పాకిస్తానీ పంజాబ్ లో క్రైస్తవం

పంజాబీ క్రైస్తవులు పాకిస్తాన్ లోని క్రైస్తవ సమూహాల్లో అతి ఎక్కువ సంఖ్యాకులు. ప్రావిన్సులోని ప్రధానమైన మత సమూహం ముస్లిములు, వారు జనాభాలో 90 శాతానికి పైగా ఉన్నారు. లాహోర్లోని చర్చిల్లో కేథెడ్రల్ చర్చ్ ఆఫ్ రిసరెక్షన్, సేక్రెడ్ హార్ట్ కేథెడ్రెల్, లాహోర్, సెయింట్ ఆండ్రూస్ చర్చ్, లాహోర్, సెయింట్ జోసెఫ్ చర్చి, లాహోర్ వంటివి ఈ ప్రాంతంలో నెలకొన్నాయి. పాకిస్తానీ పంజాబ్ లో క్రైస్తవులు మతహింసకు గురయ్యారు.[1] ఆసియా బీబీ మతమార్పిడి హింసాత్మక కార్యక్రమాల నడుమ సాగింది, ఆమెను పంజాబీ ప్రభుత్వ వర్గాలు చంపేస్తాయని బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.[2] బ్రిటీష్ పరిపాలనలో హిందు, చురా, మఝబీ సిక్ఖు మతాల నుంచి క్రైస్తవంలోకి మారారు.[3]

పాకిస్తాన్ లోపంజాబ్ లో కైస్తవులు

1839 వేసవిలో మహారాజా రంజీత్ సింగ్ మరణించడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడి, తర్వాతి వారసత్వ యుద్ధాల్లో దర్బారు రాజ్యాన్ని బలహీనం చేసింది. ఆ పరిణామాల అనంతరం రెండు ఆంగ్లో-సిక్ఖు యుద్ధాలు జరిగి చివరకు ఆంగ్లేయులకు పంజాబ్ ఆఖరున దత్తమైన రాజ్యంగా బ్రిటీష్ ఇండియాలో 1849లో కలిసిపోయింది.

1877లో సెయింట్ థామస్ దినోత్సవాన వెస్ట్ మినిస్టర్ అబ్బే, లండన్ లో రెవరెండ్ థామస్ వల్పై ఫ్రెంచ్ తొలి ఆంగ్లికన్ బిషప్ ఆఫ్ లాహోరును నియమించి, దాని కింద అప్పటి బ్రిటీష్ వలస పాలనలోని మొత్తం పంజాబ్ లో క్రైస్తవ కార్యకలాపాలు బాధ్యత అప్పగించారు. ఇది 1887 వరకూ ఇలానే కొనసాగింది. ఆ కాలంలో ఆయన లాహోర్ డివినిటీ కళాశాలను 1870లో తెరిచారు. [4][5][6] రెవరెండ్ థామస్ పాట్రిక్ హ్యూస్ చర్చి మిషనరీ సొసైటీ యొక్క మిషనరీగా పెషావర్ లో (1864–84) పనిచేసి, ప్రాచ్య పండితుడై డిక్షనరీ ఆఫ్ ఇస్లాం (1885) గ్రంథాన్ని సంకలనం చేశారు.[7]

మిషనరీలు పోర్చుగల్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ ప్రాంతాల నుంచి వలసదారులతో కలిసివచ్చారు. క్రైస్తవాన్ని ప్రధానంగా 18, 19 శతాబ్దాల్లో భారతదేశానికి బ్రిటీష్ పాలకులు తీసుకువచ్చారు. బ్రిటీష్ వారు నెలకొల్పిన నగరాల్లో ఈ అంశం సుస్పష్టంగా కనిపిస్తుంది. బ్రిటీష్ వారు అభివృద్ధి చేసిన రేవు నగరం కరాచీలో పాకిస్తాన్ లో అతిపెద్ద చర్చి అయిన సెయింట్ పాట్రిక్ కెథెడ్రల్, బ్రిటీష్ కంటోన్మెంట్ నెలకొల్పిన రావల్పిండిలో అనేక చర్చిలో ఆ దశలో నిర్మించినవే.

మొత్తం పంజాబీ క్రైస్తవుల సంఖ్య పాకిస్తాన్ లో దాదాపు 28 లక్షలు. వీరిలో దాదాపుగా సగం మంది రోమన్ కేథెలిక్ లు కాగా, మిగతా సగం ప్రొటెస్టెంట్లు. పలువురు ఆధునిక పంజాబీ క్రైస్తవులు బ్రిటీష్ పరిపాలన కాలంలో మతం మారిన వారి వారసులే, వారిలో చురా వర్గం నుంచి క్రైస్తవం స్వీకరించినవారూ ఉన్నారు. చురాలు బ్రిటీష్ ఇండియా కాలంలో ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున క్రైస్తవంలోకి మారారు. మత విషయాల్లో ఉత్సాహవంతులైన బ్రిటీష్ సైనికాధికారులు, క్రైస్తవ మిషనరీలు మఝబీ సిక్ఖు సముదాయం కూడా హిందూ చురాలతో పాటుగా క్రైస్తవం స్వీకరించారు. భారత విభజన తర్వాత వీరు పాకిస్తానీ పంజాబ్, భారత పంజాబ్ ప్రాంతాలలో విభజింపబడ్డారు.

ప్రావిన్సులో క్రైస్తవ వర్గాలు మార్చు

  • అసోసియేట్ రిఫార్మ్డ్ ప్రెస్బైతెరియన్ చర్చ్ ఇన్ పాకిస్తాన్
  • చర్చ్ ఆఫ్ పాకిస్తాన్
  • ప్రెబైతేరియన్ చర్చ్ ఆఫ్ పాకిస్తాన్
  • యునైటెడ్ ప్రెబైతేరియన్ చర్చ్ ఆఫ్ పాకిస్తాన్
  • న్యూ అపోస్తలిక్ చర్చ్ ఆఫ్ పాకిస్తాన్
  • రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ పాకిస్తాన్

మూలాలు మార్చు

  1. http://www.kathpress.co.at/content/site/nachrichten/database/27417.html
  2. http://pakistantoday.com.pk/pakistan-news/Regional/Lahore/20-Dec-2010/Christian-group-says-Punjab-govt-wants-Aasia-dead[permanent dead link]
  3. Alter, J.P and J. Alter (1986) In the Doab and Rohilkhand: north Indian Christianity, 1815-1915. I.S.P.C.K publishing p196
  4. Churches and Ministers: Home and Foreign Events New York Times, 13 January 1878.
  5. An Heroic Bishop Chapter VI. His Fourth Pioneer Work: The Lahore Bishopric.
  6. Beginnings in India By Eugene Stock, D.C.L., London: Central Board of Missions and SPCK, 1917.
  7. British Library Archived 2016-03-04 at the Wayback Machine. Mundus.ac.uk (18 July 2002).