పాతనందాయపాలెం గుంటూరు జిల్లా, కర్లపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామ పంచాయతీ 2001 లో ఏర్పడింది. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామస్థులు, వార్డు సభ్యులనుండి సర్పంచి వరకూ అందర్నీ మహిళలనే ఎన్నుకున్నారు. సర్పంచిగా శ్రీమతి తంత్రి నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. ఈ గ్రామం 2001లో నల్లమోతువారిపాలెం పంచాయతీ నుండి విడిపోయి, ప్రత్యేక పంచాయతీగా ఏర్పడగా, ఇప్పటివరకూ 3 సార్లు ఎన్నికలు జరుగగా, 3 సార్లూ ఏకగ్రీవమే. తొలుత సర్పంచిగా శ్రీమతి రావి ప్రకాశమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2006లో ప్రకాశమ్మ భర్త శ్రీ రావి సుందరరామిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం సర్పంచిగా 2013 లో తంత్రి నాగమల్లేశ్వరిని ఎన్నుకున్నారు. వార్డు సభ్యులనందరినీ గూడా మహిళలనే ఎన్నుకున్నారు. [1]

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

గొర్రేల పెంపకం, వ్యవసాయం.

మూలాలు మార్చు