- లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్
- ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ కమ్యూనికేషన్ విభాగం
- మదన్జీత్ స్కూల్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్
- సెంటర్ ఫర్ నానో సైన్స్ & టెక్నాలజీ
- సెంటర్ ఫర్ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ
ప్రముఖ వ్యక్తులు
మార్చు- బాబు గోగినేని -మానవ హక్కుల వాది
మూలాలు
మార్చు- ↑ "Vice-Chancellor | Pondicherry University". www.pondiuni.edu.in. Retrieved 30 November 2017.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-13. Retrieved 2020-05-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-03-28. Retrieved 2020-05-28.
- ↑ pondicherry university report. "pondiuni.edu.in/sites/default/files/downloads/Information%20Chart%202018-19.pdf" (PDF). Archived from the original (PDF) on 2020-02-28. Retrieved 2020-05-26.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)
బయటి లింకులు
మార్చు- https://web.archive.org/web/20200419073809/http://www.pondiuni.edu.in/
- lib.pondiuni.edu.in
- http://www.pondiuni.edu.in/sites/default/files/downloads/Prospectus_2018-19.pdf
- https://books.google.co.in/books?id=z4plAAAAIBAJ&pg=PA15&dq=pondicherry+university&article_id=288,3172260&hl=en&sa=X&ved=0ahUKEwiyla7x2-DpAhUtzDgGHd7nB0MQ6AEIODAC
- https://books.google.co.in/books?id=tV2jmwEACAAJ&dq=pondicherry+university&hl=en&sa=X&ved=0ahUKEwi3i7yH2uDpAhVQeysKHT7HBnoQ6AEIMTAB