పాట్రిక్ ప్యాటర్సన్

1961, సెప్టెంబర్ 15న జన్మించిన పాట్రిక్ ప్యాటర్సన్ (Balfour Patrick Patterson) 1980, 1990 దశాబ్దాలలో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ ఆటగాడు. 1986లో ఇంగ్లాండుతో జరిగిన సబీనా పార్క్ టెస్ట్‌లో మైకెల్ హోల్డింగ్ అందుబాటులో లేకపోవడంతో టెస్ట్ క్రికెట్‌లో రంగప్రవేశం చేసిన ప్యాటర్సన్ 1987లో ఫాస్ట్ బౌలర్‌గా ప్రముఖంగా వెలుగులోకి వచ్చాడు. తొలి టెస్టులోనే 7 వికెట్లు సాధించి హోల్డింగ్ లేని లోటును తీర్చాడు. అప్పటినుంచి 1992-93లో ఆస్ట్రేలియా పర్యటనలో క్రమశిక్షణ చర్య వలన అతడిని తొలిగించేవరకు క్రమం తప్పకుండా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి నిష్క్రమణ అనంతరం ఆ స్థానాన్ని వెస్ట్‌ఇండీస్ భర్తీ చేయలేకపోయింది. క్రమక్రమంగా వెస్ట్‌ఇండీస్ క్రికెట్‌లో పతనావస్థ ప్రారంభమైంది.

Patrick Patterson
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Balfour Patrick Patterson
పుట్టిన తేదీ (1961-09-15) 1961 సెప్టెంబరు 15 (వయసు 63)
Williamsfield, Jamaica
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm fast
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1986 ఫిబ్రవరి 21 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1993 నవంబరు 27 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే1986 ఫిబ్రవరి 18 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1993 ఫిబ్రవరి 25 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982–1998Jamaica
1984–1990Lancashire
1984–1985Tasmania
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 28 59 161 100
చేసిన పరుగులు 145 44 618 106
బ్యాటింగు సగటు 6.59 8.80 5.83 10.60
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 21* 13* 29 16
వేసిన బంతులు 4,829 3,050 24,346 5,115
వికెట్లు 93 90 493 144
బౌలింగు సగటు 30.90 24.51 27.51 24.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 1 25 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 5/24 6/29 7/24 6/29
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 9/– 32/– 15/–
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 19

టెస్ట్ క్రికెట్

మార్చు

ప్యాటర్సన్ తన క్రీడాజీవితంలో మొత్తం 28 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30.90 సగటుతో 93 వికెట్లను సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 5 సార్లు పడగొట్టినాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 24 పరుగులకు 5 వికెట్లు. ఇది 1987-88లో భారత పర్యటనలో సాధించిన రికార్డు. కేవలం 30.3 ఓవర్లలో ఆట తొలిరోజు ఒకే సెషన్‌లో ఆ గణాంకాలను నమోదుచేయడం విశేషం.[1]

వన్డే క్రికెట్

మార్చు

ప్యాటర్సన్ 59 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 24.51 సగటుతో 90 వికెట్లను సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 29 పరుగులకు 6 వికెట్లు.

ప్రపంచ కప్ క్రికెట్

మార్చు

1987 వివియన్ రిచర్డ్స్ నాయకత్వంలో, 1992 రిచీ రిచర్డ్‌సన్ నాయకత్వంలో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో ప్యాటర్సన్ వెస్ట్్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు

మార్చు
  1. 1st TEST: India v West Indies at Delhi, 25-29 Nov 1987