పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులతో పాటు పాపట్ల కాంతయ్య నాటక కవిగా ప్రసిద్ధిచెందాడు. ద్రౌపదీ మానసంరక్షణం (1936) వంటి కొన్ని తొలినాటి సినిమాలకు పాటల సృష్టికల్పన కూడా చేశారు. ఈ పాటలన్నీ గ్రాంధిక భాషా గుబాళింపులతో నిండి, వాటి స్వరగతులు కీర్తనా పద్ధతిలోగానీ మరాఠీ నాటక మెట్లతోగానీ వుండేవి.[1]

రాజమండ్రి గున్నేశ్వరరావు ఈయనను మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశానికి పరిచయం చేశారు. చింతామణి నాటక సమాజాలకు కాంతయ్య పాటలు రాశారు. అనంతరం మైలవరం కంపెనీలో వాగ్గేయకారుడిగా చేరి ప్రహ్లద, శాకుంతల, సావిత్రి మొదలయిన నాటకాలకు పాటలురాసి చాలా పేరు తెచ్చుకున్నారు.

నేటికీ వృత్తి నాటక సమాజాల వారు పాడే ప్రార్థనా గీతం ’పరబ్రహ్మ పరమేశ్వర‘ ఈయన స్వరపరచినదే. వేములవాడ దేవాలయ ఆస్థాన పండితుడిగా ఆమరణాంతం వ్యవహరించారు.

మూలాలుసవరించు