పాట పాడుమా కృష్ణా అనే లలిత గీతాన్ని సాలూరు రాజేశ్వరరావు రచించి స్వరపరచి గానం చేశారు. ఇది ఎంతో ప్రసిద్ధి పొందింది. దీన్ని ఆభేరి (కర్ణాటక)/భీంప్లాస్ (హిందూస్తానీ) రాగాంలో స్వరపరిచారు. తాళం - త్రిశ్ర ఏక (దాద్రా)

పాట సాహిత్యంసవరించు

పల్లవి:
పాట పాడుమా కృష్ణా - పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా - మనసు తీరగా || పాట పాడుమా ||

చరణం 1:
శ్రుతిలయాదులన్ని చేర్చి - యతులు నిన్ను మదిని తలచె
సదమల హృదయా నిన్ను - సన్నుతింతు వరనామము || పాట పాడుమా ||

చరణం 2:
సామవేదసారము సంగీతము సాహిత్యమెగా
దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా || పాట పాడుమా ||

బయటి లింకులుసవరించు